సన్‌రూఫ్ ఉన్న టాప్-5 ఎస్‌యూవీలు ఇవి.. ధర రూ. 15లక్షల కన్నా తక్కువే!
పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! ఇండియాలో రూ. 15లక్షల కన్నా తక్కువ ధరకు, సన్‌రూఫ్ ఫీచర్‌తో లభిస్తున్న టాప్-5 ఎస్‌యూవీల లిస్ట్‌ని ఇక్కడ చూడండి..
చాలా మంది భారతీయులు ఇప్పుడు ఒక కారు కొనేముందు అనేక ఫీచర్లను దృష్టిల్ పెట్టుకుంటున్నారు. ఆ చెక్-లిస్ట్ పూర్తి అయితేనే సంబంధిత మోడల్ని కొనేందుకు ముందుకెళుతున్నారు. ఈ చెక్-లిస్ట్‌లో పానోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ కచ్చితంగా ఉంటోంది!

భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో కార్లలో పానోరమిక్ సన్‌రూఫ్‌ల ప్రాక్టికాలిటీపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నప్పటికీ, ఈ ఫీచర్ వాటి మోడల్, పరిమాణంతో సంబంధం లేకుండా కార్లకు ఒక ప్రీమియం లుక్ ఇస్తుందనడంలో సందేహం లేదు. వాస్తవానికి గతంలో ఈ ఫీచర్ లగ్జరీ, ప్రీమియం కార్లకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు మాస్ మార్కెట్ మోడల్స్‌కి కూడా అందుబాటులోకి వచ్చింది.
మీరు పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన, రూ. 15 లక్షల లోపు ధర కలిగిన ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ టాప్ ఐదు ఆప్షన్స్‌ని ఇస్తున్నాము. చెక్ చేయండి..
రూ. 15లక్షల లోపు ధరలో సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీలు..
1. కియా సైరోస్-
పానోరమిక్ సన్‌రూఫ్‌తో భారతదేశంలో లభిస్తున్న అత్యంత చవకైన కారు ఈ కియా సైరోస్! ఈ ఫీచర్ హెచ్టీకే+, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్+, హెచ్‌టీఎక్స్+ (ఓ) వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ. 10.74 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే తన ఫీచర్ ప్యాక్డ్ ప్రీమియం క్యాబిన్, బెస్ట్ ఇన్ క్లాస్ స్పేస్‌తో అనేక ప్రమాణాలను నెలకొల్పింది. ఇందులో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 5.0-ఇంచ్ క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లేతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంది. దీంతో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ వంటి కీలక ఫీచర్లు కూడా లభిస్తాయి.
2. టాటా నెక్సాన్-
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీల్లో ఒకటైన టాటా నెక్సాన్ అనేక ఫీచర్లతో కూడిన సరసమైన ప్యాకేజీగా ఉంది! ఈ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో లభించే ముఖ్య లక్షణాల్లో ఒకటి పానోరమిక్ సన్‌రూఫ్. ఈ ఫీచర్ ఉన్న క్రియేటివ్ ప్లస్ పీఎస్, ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ వేరియంట్ల ధర రూ. 11.25 లక్షల నుంచి రూ. 14.15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది పానోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన భారతదేశంలోనే అత్యంత చవకైన కార్లలో ఒకటి. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
3. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ-
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా పానోరమిక్ సన్‌రూఫ్ లభిస్తుంది. ఇది ఏఎక్స్7, ఏఎక్స్7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 11.66 లక్షల నుంచి రూ. 14.40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆసక్తికరంగా, ఈ సెగ్మెంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ పొందిన మొదటి కారు ఇది. అంతేకాక, ఒకప్పుడు ఈ ఫీచర్ ఉన్న అత్యంత చవకైన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ కూడా ఇదే. ఇందులో డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, లెవల్ 2 అడాస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
4. హ్యుందాయ్ క్రెటా-
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటైన హ్యుందాయ్ క్రెటా ఈఎక్స్(ఓ), ఎస్(ఓ), ఎస్(ఓ) నైట్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్ ప్రీమియం, ఎస్ఎక్స్(ఓ), కింగ్, కింగ్ నైట్ వంటి ట్రిమ్స్‌లో పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. వీటి ధర రూ. 12.52 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. క్రెటాలో పానోరమిక్ సన్‌రూఫ్‌తో పాటు డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ 10.25-ఇంచ్ స్క్రీన్‌లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
5. టాటా సియెర్రా-
తాజాగా మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా భారత మార్కెట్‌లో అతిపెద్ద పానోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. సాధారణంగా సన్‌రూఫ్ మధ్య లేదా అధిక వేరియంట్స్‌లో లభిస్తుంది. కానీ సియెర్రా ఈ ఫీచర్‌ను బేస్ వేరియంట్ నుంచే అందిస్తుంది. రూ. 14.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే ఈ ఎస్‌యూవీలో ట్రిపుల్ స్క్రీన్ సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఏఆర్ ఆధారిత హెడ్-అప్ డిస్‌ప్లే, లెవల్ 2 అడాస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


