Stock market today : ఇరాన్‌పై దాడుల ఎఫెక్ట్- ఈరోజు స్టాక్ మార్కెట్ క్రాష్ అనివార్యమేనా?
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ సూచీలకు నష్టాలు తప్పేలా లేవు. ఈ నేపథ్యంలో మార్చ్ 2న గిఫ్ట్ నిఫ్టీ లైవ్, బంగారం- వెండి ధరలు, చమురు ధరలతో పాటు బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని ఇక్కడ చూసేయండి..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 961 పాయింట్లు పడి 81,287 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 318 పాయింట్లు కోల్పోయి 25,179 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 659 పాయింట్లు పడి 60,529 వద్దకు చేరింది.

శనివారం ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్‌లు సంయుక్త దాడులు చేశాయి. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం స్టాక్ మార్కెట్ పరిస్థితేంటని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,536.36 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 12,292.81 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 115 పాయింట్ల నష్టంలో ఉంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న గందరగోళం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 ఇప్పటికే డౌన్ ట్రెండ్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. చార్ట్ పాటర్న్ కూడా నెగిటివ్‌గానే ఉంది. సూచీ ఇక్కడి నుంచి 24,700 వరకు వెళ్లొచ్చు. 25,400 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.00 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.92 శాతం డౌన్ అయ్యింది.
కాగా శనివారం పరిణామాల అనంతరం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇంతే! సోమవారం ట్రేడింగ్ సెషన్లో అనేక దేశాల సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్ నిక్కీ 2శాతం పతనమైంది.
బంగారం, వెండి ధరలు ఇలా..
స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కనిపించినప్పుడు సేఫ్ హెవెన్‌గా భావించే బంగారం ధరలు పెరుగుతాయన్న విషయం తెలిసిందే. సోమవారం కూడా ఇదే జరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 5,400 డాలర్లను హిట్ చేసింది. స్పాట్ సిల్వర్ ఔన్సుకు 96డాలర్లు దాటింది.
చమురు ధరలకు రెక్కలు..
ఆయిల్ రిచ్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 7.6శాతం వృద్ధిచెంది బ్యారెల్‌కి 78.4 డాలర్ల మార్క్‌ను తాకింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
ప్రెసిషన్ వైర్స్ ఇండియా- బై రూ. 312, స్టాప్ లాస్ రూ. 297, టార్గెట్ రూ. 330
టీడీ పవర్ సిస్టెమ్స్- బై రూ. 903, స్టాప్ లాస్ రూ. 863, టార్గెట్ రూ. 966
అపొలో పైప్స్- బై రూ. 358, స్టాప్ లాస్ రూ. 344, టార్గెట్ రూ. 388
ఐడీబీఐ బ్యాంక్- బై రూ. 116, స్టాప్ లాస్ రూ. 112, టార్గెట్ రూ. 123
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్- బై రూ. 962, స్టాప్ లాస్ రూ. 904, టార్గెట్ రూ. 1030
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


