Discounts on Kia cars : కియా కార్లపై అదిరే డిస్కౌంట్లు- ఇంకొన్ని రోజులే ఛాన్స్! రూ. 2.7లక్షల వరకు ఆదా..
Kia car offers : భారత మార్కెట్లో కియా కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక మే నెలలో విక్రయాలను మరింత పెంచేందుకు కంపెనీ భారీ క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ బెనిఫిట్స్ తీసుకొచ్చింది. వాటి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
Kia Seltos offers May 2026 : మే 2026 నెలకు గానూ తమ లైనప్‌లోని కార్లపై అదిరిపోయే ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది కియా ఇండియా. కొత్తగా ఎస్‌యూవీ లేదా ఎంపీవీ కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. కియా సెల్టోస్, సోనెట్, సైరోస్, క్యారెన్స్ క్లావిస్, కార్నివాల్ వంటి పాపులర్ మోడళ్లపై ఈ ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ రివార్డులు అందుబాటులో ఉన్నాయి.

ఏ కారుపై ఎంతెంత డిస్కౌంట్ ఉందో మోడళ్ల వారీగా ఇక్కడ చూద్దాం:
1. కియా కార్నివాల్– అత్యధిక డిస్కౌంట్..
కియా లైనప్‌లోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఎంపీవీ 'కియా కార్నివాల్' పై ఈ నెలలో గరిష్ట ఆఫర్లు లభిస్తున్నాయి.
మొత్తం ప్రయోజనాలు: గరిష్టంగా రూ. 2.70 లక్షల వరకు లభిస్తాయి.
ఇందులో రూ. 2 లక్షల వరకు కేవలం ఎక్స్ఛేంజ్ సపోర్ట్ రూపంలోనే రాగా.. అదనంగా స్క్రాపేజ్, కార్పొరేట్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. ప్రీమియం ఫ్యామిలీ కారు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.
2. కియా క్యారెన్స్ క్లావిస్, క్లావిస్ ఈవీ..
కియా తమ క్యారెన్స్ క్లావిస్ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వేరియంట్లపై భారీ ఆఫర్లను ఇస్తోంది.
టర్బో-పెట్రోల్ వేరియంట్లు: ఎంపిక చేసిన టర్బో వేరియంట్లపై రూ. 1.55 లక్షల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. దీనితో పాటు ఉచితంగా 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా కియా అందిస్తోంది.
డీజిల్ అండ్ నార్మల్ పెట్రోల్: వీటిపై రూ. 85,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
క్యారెన్స్ క్లావిస్ ఈవీ : ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ కొనుగోలుపై కస్టమర్లు మొత్తంగా రూ. 2.15 లక్షల వరకు భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు.
3. కియా సెల్టోస్..
హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీనిచ్చే కియా సెల్టోస్ మిడ్-సైజ్ ఎస్‌యూవీపై కూడా మంచి ఆఫర్ ఉంది.
మోడల్ ఇయర్ 2025 (ఎంవై25) కి సంబంధించిన పాత స్టాక్‌పై గరిష్టంగా రూ. 95,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
4. కియా సైరోస్ అండ్ కియా సోనెట్..
కియా సైరోస్: ఎంవై25 ఇన్వెంటరీపై రూ. 85,000 వరకు ఆఫర్లు ఉండగా.. సరికొత్త ఎంవై26 మోడళ్లపై రూ. 50,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
కియా సోనెట్: టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓలతో పోటీ పడే ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఎంవై26 స్టాక్‌పై రూ. 35,000 వరకు, ఎంవై25 యూనిట్లపై రూ. 30,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.
పైన పేర్కొన్న మోడళ్లతో పాటు స్టాండర్డ్ కియా క్యారెన్స్ మోడల్‌పై కూడా ఈ నెలలో రూ. 40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
కార్లపై లభించే ఈ ఖచ్చితమైన ఆఫర్ల వివరాలు, ఆన్-రోడ్ ధరల కొరకు కస్టమర్లు తమ సమీపంలోని అధికారిక కియా డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఈ ఆఫర్లు మే 2026కి మాత్రమే వర్తిస్తాయని గమనించాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


