కేరళలోని వయనాడ్‌ను భారీ వర్షాలు, కొండచరియల విపత్తు మరోసారి వణికించింది. మంగళవారం కురిసిన కుండపోత వానల ధాటికి వయనాడ్ పరిధిలోని మేప్పాడి సమీపంలో గల కల్లాడి వద్ద భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ‘అనాక్కంపోయిల్ - కల్లాడి - మేప్పాడి’ ట్విన్ టన్నెల్ (సొరంగ మార్గం) ప్రాజెక్ట్ ప్రవేశ ద్వారం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా 30 మందికిపైగా మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. సహాయక చర్యల కొనసాగుతున్నాయి.

కోజికోడ్ - వయానాడ్ జిల్లాలను అనుసంధానించే ప్రతిష్టాత్మక సొరంగ మార్గ పనులు కల్లాడిలోని మీనాక్షి బ్రిడ్జ్ పరిసరాల్లో జరుగుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి వయానాడ్ ప్రాంతంలో అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో ప్రాజెక్ట్ సైట్ వద్ద భారీగా పేరుకుపోయిన మట్టి, కొండరాళ్లు ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చాయి. అక్కడ తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న కార్మికులు, ఇంజనీర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఈ మట్టి ప్రవాహంలో చిక్కుకుపోయారు. కొద్దిరోజుల క్రితమే పనులకు స్టాప్ మెమో జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో కార్మికులు సైట్‌లో లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే కల్పెట్టాకు చెందిన ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది, స్థానిక పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికుల సహాయంతో ఇప్పటివరకు చాలా మంది మంది ప్రాణాలతో రక్షించి మేప్పాడిలోని విమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులేనని కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే బురద, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జేసీబీ వంటి భారీ యంత్రాలను తరలించడం రెస్క్యూ టీమ్స్‌కు సవాల్‌గా మారింది. మట్టి కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. మలప్పురం-వయానాడ్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ ఘోర ప్రమాదంపై కేరళ ప్రభుత్వం స్పందించింది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ స్థలంలో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్, విపత్తు నిర్వహణ సంస్థ కాంట్రాక్టర్లకు ముందే హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. అధికారుల ఆదేశాలను కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానిక మంత్రులు ఆరోపిస్తున్నారు.
{{/usCountry}}ఈ ఘోర ప్రమాదంపై కేరళ ప్రభుత్వం స్పందించింది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ స్థలంలో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్, విపత్తు నిర్వహణ సంస్థ కాంట్రాక్టర్లకు ముందే హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. అధికారుల ఆదేశాలను కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానిక మంత్రులు ఆరోపిస్తున్నారు.
{{/usCountry}}వయానాడ్, కోజికోడ్ జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండ ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంది.
కాగా వయానాడ్‌లో 2024 జులైలో సంభవించిన కొండచరియల విపత్తులో 298 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే మళ్లీ కొండచరియలు విరగడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.