Mahindra SUV : రూ. 9.3 లక్షలకే పనోరమిక్ సన్‌రూఫ్! మహీంద్రా XUV 3XO కొత్త మోడల్ హైలైట్స్ ఇవే..
మహీంద్రా సంస్థ XUV 3XO మోడల్‌లో 'రెవెక్స్ ఎడ్జ్' వేరియంట్‌ను రూ.9.39 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10 లక్షల కంటే తక్కువ ధరలోనే పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ప్రీమియం ఫీచర్లను అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.
తెలుగు రాష్ట్రాల్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు కోరుకునే ఎస్‌యూవీ ప్రియుల కోసం ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. కంపెనీకి చెందిన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ శ్రేణిలో ‘రెవెక్స్ ఎడ్జ్’ అనే కొత్త వేరియంట్‌ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 9.39 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

మధ్యతరగతి కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఈ కొత్త వేరియంట్‌లో మహీంద్రా ప్యాక్ చేసిన ఫీచర్లు వాహన వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా భారీ ధర ఉండే టాప్ వేరియంట్లలో మాత్రమే లభించే అధునాతన సౌకర్యాలను తక్కువ ధరలోనే అందించడం ఈ మోడల్ ప్రత్యేకత!
రూ.10 లక్షల లోపే పనోరమిక్ సన్‌రూఫ్!
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ రెవెక్స్ ఎడ్జ్ (ఓ) పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌ను రూ. 9.89 లక్షల ధరతో ప్రవేశపెట్టారు. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ సిరీస్‌లోనే రూ.10 లక్షల లోపు ధరలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇవే కాకుండా, ఈ కొత్త కార్లలో 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, వైర్డ్ యాపిల్ కార్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, లెథరెట్ సీట్లు, రియర్ వ్యూ కెమెరా వంటి ఆధునిక వసతులు అందుబాటులోకి తెచ్చారు.
ఇక రెవెక్స్ ఎడ్జ్ (ఓ) ఆప్షనల్ ట్రిమ్‌లో రూఫ్ రెయిల్స్, ఆటోమేటిక్‌గా మడిచే అవుట్‌సైడ్ మిర్రర్లు (ఓఆర్వీఎంలు), పాసివ్ కీలేస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ వైపర్‌లను చేర్చారు.
అగ్రశ్రేణి భద్రతా ప్రమాణాలు..
ప్రయాణికుల రక్షణకు మహీంద్రా పెద్దపీట వేసింది. రెవెక్స్ ఎడ్జ్, ఎడ్జ్ (ఓ) రెండింటిలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ఐసోఫిక్స్ (ISOFIX) చైల్డ్ సీట్ మౌంట్లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, అందరు ప్రయాణికులకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లను ప్రామాణికంగా అందించారు.
శక్తివంతమైన ఇంజిన్.. తక్కువ ధరలో ఆటోమేటిక్!
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ రెవెక్స్ ఎడ్జ్ ఎస్‌యూవీ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.2 లీటర్ ఎమ్-స్టాలియన్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌లలో దీనిని కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో రాగా, డీజిల్ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ (ఏఎంటీ) రూపాల్లో లభిస్తుంది.
అంతేకాకుండా, మునుపటి 'రెవెక్స్ ఎం(ఓ)' పెట్రోల్ వేరియంట్‌లో కూడా కొత్తగా ఆటోమేటిక్ ఆప్షన్‌ను రూ. 9.99 లక్షలకే తీసుకొచ్చారు. దీనివల్ల రూ.10 లక్షలలోపే ఆటోమేటిక్ కారు సొంతం చేసుకునే అవకాశం లభించింది.
ధరలు, రంగుల వివరాలు..
కొత్తగా వచ్చిన ఈ వేరియంట్లు ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, నెబ్యులా బ్లూ, గెలాక్సీ గ్రే అనే ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభ్యమవుతాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ రెవెక్స్ ఎడ్జ్ వేరియంట్ల వారీగా ఎక్స్-షోరూమ్ ధరల వివరాలు:
రెవెక్స్ ఎడ్జ్ పెట్రోల్ ఎంటీ : రూ. 9.39 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ పెట్రోల్ ఏటీ : రూ. 10.59 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ డీజిల్ ఎంటీ : రూ. 10.59 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ (ఓ) పెట్రోల్ ఎంటీ : రూ. 9.89 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ (ఓ) పెట్రోల్ ఏటీ : రూ. 11.09 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ (ఓ) డీజిల్ ఎంటీ : రూ. 11.09 లక్షలు
రెవెక్స్ ఎడ్జ్ (ఓ) డీజిల్ ఏఎంటీ : రూ. 11.91 లక్షలు
రెవెక్స్ ఎం(ఓ) పెట్రోల్ ఏటీ : రూ. 9.99 లక్షలు
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


