Stock market : అమెరికా- ఇరాన్ మధ్య చర్చలు! స్టాక్ మార్కెట్లకు జోష్, ఆయిల్ డౌన్..
Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బీఆర్ అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ సూచీలు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 703 పాయింట్లు పడి 76,848 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 208 పాయింట్లు కోల్పోయి 23,843 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్లు పడి 55,605 వద్దకు చేరింది.
కాగా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా- ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరుగుతాయన్న అంచనాలతో బుధవారం నాడు ప్రపంచ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా కొనసాగుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,983.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,432.30 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 370 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“టెక్నికల్స్ని చూస్తే నిఫ్టీ50కి 23,650- 23,690 లెవల్స్ సపోర్ట్‌గా ఉన్నాయి. 23,950- 24,000 లెవల్స్ రెసిస్టెన్స్‌గా ఉన్నాయి. మార్కెట్లో లో లెవల్స్ నుంచి బయ్యర్ల ఆసక్తి కనిపిస్తోంది,” అని చాయిస్ బ్రోకింగ్‌కి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుమిత్ బగాడియా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.66 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.18శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.95 శాతం వృద్ధిచెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధరలు..
అమెరికా- ఇరాన్ చర్చల వార్తల నేపథ్యంలో ముడి చమురు ధరలు వరుసగా రెండో రోజు పడ్డాయి. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 0.37శాతం పడి బ్యారెల్‌కు 94.44 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
అకుమ్స్ డ్రగ్స్ అండ్ ఫార్మా- బై రూ. 524.40, స్టాప్ లాస్ రూ. 506, టార్గెట్ రూ. 566
హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్- బై రూ. 751.9, స్టాప్ లాస్ రూ. 725, టార్గెట్ రూ. 812
సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్- బై రూ. 569.3, స్టాప్ లాస్ రూ. 549, టార్గెట్ రూ. 615
ఎంక్యూర్ ఫార్మా- బై రూ. 1630.4, స్టాప్ లాస్ రూ. 1573, టార్గెట్ రూ. 1745
ఎన్ఎల్సీ ఇండియా- బై రూ. 271.8, స్టాప్ లాస్ రూ. 262, టార్గెట్ రూ. 292
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


