Stock market news : చమురు ధర మళ్లీ జంప్- ఈ రోజు స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Stock market updates : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 24, 2026, 08:16:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 852 పాయింట్లు పడి 77,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 205 పాయింట్లు కోల్పోయి 24,173 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 819 పాయింట్లు పడి 56,305 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,255 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 941 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“టెక్నికల్​గా చూసుకుంటే నిఫ్టీ50కి 23,950- 24,000 లెవల్స్​ వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,350- 24,400 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని చాయిస్​ బ్రోకింగ్​కి చెందిన సుమిత్​ బగాడియా వివరించారు.

కాగా అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బిగినర్లు ట్రేడింగ్​లో జాగ్రత్తగా ఉండాలని స్టాక్​ మార్కెట్​ నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.37 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.41శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.89 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా ఇరాన్ మధ్య అనిశ్చితి నేపథ్యంలో ముడి చమురు ధర విపరీతంగా పెరుగుతోంది. శుక్రవారం సైతం బ్రెంట్ క్రూడ్​ ధర 1.17శాతం పెరిగి బ్యారెల్​కి 106.3 డాలర్లకు ​చేరింది.

స్టాక్స్​ టు బై..

సాయ్ లైఫ్​ సైన్సెస్​- బై రూ. 1041, స్టాప్​ లాస్​ రూ. 1000, టార్గెట్​ రూ. 1111

బ్లాక్ బాక్స్- బై రూ. 548, స్టాప్​ లాస్​ రూ. 525, టార్గెట్​ రూ. 585

నోసిల్- బై రూ. 182.5, స్టాప్​ లాస్​ రూ. 174, టార్గెట్​ రూ. 195

ప్రివి స్పెషాలిటీ కెమికల్స్- బై రూ. 3250, స్టాప్​ లాస్​ రూ. 3115, టార్గెట్​ రూ. 3450

గ్రాన్యూల్స్​ ఇండియా- బై రూ. 686, స్టాప్​ లాస్​ రూ. 665, టార్గెట్​ రూ. 725

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More