Tata Sierra : రెండు రోజుల్లో టాటా సియెర్రా ఈవీ లాంచ్- ఆ తర్వాత ‘సీఎన్జీ’ వేరియంట్ కూడా!
Tata Sierra CNG : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ ‘టాటా సియెర్రా’లో ఈవీ వర్షెన్‌ని జూన్ 30న లాంచ్ చేయనుంది. ఆ తర్వాత సియెర్రాలో సీఎన్జీ, ఏడబ్ల్యూడీ వేరియంట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి! ఆ వివరాలు..
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ కార్లలో 'టాటా సియెర్రా ఈవీ' ఒకటి. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ జూన్ 30, 2026న ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా విడుదల చేయబోతోంది. అయితే, కేవలం ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రమే కాకుండా సాంప్రదాయ ఇంధన (ఐసీఈ) ప్రియుల కోసం కూడా టాటా భారీ ప్లాన్ వేసింది! ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా.. ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ, రగ్గడ్ ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్లను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.
ఇటీవల రోడ్లపై జరిపిన టెస్టింగ్ స్పై షాట్స్ ద్వారా వీటికి సంబంధించిన లాంచ్ టైమ్‌లైన్, సాంకేతిక వివరాలు లీకయ్యాయి.
టాటా సియెర్రా ఐసీఎన్జీ- పండుగ సీజన్‌లో ఎంట్రీ!
టాటా సియెర్రా సీఎన్జీ లాంచ్ ఎప్పుడు? : దీపావళి 2026 పండుగ సీజన్ నాటికి.
ప్రస్తుత స్థితి: ఎమిషన్స్ టెస్టింగ్ జరుపుకుంటూ స్పై షాట్స్‌లో చిక్కింది.
ప్రీమియం గ్రీన్ మొబిలిటీ సెగ్మెంట్‌లో పట్టు సాధించడం కోసం టాటా మోటార్స్ ఈ కారులో తన పేటెంటెడ్ 'ఐసీఎన్జీ ట్విన్-సిలిండర్' టెక్నాలజీని ఉపయోగించబోతోంది. సాధారణ సీఎన్జీ కార్లలో సిలిండర్ వల్ల బూట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోతుంది. కానీ, టాటా ఈ కార్లో లగేజ్ స్పేస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా డిక్కీ ఫ్లోర్ క్రింద పక్కపక్కనే రెండు చిన్న సిలిండర్లను అమర్చనుంది.
సియెర్రా ఐసీఎన్జీలో ఏ ఇంజన్ ఇస్తారనేది ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, మైలేజ్- పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ కోసం 106 బీహెచ్పీ పవర్‌ని ఇచ్చే 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను వాడే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టాటా సియెర్రా ఏడబ్ల్యూడీ : ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం..
లాంచ్ ఎప్పుడు? : 2027 మధ్య నాటికి.
ప్రస్తుత స్థితి: అధికారికంగా ప్రకటించారు, త్వరలోనే టెస్టింగ్ ప్రారంభం కానుంది.
ఆఫ్-రోడింగ్, రగ్గడ్ డ్రైవింగ్ ఇష్టపడే వారి కోసం 2027లో సియెర్రా ఐసీఈ వెర్షన్‌లో టాటా ప్రత్యేకంగా ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సెటప్‌ను తీసుకురానుంది. ఈ సరికొత్త సియెర్రా కారును టాటా కంపెనీ సరికొత్త 'ఆర్గోస్' ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ మల్టిపుల్ ఫ్యూయల్ ఆప్షన్లతో పాటు ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
సాధారణ వేరియంట్లు ఫ్రంట్-వీల్ డ్రైవ్‌తో రానుండగా, హై-ఎండ్ వేరియంట్లలో మాత్రం 1.5 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఏడబ్ల్యూడీ ఆప్షన్ లభించనుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ గరిష్టంగా 158బీహెచ్పీ పవర్‌ని, 255ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభించనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


