బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. అయితే, దరఖాస్తు గడువు చాలా తక్కువగా ఉంది, కాబట్టి ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకోండి.
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ | ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) |
| పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant) |
| మొత్తం ఖాళీలు | 180 |
| దరఖాస్తు ప్రారంభం | ఏప్రిల్ 16, 2026 |
| చివరి తేదీ | ఏప్రిల్ 30, 2026 |
| పరీక్ష తేదీ | జూన్ 2026 మొదటి వారం |
| అధికారిక వెబ్‌సైట్ | lichousing.com |
View All
అర్హతలు (Eligibility Criteria)
- విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- గమనిక: డిస్టెన్స్ (Correspondence), పార్ట్-టైమ్ లేదా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు కారు. కేవలం రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి.
- వయస్సు: ఏప్రిల్ 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (అభ్యర్థులు 02.04.1996 - 01.04.2005 మధ్య జన్మించి ఉండాలి).
ఎంపిక ప్రక్రియ (Selection Process)
{{^htLoading}} {{/htLoading}}
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది:
- ఆన్‌లైన్ పరీక్ష: ఆబ్జెక్టివ్ తరహాలో 200 మార్కులకు ఉంటుంది.
- ఇంటర్వ్యూ: పరీక్షలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పరీక్షా విధానం:
- సబ్జెక్టులు: ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్స్.
- ప్రశ్నలు: 200 (మార్కులు: 200).
- సమయం: 120 నిమిషాలు (2 గంటలు).
- నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్త!
దరఖాస్తు రుసుము (Application Fee)
- దరఖాస్తు ఫీజు: రూ. 800
- దీనికి అదనంగా 18% GST వర్తిస్తుంది.
- ఫీజును కేవలం ఆన్‌లైన్ మోడ్‌లో మాత్రమే చెల్లించాలి.
ఎలా అప్లై చేయాలి?
- ముందుగా lichousing.com వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
- 'Careers' సెక్షన్‌పై క్లిక్ చేసి, జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్‌ను ఎంచుకోండి.
- మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని, అప్లికేషన్ ఫారమ్ నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి.
- చివరగా అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోండి.