Milky Mist IPO : మిల్కీ మిస్ట్ ఐపీఓతో లాభాలు! జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా?

Milky Mist IPO GMP : ప్రముఖ డైరీ ఉత్పత్తుల సంస్థ మిల్కీ మిస్ట్ ఐపీఓ రేపు, ఆగస్టు 11న ప్రారంభం కానుంది. రూ. 1,553 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఆఫర్ ధరల శ్రేణిని కంపెనీ రూ. 133-140గా నిర్ణయించింది. మరి ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ ఎంత? అప్లై చేయాలా? వద్దా? ఇక్కడ చూసేయండి..

Published on: Aug 10, 2026, 09:59:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

స్టాక్ మార్కెట్​ ఇన్వెస్టర్లకు అప్డేట్! ప్రముఖ డైరీ ఉత్పత్తుల బ్రాండ్ 'మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్స్' ఐపీఓ రేపటి నుంచి (ఆగస్టు 11, మంగళవారం) సబ్‌స్క్రిప్షన్ కోసం మార్కెట్లోకి వస్తోంది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 13 (గురువారం) వరకు అందుబాటులో ఉంటుంది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ వివరాలు.. (Company Website)
మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ వివరాలు.. (Company Website)

రూ. 1,553 కోట్ల పబ్లిక్ ఆఫర్ కోసం కంపెనీ షేరు ధర రూ. 133 నుంచి రూ. 140 వరకు ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఈ ప్రైస్ బ్యాండ్ ప్రకారం.. ఐపీఓ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ. 10,310 కోట్ల నుంచి రూ. 10,778 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మిల్కీ మిస్ట్ ఐపీఓ- పూర్తి వివరాలు..

మిల్కీ మిస్ట్ ఐపీఓలో భాగంగా రూ. 1,428 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేస్తున్నారు. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) కింద రూ. 125 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. మొత్తంగా ఈ ఇష్యూ సైజ్ రూ. 1,553 కోట్లుగా ఉంది. ఈ ఐపీఓ పట్ల బ్రోకరేజ్ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. మదుపర్లు ఈ ఇష్యూకి 'సబ్‌స్క్రైబ్' చేయవచ్చని సిఫార్సు చేశాయి.

మిల్కీ మిస్ట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం..

మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ 17శాతం నుంచి 19శాతం లాభాల మధ్యలో ఊగిసలాడుతోంది. ఈ ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ. 26గా ఉంది. అంటే, అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​తో పోల్చితే ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ రూ. 26 లేదా దాదాపు 18.5శాతం లాభాలతో రూ. 166 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

అయితే, కేవలం గ్రే మార్కెట్​ ప్రీమియంను చూసి ఐపీఓకి సబ్​స్క్రైబ్ చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ జీఎంపీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ అప్లై చేయాలా? వద్దా?

మిల్కీ మిస్ట్ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చని ఎస్బీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసింది. సంప్రదాయ తక్కువ మార్జిన్లిక్విడ్ మిల్క్ వ్యాపారంతో పోలిస్తే, మిల్కీ మిస్ట్ ఎక్కువ మార్జిన్లు అందించే వ్యాల్యూ-యాడెడ్ డైరీ ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి పెడుతోందని బ్రోకరేజ్ పేర్కొంది.

ఎగువ ధరల శ్రేణి వద్ద ఈ ఐపీఓ వ్యాల్యూ ఎఫ్​వై26 పీఈ మల్టిపుల్ 84.9xగా ఉందని బ్రోకరేజ్ వెల్లడించింది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులతో రూ. 497 కోట్ల రుణాలను తీర్చివేయాలని కంపెనీ ప్రణాళిక వేసుకుంది. దీనివల్ల భవిష్యత్తులో వడ్డీ భారం తగ్గుతుందని ఎస్బీఐ సెక్యూరిటీస్ తెలిపింది. సామర్థ్య వినియోగం పెరగడం వల్ల రాబోయే రోజుల్లో బలమైన రెండంకెల వృద్ధి సాధించే అవకాశమూ ఉందని అంచనా వేసింది.

ఎఫ్​వై24-ఎఫ్​వై26 మధ్య కాలంలో కంపెనీ ఆదాయం, ఎబిట్​డా, నికర లాభంలో వరుసగా 31.3 శాతం, 40.5 శాతం, 155.6 శాతం సీఏజీఆర్ వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

ప్యాకేెజ్డ్ పన్నీర్ మార్కెట్లో కంపెనీకి 19 శాతం వాటా ఉంది. చీజ్, పెరుగు, యోగర్ట్ మార్కెట్లలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫుడ్ కంపెనీగా మిల్కీ మిస్ట్ నిలిచింది.

ఇక ఈ ఐపీఓ దీర్ఘకాలిక పెట్టుబడికి అద్భుతమైన అవకాశమని SIMFS లిమిటెడ్ విశ్లేషకులు తెలిపారు.

కంపెనీకి చెందిన విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణి, 74 వేల మందికి పైగా రైతులతో ఉన్న డైరెక్ట్ మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ నెట్‌వర్క్ దీనికి బలమైన పోటీతత్వాన్ని ఇస్తాయని బ్రోకరేజ్ పేర్కొంది. భవిష్యత్తులో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, అదనంగా 66,000 బ్రాండెడ్ కూలింగ్ అసెట్లను ఏర్పాటు చేయడం లాంటి ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది.

"కంపెనీ ప్రత్యేకమైన బిజినెస్ మోడల్, అనుసంధాన ఆపరేషన్స్, అద్భుతమైన అమలు సామర్థ్యాల కారణంగా.. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఈ ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాము," అని బ్రోకరేజ్ స్పష్టం చేసింది. భారతీయ డైరీ రంగంలో అతిపెద్ద ఐపీఓగా మిల్కీ మిస్ట్ నిలవనుంది.

పరాగ్ మిల్క్ ఫుడ్స్, హట్సన్ ఆగ్రో ప్రొడక్ట్, దొడ్లా డైరీ వంటి సంస్థలు ఈ రంగంలో దీనికి పోటీదారులుగా ఉన్నాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More