...
...
Next Story

Scorpio Lifestyler pick up : మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్.. అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త పికప్ ట్రక్!

మహీంద్రా నుంచి సరికొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్ రాబోతోంది. 2027 ఏప్రిల్ నాటికి మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ వాహనం ధర రూ. 19.79 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. టయోటా హీలక్స్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇస్తుంది.

Published on: Aug 15, 2026, 05:20:58 IST
Advertisement

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శక్తివంతమైన పికప్ ట్రక్ భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి వచ్చేస్తోంది. ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త 'స్కార్పియో లైఫ్‌స్టైలర్' ప్రొడక్షన్ మోడల్‌ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. 2023లో ప్రదర్శించిన గ్లోబల్ పికప్ కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని చాలా ఆకర్షణీయంగా సంస్థ తీర్చిదిద్దింది.

మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్..
మహీంద్రా స్కార్పియో లైఫ్‌స్టైలర్..

భారత మార్కెట్లోకి 2027 ఏప్రిల్ నాటికి ఈ వాహనం రానుంది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 19.79 లక్షల కంటే తక్కువగానే ప్రారంభం కానుందని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సరికొత్త వాహనాన్ని కేవలం 'లైఫ్‌స్టైలర్' అనే పేరుతో విక్రయించనున్నారు.

బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ఆర్కిటెక్చర్..

స్కార్పియో ఎన్ మోడల్‌లో వాడిన అదే బలమైన బాడీ-ఆన్-ఫ్రేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ లైఫ్‌స్టైలర్‌ను రూపొందించారు. అయితే దీనికి ప్రత్యేకమైన పికప్ బాడీని అమర్చడంతో పాటు బయటి డిజైన్‌లోనూ కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ముందు భాగంలో హై-మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, రివర్స్ ఎల్-షేప్ డీఆర్ఎల్స్, విశాలమైన గ్రిల్, నిలువుగా ఉండే ఫాగ్ ల్యాంప్స్ దీనికి మరింత దూకుడు లుక్‌ను తెచ్చిపెట్టాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కార్పియో ఎన్ కంటే ఎంతో ఆధునికంగా, లగ్జరీగా దీని ఇంటీరియర్‌ను తీర్చిదిద్దారు. డాష్‌బోర్డ్ మధ్యలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, త్రీ-స్పోక్ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్‌లో ఫిజికల్ కంట్రోల్స్‌ను యథాతథంగా ఉంచారు. క్యాబిన్ మొత్తం బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్‌తో చాలా రిచ్‌గా కనిపిస్తుంది.

వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్-కార్ టెక్నాలజీ, వివిధ డ్రైవింగ్ మోడ్స్‌ను ఇందులో చేర్చారు. అంతేకాకుండా ఈ పికప్ ట్రక్‌లో సర్ఫర్, ట్రైల్, వ్యాలీ అనే మూడు ప్రత్యేక వేరియంట్లను కూడా కంపెనీ ప్రదర్శించింది.

ఇంజిన్ వివరాలపై ఇంకా సస్పెన్స్..

ఈ సరికొత్త స్కార్పియో లైఫ్‌స్టైలర్ ఇంజిన్ సామర్థ్యం, గేర్‌బాక్స్, పనితీరుకు సంబంధించిన పూర్తి సాంకేతిక వివరాలను మహీంద్రా ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే గ్లోబల్ పికప్ ప్రోగ్రామ్‌లో ఫోర్-వీల్-డ్రైవ్ సామర్థ్యం ఉంటుందని కంపెనీ ఇదివరకే స్పష్టం చేసింది.

మార్కెట్లోకి వచ్చాక టయోటా హీలక్స్, ఇసుజు డీ-మ్యాక్స్ వి-క్రాస్ వంటి ప్రముఖ లైఫ్‌స్టైలర్ పికప్ ట్రక్కులకు ఇది గట్టి పోటీ ఇస్తుంది. కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధరను బట్టి చూస్తే, ఈ రెండు ప్రధాన ప్రత్యర్థుల కంటే ఇది చాలా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఏప్రిల్ 2027 లాంచ్‌ నాటికి వేరియంట్ల వారీగా ధరల వివరాలు వెల్లడవుతాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe