భారత రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. భారత సైన్యం (ఇండియన్ ఆర్మీ) తదుపరి చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది జూన్ 30న పదవీ విరమణ చేయనుండటంతో.. అదే రోజు మధ్యాహ్నం లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఆర్మీ చీఫ్‌గా (COAS) బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ నియామకంలో కేంద్ర ప్రభుత్వం సీనియారిటీ సూత్రాన్ని పాటించింది.
వైస్ చీఫ్ నుంచి అత్యున్నత పదవికి..
లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ప్రస్తుతం భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా సేవలందిస్తున్నారు. సైన్యంలో ఆధునికీకరణను వేగవంతం చేయడం, వ్యూహాత్మక ప్రణాళికలు రచించడంలో ఆయనకు పెట్టింది పేరు. ఖడక్వాస్లాలోని ప్రతిష్టాత్మక నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్, 1986 డిసెంబర్‌లో ఆర్మోర్డ్ కోర్స్‌లో చేరడం ద్వారా తన సైనిక ప్రస్థానాన్ని ప్రారంభించారు.
- ఎడారి ప్రాంతంలో ఆర్మోర్డ్ రెజిమెంట్‌కు, పశ్చిమ థియేటర్‌లో ఆర్మోర్డ్ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక దళానికి (కూడా ఆయన కమాండర్‌గా వ్యవహరించారు.
- భారత సైన్యంలోనే అత్యంత శక్తివంతమైన స్ట్రైక్ ఫార్మేషన్‌లలో ఒకటైన 'సుదర్శన్ చక్ర కార్ప్స్'కు ఆయన కమాండర్‌గా వ్యవహరించారు. అలాగే ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా సేవలు అందించారు.
- భారత సైన్యానికి చెందిన రెండు కీలక ఆపరేషనల్ కమాండ్‌లు అయిన సౌత్ వెస్ట్రన్ కమాండ్, సదరన్ కమాండ్‌లకు నేతృత్వం వహించిన అరుదైన ఘనత లెఫ్టినెంట్ జనరల్ ధీరాజ్ సేథ్ సొంతం. రెండున్నరేళ్లకు పైగా ఈ వ్యూహాత్మక థియేటర్లలో ఆయన రక్షణ పర్యవేక్షణ బాధ్యతలు చూశారు.
తన సుదీర్ఘ సర్వీసులో సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికలు, దళాల నిర్వహణ, సరికొత్త సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశేష సేవలకు గాను పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (UYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.
{{/usCountry}}తన సుదీర్ఘ సర్వీసులో సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికలు, దళాల నిర్వహణ, సరికొత్త సాంకేతిక సామర్థ్యాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ భద్రతకు ఆయన చేసిన విశేష సేవలకు గాను పరమ విశిష్ట సేవా మెడల్ (PVSM), ఉత్తమ యుద్ధ సేవా మెడల్ (UYSM), అతి విశిష్ట సేవా మెడల్ (AVSM) వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు లభించాయి.
{{/usCountry}}మిలిటరీ విద్యలో లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ ఎప్పుడూ టాపర్‌గా నిలిచారు. ఎన్నో రక్షణ కోర్సుల్లో ఆయన అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. హయ్యర్ కమాండ్ కోర్స్, నేషనల్ డిఫెన్స్ కాలేజీ (NDC) గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రతిష్టాత్మక 'కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్'కు కూడా హాజరై అంతర్జాతీయ రక్షణ వ్యూహాలపై పట్టు సాధించారు. ఈయన నియామకం పట్ల రక్షణ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.