Stock market crash : బాబోయ్ మళ్లీ రక్తపాతమే! ఈ రోజు స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు..
Stock market updates : ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మరోసారి రక్తపాతం కనిపిస్తోంది. భారత్ స్టాక్ మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ప్రారంభం అవుతాయని గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తోంది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 326 పాయింట్లు పెరిగి 74,533 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 112 పాయింట్లు వృద్ధిచెంది 23,115 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 24 పాయింట్లు పడి 53,427 వద్దకు చేరింది.

ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లో గత 20 రోజులుగా అనిశ్చితి కొనసాగుతోంది. సోమవారం కూడా ప్రపంచ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,518.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,706.23 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 335 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 వీక్లీ చార్ట్‌లో డోజీ క్యాండిల్ని ఫార్మ్ అయ్యింది. ఇది బుల్లిష్ రివర్సల్‌కి సంకేతం. ఆర్ఎస్ఐ కూడా ట్రెండ్ రివర్సల్ని సూచిస్తోంది. కానీ 22,930 వద్ద ఉన్న సపోర్ట్‌ని హోల్డ్ చేస్తేనే నిఫ్టీ50లో రివర్సల్ కన్ఫర్మ్ అవుతుంది. 23,378- 23,868 దగ్గర కీలక రెసిస్టెన్స్ కనిపిస్తోంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ వినయ్ రజానీ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.96 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 1.51శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.01 శాతం డౌన్ అయ్యింది.
పశ్చిమాసియాలో అనిశ్చితుల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 5శాతం డౌన్లో ఉంది.
ముడి చమురు ధరలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ ధర 0.68శాతం పడి బ్యారెల్‌కి 111.43 డాలర్లకు చేరింది. ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న విషయం.
స్టాక్స్ టు బై టుడే..
జీపీఐఎల్- బై రూ. 262, స్టాప్ లాస్ రూ. 252, టార్గెట్ రూ. 277
ఎన్టీపీసీ- బై రూ. 381, స్టాప్ లాస్ రూ. 365, టార్గెట్ రూ. 410
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్- బై రూ. 238, స్టాప్ లాస్ రూ. 225, టార్గెట్ రూ. 260
ఎటర్నల్- బై రూ. 232, స్టాప్ లాస్ రూ. 220, టార్గెట్ రూ. 265
ఐసీఐసీఐ బ్యాంక్- బై రూ. 1245, స్టాప్ లాస్ రూ. 1225, టార్గెట్ రూ. 1275
ఐషేర్ మోటార్స్- బై రూ. 6909, స్టాప్ లాస్ రూ. 6800, టార్గెట్ రూ. 7220
డెల్హివరీ- బై రూ. 422.85, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 450
ఎన్టీపీసీ గ్రీన్- బై రూ. 101, స్టాప్ లాస్ రూ. 98, టార్గెట్ రూ. 108
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


