...
...
Next Story

Kia Carnival Hybrid వచ్చేస్తోంది- టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో అదిరిపోయే ఫీచర్లు! మైలేజ్ ఎంతంటే?

భారత మార్కెట్లో లగ్జరీ ఎంపీవీ సెగ్మెంట్‌ను ఏలుతున్న కియా కార్నివాల్‌లో త్వరలో స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్ రాబోతోంది. శక్తివంతమైన 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌తో రానున్న ఈ కొత్త మోడల్ వివరాలను కియా ఇండియా అధికారికంగా వెల్లడించింది.

Published on: Sep 6, 2026, 16:21:06 IST
Advertisement

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన ఫ్లాగ్‌షిప్ ఎంపీవీ 'కార్నివాల్'లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల సోరెంటో మోడల్‌ను పరిచయం చేసిన సందర్భంలోనే, భారత్‌లోకి కార్నివాల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాబోయే కొద్ది వారాల్లోనే ఈ కారు మనదేశంలో లాంచ్ కానుంది. ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తున్న ఈ లగ్జరీ కారులో ఇకపై పవర్​ఫుల్ పెట్రోల్-హైబ్రిడ్ ఆప్షన్ కూడా లభించనుంది.

పవర్ ఫుల్ టర్బో-హైబ్రిడ్ ఇంజిన్ పవర్..

కియా కార్నివాల్ హైబ్రిడ్ లాంచ్ త్వరలోనే!
కియా కార్నివాల్ హైబ్రిడ్ లాంచ్ త్వరలోనే!

కొత్త కియా కార్నివాల్ హైబ్రిడ్ కారులో 1.6 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 180 హెచ్‌పీ పవర్, 265 ఎన్ఎమ్ టాప్‌ను విడుదల చేస్తుంది. అయితే సోరెంటో హైబ్రిడ్‌తో పోలిస్తే, కార్నివాల్ ఎంపీవీ పరిమాణం పెద్దది కావడంతో ఇందులో మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ఏకంగా 73.4 హెచ్‌పీ పవర్, 304 ఎన్ఎమ్ టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది—అంటే సోరెంటో కంటే 8.4 హెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్ ఎక్కువ అన్నమాట.

ఈ హైబ్రిడ్ సిస్టమ్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, పూర్తి సిస్టమ్ అవుట్‌పుట్‌ వివరాలను కంపెనీ ఇంకా రహస్యంగానే ఉంచింది. అయితే, ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. ప్రస్తుతం విక్రయిస్తున్న 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ (190 హెచ్‌పీ పవర్, 441 ఎన్ఎమ్ టార్క్, 8-స్పీడ్ ఆటోమేటిక్) కంటే ఈ హైబ్రిడ్ వెర్షన్ నగరాల్లో సైలెంట్ రైడింగ్ అనుభూతిని ఇస్తూ అత్యుత్తమ మైలేజ్ ఇస్తుందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

డిజైన్, ఫీచర్లలో మార్పులు లేవు!

కియా కార్నివాల్ హైబ్రిడ్​ ఎక్స్​టీరియర్ విషయానికి వస్తే డిజైన్‌లో పెద్దగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెనుక భాగంలో ఇచ్చే 'హెచ్​ఈవీ' బ్యాడ్జి తప్పించి మిగిలిన డిజైన్ అంతా ప్రస్తుత మోడల్ లాగే ఉంటుంది. కియా ఐకానిక్ టైగర్ నోస్ గ్రిల్, వర్టికల్ ఎల్​ఈడీ హెడ్‌లైట్లు, వీ-షేప్ డీఆర్​ఎల్స్, పవర్డ్ స్లైడింగ్ డోర్లు, 18-ఇంచుల ఏరో డైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో ఇది ఎంతో రాయల్‌గా కనిపిస్తుంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో కియా కార్నివాల్ కేవలం టాప్-స్పెక్ ‘లిమోసిన్ ప్లస్’ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.65 లక్షలుగా ఉంది. ఈ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను డీజిల్ మోడల్ కంటే కాస్త తక్కువ ధరకు తీసుకొస్తారా లేక ప్రీమియం ధర నిర్ణయిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. టయోటా వెల్‌ఫైర్ వంటి అత్యంత ఖరీదైన ఎంపీవీలకు తక్కువ ధరలో బెటర్ ఆల్టర్నేటివ్‌గా ఈ కార్నివాల్ హైబ్రిడ్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక భారత్‌లో ఈవీలతో పాటు హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కియా పెద్ద వ్యూహాన్నే అమలు చేస్తోంది. '2026 సీఈఓ ఇన్వెస్టర్ డే' వేదికగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాబోయే రోజుల్లో సైరోస్ ఈవీ, సోరెంటో హైబ్రిడ్, కార్నివాల్ హైబ్రిడ్ సహా మొత్తం 8 ఎలక్ట్రిఫైడ్ మోడళ్లను భారత రోడ్లపైకి తేనుంది. ఇందులో భాగంగానే నెక్ట్స్ జనరేషన్ సెల్టోస్‌ను కూడా ఎలక్ట్రిఫైడ్ పోర్ట్‌ఫోలియోలోకి మార్చేందుకు కసరత్తు చేస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe