Lalithaa Jewellery IPO : లలితా జ్యువెలరీ ఐపీఓకి బంపర్​ లిస్టింగ్- ఏకంగా 32శాతం లాభాలు!

Lalithaa Jewellery IPO listing : లలితా జ్యువెలరీ ఐపీఓకి బంపర్​ లిస్టింగ్ లభించింది. ఏకంగా 32శాతం లాభాలు వచ్చాయి! ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 24, 2026, 10:07:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

లలితా జ్యువెలరీ ఐపీఓకి భారత స్టాక్​ మార్కెట్​లో బంపర్​ లిస్టింగ్​ లభించింది. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ లలితా జ్యువెలరీ షేర్లు దాదాపు 32శాతం లాభాలతో లిస్ట్ అయ్యాయి. బీఎస్​ఈలో 31.99శాతం లాభాలతో రూ. 265.3 వద్ద , ఎన్​ఎస్​ఈలో 31.84 లాభాలతో రూ. 265 వద్ద షేర్లు అడుగుపెట్టాయి.

లలితా జ్యువెలరీ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..
లలితా జ్యువెలరీ ఐపీఓ లిస్టింగ్ అప్డేట్స్..

కంపెనీ ఐపీఓ ఇష్యూ ధర రూ. 201గా ఉంది. మార్కెట్లో గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) అంచనాల కంటే కొద్దిగా తక్కువగా లిస్ట్ అయినప్పటికీ, ఇన్వెస్టర్లకు మాత్రం ఈ లలితా జ్యువెలరీ ఐపీఓ అద్భుతమైన లాభాన్ని అందించింది. మార్కెట్లోకి రాకముందు జీఎంపీ సుమారు రూ. 74 వరకు ఉండటంతో రూ. 275 వద్ద లిస్ట్ అవుతుందని అంతా భావించారు.

లలితా జ్యువెలరీ ఐపీఓ వివరాలు..

రూ. 1,700 కోట్ల విలువైన ఈ మెయిన్‌బోర్డ్ ఐపీఓ ఆగస్టు 17 నుంచి ఆగస్టు 19 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంది. ఈ పబ్లిక్ ఇష్యూకి మార్కెట్లో మంచి స్పందన లభించింది. మొత్తంగా ఈ ఐపీఓ 66.63 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది.

అత్యధికంగా అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు (క్యూఐబీ) కోటా 154 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ) విభాగం 78 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 12.51 రెట్లు భర్తీ అయ్యాయి. ఉద్యోగుల కోసం కేటాయించిన కోటా 9.10 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్స్​ఛేంజ్ డేటా వెల్లడించింది.

ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను ప్రధానంగా కొత్త స్టోర్‌ల ఏర్పాటు ద్వారా వ్యాపార విస్తరణకు, అలాగే కార్పొరేట్ అవసరాలకు ఉపయోగించనున్నట్లు లలితా జ్యువెలరీ కంపెనీ తెలిపింది.

లలితా జ్యువెలరీ ఐపీఓ- కంపెనీ నేపథ్యం, ఆర్థిక పరిస్థితి..

దక్షిణాది రాష్ట్రాల్లో లలితా జ్యువెలరీ మార్ట్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. లలితా బ్రాండ్ పేరుతో బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలను విక్రయిస్తున్న ఈ సంస్థకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరిలలో మొత్తం 61 స్టోర్లు ఉన్నాయి.

ఆర్థికంగానూ కంపెనీ అద్భుతమైన వృద్ధిని సాధించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 177 శాతం దూసుకుపోయి రూ. 1,009.8 కోట్లకు చేరుకుంది. అలాగే రెవెన్యూ 48.1 శాతం పెరిగి రూ. 25,023.9 కోట్లకు తాకినట్లు కంపెనీ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం ఉత్తమం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More