Tata Altroz : టాటా నుంచి అదిరిపోయే అప్‌డేట్! గేర్లు మార్చే పని లేని ‘ఆల్ట్రోజ్ సీఎన్జీ’ ఏఎంటీ లాంచ్..
Tata Altroz : టాటా మోటార్స్ సరికొత్త ఆల్ట్రోజ్ iCNG AMTని రూ. 8.69 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. భారత మార్కెట్లో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో ఏఎంటీ (AMT) గేర్‌బాక్స్ కలిగిన తొలి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే కావడం విశేషం.
Tata Altroz iCNG price : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తన పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సీఎన్జీ కార్లలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యాన్ని కోరుకునే వారి కోసం ‘ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ’ని లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 8,69,990 గా నిర్ణయించారు. ఈ అప్‌డేట్‌తో భారత మార్కెట్లో సీఎన్జీ ఇంజిన్‌తో పాటు ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఇస్తున్న ఏకైక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ వేరియంట్లు - ధరల వివరాలు..
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కారును ఐదు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చారు:
ప్యూర్ : రూ. 8,69,990
ప్యూర్ ఎస్ : రూ. 8,99,990
క్రియేటివ్ : రూ. 9,56,990
క్రియేటివ్ ఎస్ : రూ. 10,76,990
అకంప్లీష్డ్ ఎస్ : రూ. 10,76,990
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ పర్ఫార్మెన్స్ అదుర్స్.. ట్రాఫిక్‌లో హాయిగా!
ఈ హ్యాచ్‌బ్యాక్ కారులో 1.2-లీటర్ రెవోట్రాన్ ఐసీఎన్జీ ఇంజిన్‌ను వాడారు. ఇది సీఎన్జీ మోడ్‌లో 72.5 బీహెచ్పీ పవర్‌ని, 103 ఎన్ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే పని లేకుండా, గేర్లు మార్చే శ్రమ లేకుండా డ్రైవింగ్‌ను సులభతరం చేసేందుకు టాటా ఇందులో ఏఎంటీ గేర్‌బాక్స్‌ను జత చేసింది. అంతేకాకుండా, పెట్రోల్ నుంచి సీఎన్జీకి, మళ్లీ సీఎన్‌జీ నుంచి పెట్రోల్‌కు ఎంతో సాఫీగా మారేలా అడ్వాన్స్‌డ్ సింగిల్ ఈసీయూ టెక్నాలజీని సైతం ఉపయోగించారు.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ- స్పేస్, డిజైన్..
సాధారణంగా సీఎన్జీ కార్లలో సిలిండర్ వల్ల డిక్కీ (బూట్ స్పేస్) ఉండదు. కానీ టాటా పేటెంట్ పొందిన ‘ట్విన్ సిలిండర్’ టెక్నాలజీతో సిలిండర్లను లగేజ్ ఫ్లోర్ కింద అమర్చారు. దీనివల్ల సీఎన్జీ మోడ్‌లో కూడా 210 లీటర్ల ఉపయోగపడే బూట్ స్పేస్ లభిస్తుంది.
డిజైన్ పరంగా.. ఇన్‌ఫినిటీ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, లోపల హర్మాన్ నుంచి వచ్చిన 10.25 ఇంచ్ ట్విన్ డిజిటల్ స్క్రీన్‌లు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ వేరియంట్లకు ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ ఏఎంటీ- భద్రతలో రాజీ లేదు..
టాటా కార్లంటేనే భద్రతకు మారుపేరు. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్ వెర్షన్ల మాదిరిగానే సీఎన్జీ వెర్షన్ కూడా భారత్ ఎన్‌సీఏపీ రేటింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
"దేశంలో సీఎన్జీ వాడకం వేగంగా పెరుగుతోంది. అందుకే వినియోగదారుల సౌకర్యం కోసం ఐసీఎన్జీ లైనప్‌లో ఏఎంటీని ప్రవేశపెట్టాం. స్పేస్, భద్రత విషయంలో రాజీ పడకుండా, డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేయడమే మా లక్ష్యం," అని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవాత్స తెలిపారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ప్రశ్న: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT ధర ఎంత? ఏ ఏ వేరియంట్లలో లభిస్తుంది?
సమాధానం: దీని ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్ S, అకంప్లిష్డ్ S అనే ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
2. ప్రశ్న: ఈ కొత్త మోడల్ ప్రత్యేకత ఏమిటి?
సమాధానం: భారత మార్కెట్లో సీఎన్‌జీ పవర్‌ట్రెయిన్‌తో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (AMT) సౌకర్యాన్ని అందిస్తున్న మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఇదే కావడం విశేషం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


