Stock Market : అమ్మో మండే! స్టాక్ మార్కెట్ భయాలు మళ్లీ మొదలు- ఈరోజు కూడా నష్టాలు తప్పవా?
Crude Oil prices : ఇరాన్ యుద్ధం వేళ చమురు ధర భారీగా పెరుగుతోంది. ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ సూచీలు సైతం అదే బాట పడతాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.
ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1690 పాయింట్లు పడి 73,583 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 487 పాయింట్లు కోల్పోయి 22,820 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1433 పాయింట్లు పడి 52,275 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ.4,367.30 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,566.15 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ నెలలో ఎఫ్ఐఐల విక్రయాలు రూ. 1లక్ష కోట్లు దాటేశాయి. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎఫ్ఐఐలు ఈ స్థాయిలో అమ్మకాలు చేయడం ఇదే మొదటిసారి!
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 261 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 22,450 లెవల్స్ కన్నా దిగువకు పడితే మరింత వీక్నెస్ కనిపించవచ్చు. 22,000 దగ్గర సపోర్ట్ ఉంది. 23,200 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.73 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.67శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.1 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ, సౌత్ కొరియా కాస్పీ 3.9శాతం మేర నష్టపోయయి.
Mutual funds : ఇక మ్యూచువల్ ఫండ్స్‌ని బహుమతిగా ఇవ్వొచ్చు! సెబీ 'గిఫ్ట్ కార్డ్' రూల్స్ ఇవే..
చమురు ధరలు..
ఇరాన్ యుద్ధం అనిశ్చితి వేళ ముడి చమురు ధరలు సోమవారం మరింత పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 3.10శాతం పెరిగి బ్యారెల్‌కి 116.06 డాలర్లకు చేరింది.
చమురు ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లకు అస్సలు మంచి విషయం కాదు.
స్టాక్స్ టు బై..
ఓఎన్జీసీ- బై రూ. 281.95, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 297
ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్- బై రూ. 668, స్టాప్ లాస్ రూ. 654, టార్గెట్ రూ. 700
నాల్కో- బై రూ. 371, స్టాప్ లాస్ రూ. 363, టార్గెట్ రూ. 390
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


