...
...
Next Story

సన్​రూఫ్​తో Mahindra Scorpio Classic Facelift! డిజైన్​లో భారీ మార్పులు.. లాంచ్ ఎప్పుడు?

Mahindra Scorpio Classic Facelift launch : మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ డిజిటల్ రెండర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొత్త గ్రిల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఆకర్షణీయమైన అప్‌డేట్లతో ఈ ఎస్‌యూవీ రానుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 14, 2026, 05:58:16 IST
Advertisement

మహీంద్రా నుంచి అత్యంత ఆదరణ పొందిన స్కార్పియో క్లాసిక్ త్వరలో కొత్త హంగులతో మార్కెట్లోకి రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది! తాజాగా బయటకు వచ్చిన డిజిటల్ రెండర్ చిత్రాలు ఇందుకు కారణం. ఈ ఎస్‌యూవీ డిజైన్ ఎలా ఉండబోతుందనే దానిపై అధికారిక లాంచ్ కంటే ముందే ఇంటర్నెట్‌లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్- డిజైన్​లో మార్పులు..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్..
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్..

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్​కి సంబంధించిన కొత్త రెండర్ చిత్రాలను పరిశీలిస్తే, ముందు భాగంలో గ్రిల్‌ను పూర్తిగా మార్చేశారు! ప్రస్తుతం ఉన్న నిలువు స్లాట్ డిజైన్‌కు బదులుగా హనీకాంబ్ లేదా మెష్ ప్యాటర్న్‌ను పొందుపరిచారు. బంపర్‌ను కూడా కొత్తగా డిజైన్ చేసి, కింద వైపు పెద్దదైన సిల్వర్ కలర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌ను అమర్చారు. ఎస్​యూవీ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌ను అప్‌డేట్ చేశారు కానీ హెడ్‌ల్యాంప్ షేప్ మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంది.

ప్రస్తుతం బంపర్‌పై ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లకు బదులుగా క్రోమ్ గార్నిష్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లోనే కొత్త డీఆర్‌ఎల్‌లను కంపెనీ ఇస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్- సైడ్ ప్రొఫైల్, రేర్..

ఎస్​యూవీ పక్క భాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఫ్రంట్ ఫెండర్ గార్నిష్‌ను సవరించారు. టర్న్ ఇండికేటర్లను ఓఆర్‌వీఎం అద్దాలపైకి మార్చినట్లు తెలుస్తోంది. డోర్లు, వీల్ ఆర్చ్ క్లాడింగ్‌లను కూడా కొత్తగా తీర్చిదిద్దారు. అయితే ప్రస్తుత మోడల్‌లో ఉన్న సిల్వర్ లేదా క్రోమ్ ఇన్‌సర్ట్‌లను వీటిలో తొలగించారు.

ఈ కొత్త స్కార్పియో క్లాసిక్ ఇంటీరియర్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. కొత్త కలర్ థీమ్, అప్‌గ్రేడ్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, స్కార్పియో క్లాసిక్‌లో ఇప్పటివరకు లేని ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఫీచర్‌ను ఇందులో చేర్చవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే భద్రతా ప్రమాణాలు, సీటింగ్ లేఅవుట్‌లో ఎలాంటి మార్పులుంటాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఫేస్​లిఫ్ట్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..

అప్‌డేటెడ్ మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌లో పాత మోడల్‌లాగే శక్తివంతమైన 2.2-లీటర్ ఎమ్ హాక్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 130 బీహెచ్‌పీ పవర్‌ను, 300 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రస్తుతానికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, రియర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తోంది.

అయితే ఈ డిజైన్ల గురించి మహీంద్రా సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. లాంచ్ తేదీపై కూడా స్పష్టతనివ్వలేదు.

కాగా 2026 చివరి నాటికి ఈ ఎస్​యూవీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ అధికారికంగా ఈ మోడల్‌ను ధృవీకరించిన తర్వాతే ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు తెలుస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe