Stocks to buy : ట్రేడర్స్​ అలర్ట్​ ఈ రూ. 81 బ్రేకౌట్​ స్టాక్​తో లాభాలకు ఛాన్స్..

Stock market update : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 29, 2026, 09:02:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 417 పాయింట్లు పడి 76,887 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు కోల్పోయి 23,996 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ ఏకంగా 864 పాయింట్లు పడి 55,400 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 2,103.74 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,712.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో మైనర్​ అప్పర్​ షాడోతో కూడిన చిన్న రెడ్​ క్యాండిల్​ ఏర్పడింది. ఇది రేంజ్​ బౌండ్​కి సంకేతం. 23,813 వద్ద సపోర్ట్​ కనిపిస్తోంది. 2,4200 వద్ద రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. అది దాటితే మార్కెట్​లోకి బుల్స్​ తిరిగి రావొచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్ టెక్నికల్​ రీసెర్చ్ ఎనలిస్ట్​ నాగరాజ్ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.05 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.4శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.90 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. బ్రెంట్​ క్రూడ్​ 0.3శాతం పెరిగి బ్యారెల్​కి 111.60 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

కార్బోరండమ్ యూనివర్సల్- బై రూ. 968.15, స్టాప్​ లాస్​ రూ. 934, టార్గెట్​ రూ. 1050

ఎస్​జేవీఎన్- బై రూ. 81.79, స్టాప్​ లాస్​ రూ. 78.98, టార్గెట్​ రూ. 88

కిర్లోస్కర్ ఆయిల్​ ఇంజిన్స్- బై రూ. 1724.4, స్టాప్​ లాస్​ రూ. 1660, టార్గెట్​ రూ. 1850

లాయిడ్స్ మెటల్స్​ అండ్ ఎనర్జీ- బై రూ. 1751.9, స్టాప్​ లాస్​ రూ. 1690, టార్గెట్​ రూ. 1900

జేఎస్​డబ్లయూ ఎనర్జీ- బై రూ. 580.9, స్టాప్​ లాస్​ రూ. 558, టార్గెట్​ రూ. 630

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More