VinFast : భారత 2 వీలర్​ ఈవీ సెగ్మెంట్​లోకి విన్​ఫాస్ట్? వైపర్​ ఎలక్ట్రిక్ స్కూటర్​ పేటెంట్ వివరాలు..

VinFast Viper : వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘విన్‌ఫాస్ట్’ భారత ఈవీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన పాపులర్ ‘వైపర్’ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌ను భారతదేశంలో పేటెంట్ పొందింది. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 29, 2026, 17:28:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌కు ఉన్న డిమాండ్‌ను చూసి అంతర్జాతీయ దిగ్గజాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి! ఇప్పటికే ఫోర్-వీలర్ ఈవీ సెగ్మెంట్‌లో దూసుకెళుతున్న వియత్నాం బ్రాండ్ ‘విన్‌ఫాస్ట్’.. ఇప్పుడు భారత టూ-వీలర్ మార్కెట్‌పై కూడా కన్నేసింది. ఈ క్రమంలోనే దేశీయంగా తన సరికొత్త 'వైపర్' ఎలక్ట్రిక్ స్కూటర్​కి సంబంధించి డిజైన్ పేటెంట్‌ను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ విన్​ఫాస్ట్​ వైపర్​ ఎలక్ట్రిక్ స్కూటర్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

విన్​ఫాస్ట్​ వైపర్​ ఎలక్ట్రిక్ స్కూటర్..
విన్​ఫాస్ట్​ వైపర్​ ఎలక్ట్రిక్ స్కూటర్..

సరికొత్తగా విన్​ఫాస్ట్ వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్..

లీకైన పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న వైపర్ మోడల్‌తో పోలిస్తే భారత్‌లో పేటెంట్ పొందిన స్కూటర్ డిజైన్ మరింత షార్ప్‌గా, అప్‌డేటెడ్‌గా కనిపిస్తోంది. దీని ఫ్రంట్ ఆప్రాన్ ప్యానెల్స్ సరికొత్త లుక్‌ను కలిగి ఉండగా, హెడ్‌ల్యాంప్ సెటప్‌కు యాంగ్యులర్ ఎల్‌ఈడీ లైటింగ్ సిగ్నేచర్‌ను ఇచ్చారు. వెనుక భాగంలో స్లిమ్ టెయిల్ ల్యాంప్, రీ-డిజైన్ చేసిన గ్రాబ్ రైల్ ఆకట్టుకుంటున్నాయి.

భారతీయ కుటుంబాలకు నచ్చేలా ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, పొడవైన సింగిల్ పీస్ సీటు, 14-ఇంచుల స్టైలిష్ అలాయ్ వీల్స్‌ను ఇందులో ఉంచారు. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ను అమర్చారు.

విన్​ఫాస్ట్ వైపర్ ఎలక్ట్రిక్ స్కూటర్- రేంజ్, స్పెసిఫికేషన్లు (అంచనా)..

భారత మార్కెట్లోకి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే గ్లోబల్ మార్కెట్లో ఉన్న వైపర్ స్పెసిఫికేషన్ల ఆధారంగా ఈ స్కూటర్ వివరాలు ఇలా ఉండే అవకాశం ఉంది..

ఈ స్కూటర్ 1,950 ఎంఎం పొడవు, 712 ఎంఎం వెడల్పు, 1,122 ఎంఎం ఎత్తుతో పాటు 1,320 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ బ్యాటరీ, డ్యూయల్ బ్యాటరీ అనే రెండు ఆప్షన్లలో లభిస్తుంది.

సింగిల్ బ్యాటరీ (1.5కేడబ్ల్యూహెచ్ ఎల్​ఎఫ్​పీ): ఇది పూర్తి ఛార్జింగ్‌పై 82 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 70 కిమీ. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 గంటల సమయం పడుతుంది. ఇందులో 3 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు.

డ్యూయల్ బ్యాటరీ (3.0 కేడబ్ల్యూహెచ్): రెండు బ్యాటరీల సాయంతో ఇది గరిష్టంగా 145 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ కాగా, ఫుల్ ఛార్జింగ్‌కు 9 గంటల సమయం పడుతుంది. ఇందులో శక్తివంతమైన 5.2 కేడబ్ల్యూ మోటార్‌ను అందించారు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వైపర్​ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై విన్‌ఫాస్ట్ సంస్థ 4 ఏళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

ఇక భారత మార్కెట్లోకి వస్తే ఇది ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి స్థానిక బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

కాగా.. పేటెంట్ పొందినంత మాత్రాన ఈ స్కూటర్ ఇప్పుడే మార్కెట్లోకి వచ్చేస్తుందని చెప్పలేము కానీ, విన్‌ఫాస్ట్ సంస్థ భవిష్యత్తులో భారతీయ కస్టమర్ల కోసం ఒక పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కేవలం కార్లకే పరిమితం కాకుండా, భారత్‌లో ఎక్కువ సేల్స్ ఉండే స్కూటర్ సెగ్మెంట్‌ను కూడా క్యాష్ చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More