Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ లాంచ్ రేపే- ఇంటీరియర్ ఇలా ఉంటుంది! రేంజ్ ఎంతంటే..

Tata Sierra EV price : జూన్ 30న విడుదల కాబోతున్న మోస్ట్ అవేటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'టాటా సియెర్రా ఈవీ' ఇంటీరియర్ లుక్‌ను కంపెనీ టీజర్ రూపంలో అధికారికంగా వెల్లడించింది. ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్, క్వాడ్ వీల్ డ్రైవ్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ కారు రాబోతోంది. వివరాల్లోకి వెళితే..

Published on: Jun 29, 2026, 05:33:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతున్న టాటా మోటార్స్.. తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీల సరసన చేరడానికి ఐకానిక్ 'టాటా సియెర్రా ఈవీ' రెడీగా ఉంది. మంగళవారం, జూన్ 30న గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. టాటా.ఈవీ బ్రాండ్ నుంచి వస్తున్న ఆరో ఎలక్ట్రిక్ కారు ఇది. ఇటీవల ఈ కారు అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను ప్రదర్శించిన టాటా, తాజాగా దీని ఇంటీరియర్​కు సంబంధించిన అధికారిక టీజర్‌ను విడుదల చేసి వాహన ప్రియులను ఆకట్టుకుంది.

టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్..
టాటా సియెర్రా ఈవీ ఇంటీరియర్..

టాటా సియెర్రా ఈవీ- విలాసవంతమైన కేబిన్..

టీజర్ వివరాల ప్రకారం, సరికొత్త సియెర్రా ఈవీ ఇంటీరియర్ అత్యంత ఆధునికంగా, ప్రీమియం లుక్‌తో డిజైన్ చేశారు. ఇందులో టాటా హారియర్ ఈవీ తరహాలోనే పూర్తి డిజిటల్, ఎల్‌ఈడీ కలర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

టాటా సియెర్రా ఈవీ- కారు లోపల గమనించాల్సిన ప్రధానాంశాలు..

స్టీరింగ్ వీల్: దీని ఐసీఈ (ఇంధన) మోడల్ లాగే, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ 4-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను ఇచ్చారు. ఇది డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ వైట్ ఫినిషింగ్‌తో వస్తోంది. దీనిపై ఆడియో కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, కాల్ రిసెప్షన్ బటన్లు ఉన్నాయి.

ట్రిపుల్ స్క్రీన్ మ్యాజిక్: ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో డ్రైవర్ డిస్‌ప్లే, సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక స్క్రీన్‌ను అమర్చి 'త్రీ-స్క్రీన్ లేఅవుట్'ను తీసుకురాబోతున్నారు.

ఈవీ స్పెసిఫిక్ ఫీచర్లు: టాటా సియెర్రా ఈవీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా రీజెనరేటివ్ బ్రేకింగ్ కంట్రోల్స్, హెడ్-అప్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ డ్రైవింగ్ కోసం 'బూస్ట్ మోడ్' వంటి ఫీచర్లను చేర్చారు.

ప్రీమియం సదుపాయాలు: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ జోన్ ఏసీ, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, థియేటర్ లాంటి ఫీలింగ్ ఇచ్చే 12-స్పీకర్ల ప్రీమియం జేబీఎల్ ఆడియో సిస్టమ్ ఉన్నాయి.

టాటా సియెర్రా ఈవీ- పవర్‌ఫుల్ బ్యాటరీ, 500 కిమీ రేంజ్!

టాటా సియెర్రా ఈవీ పర్ఫార్మెన్స్ పరంగానూ దుమ్మురేపనుంది. ఇందులో 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల రెండు భారీ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఇది సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్ సెటప్‌తో రానుంది.

65 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ దాదాపు 235 బీహెచ్​పీ పవర్‌ను, 315 ఎన్​ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుండగా.. పెద్దదైన 75 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వెర్షన్ ఏకంగా 390 బీహెచ్​పీ పవర్‌ను, 504 ఎన్​ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ లార్జర్ బ్యాటరీ ప్యాక్ కలిగిన టాప్ మోడల్ ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని అంచనా!

టాటా సియెర్రా ఈవీ- ఆఫ్ రోడింగ్ కోసం క్వాడ్ వీల్ డ్రైవ్..

90ల కాలం నాటి ఒరిజినల్ లెజెండరీ టాటా సియెర్రా ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు దేశంలో ఎంతో క్రేజ్ ఉండేది. ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, కొత్త ఎలక్ట్రిక్ సియెర్రాలో టాటా అడ్వాన్స్‌డ్ క్వాడ్ వీల్ డ్రైవ్ (క్యూడబ్ల్యూ) లేదా ఆల్-వీల్ డ్రైవ్ సాంకేతికతను అందించబోతోంది. హారియర్ ఈవీ తర్వాత టాటా లైన్అప్‌లో క్యూడబ్ల్యూడీ సిస్టమ్‌తో వస్తున్న రెండో కారు ఇదే కావడం విశేషం.

ఇక ఈ టాటా సియెర్రా ఈవీ ఫీచర్లు, రేంజ్, ధర సహా ఇతర వివరాలు మంగళవారం జరగనున్న లాంచ్ ఈవెంట్​తో స్పష్టంకానున్నాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More