Best selling EV : మహీంద్రా సంచలనం! బెస్ట్ సెల్లింగ్ ఈవీగా ఎక్స్ఈవీ 9ఎస్- విండ్సర్‌ని వెనక్కి నెట్టి..
Mahindra XEV 9S : దేశీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఎంజీ విండ్సర్ ఈవీని వెనక్కి నెట్టి అత్యధికంగా అమ్ముడైన ఈవీగా నిలిచింది. పవర్ ఫుల్ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ ఏఐ ఫీచర్లు, గరిష్ట సేఫ్టీతో ఈ 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీ దూసుకెళ్తోంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో స్వదేశీ దిగ్గజం మహీంద్రా సరికొత్త సంచలనం సృష్టించింది! దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ వాహనంగా (ఈవీ) 'మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్' నిలిచింది. ఇన్నాళ్లు అగ్రస్థానంలో కొనసాగిన 'ఎంజీ విండ్సర్ ఈవీ'ని అధిగమించి ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోలో అత్యున్నత మోడల్‌గా వచ్చిన ఎక్స్ఈవీ 9ఎస్.. తన అద్భుతమైన ఫీచర్లు, రేంజ్‌తో భారత వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోందని చెప్పేందుకు ఇదే నిదర్శనం.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- బ్యాటరీ, పర్ఫార్మెన్స్..
వినియోగదారుల అవసరాలు, డ్రైవింగ్ ప్రాధాన్యతలకు అనుగుణంగా మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ మూడు వేర్వేరు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది:
59 kWh బ్యాటరీ ప్యాక్: రియర్ యాక్సిల్‌పై ఉండే ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా 227 bhp పవర్, 380 Nm టార్క్‌ను అందిస్తుంది.
70 kWh బ్యాటరీ ప్యాక్: రియర్ మోటార్ సాయంతో 241.3 bhp పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
79 kWh బ్యాటరీ ప్యాక్: అత్యంత శక్తివంతమైన ఈ వెర్షన్ 281 bhp పవర్, 380 Nm టాప్ టార్క్‌తో లభిస్తుంది.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- వేరియంట్లు..
ఈ ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొత్తం 6 వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది:
ప్యాక్ వన్ ఎబోవ్ 59 kWh
ప్యాక్ వన్ ఎబోవ్ 79 kWh
ప్యాక్ టూ ఎబోవ్ 70 kWh
ప్యాక్ టూ ఎబోవ్ 79 kWh
ప్యాక్ త్రీ 79 kWh
ప్యాక్ త్రీ ఎబోవ్ 79 kWh
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- అధునాతన ఫీచర్లు..
ఎక్స్ఈవీ 9ఎస్ ఎలక్ట్రిక్ కారు కేవలం పవర్ విషయంలోనే కాకుండా, క్యాబిన్ టెక్నాలజీలోనూ కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. మహీంద్రా తొలిసారిగా ప్రవేశపెట్టిన 'MAIA AI' ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఈ కారులోనే డెబ్యూ అయింది. ఇన్ఫోటైన్‌మెంట్, కంట్రోల్ సిస్టమ్‌లను ఇది మరింత సులభతరం చేస్తుంది.
డ్యాష్‌బోర్డ్‌పై విశాలమైన ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో పాటు వెనుక వరుస ప్రయాణికుల కోసం రెండు బీవైఓడీ (బ్రింగ్ యువర్ ఓన్ డివైజ్) ఎంటర్‌టైన్‌మెంట్ డిస్‌ప్లేలను అందించారు. డ్రైవింగ్ అనుభూతిని పెంచేందుకు 16-స్పీకర్ల హార్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్, డ్రైవర్ కోసం విజన్-ఎక్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే అమర్చారు. వీటితో పాటు 65W ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, యాంబియంట్ ఇంటీరియర్ లైటింగ్, ఫుల్ లెంగ్త్ స్కై రూఫ్, వీఆర్-అసిస్టెడ్ ఎల్ఈడీ మానిటరింగ్‌తో కూడిన అధునాతన ఏక్యూఐ ఎయిర్ ప్యూరిఫైయర్ సిస్టమ్ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్- భద్రత..
భద్రత విషయంలో మహీంద్రా అత్యున్నత ప్రమాణాలను పాటించింది. INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ వాహనం బలమైన నిర్మాణం, అనుకూలమైన బ్యాటరీ అమరికతో వస్తుంది.
కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు. వీటితో పాటు 5 రాడార్లు, 1 విజన్ కెమెరాతో పనిచేసే 'లెవెల్-2+ అడాస్' సేఫ్టీ సూట్‌ను చేర్చారు. సుదీర్ఘ ప్రయాణాల్లో డ్రైవర్ అలసటను గుర్తించి అప్రమత్తం చేసే 'డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్' సాంకేతికత కూడా ఉంది.
పెరుగుతున్న ఈవీ డిమాండ్‌కు అనుగుణంగా స్పేస్, టెక్నాలజీ, లగ్జరీల కలయికగా వచ్చిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ భారత ఆటో మార్కెట్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


