మహీంద్రా XUV 7XO ఎస్‌యూవీకి క్రేజీ డిమాండ్- ఏడాది వరకు వెయిటింగ్ పీరియడ్!
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ క్రేజ్ తగ్గడం లేదు! వేరియంట్, ఇంజిన్ రకాన్ని బట్టి ఈ కారు కోసం కొన్ని వారాల నుంచి ఏకంగా ఏడాది వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ముఖ్యంగా బేస్ వేరియంట్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ 700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌గా ఇటీవలే మార్కె్లోకి వచ్చిన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ దుమ్మురేపుతోంది! ఈ కారు కోసం వినియోగదారులు క్యూ కడుతున్నారు. వేరియంట్, పవర్‌ట్రెయిన్ (పెట్రోల్/డీజిల్) ఆధారంగా ఈ ఎస్యూవీ డెలివరీ కోసం కొన్ని వారాల నుంచి ఏకంగా ఏడాది వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా గణాంకాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో మ్యాన్యువల్ కాన్ఫిగరేషన్లకు వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వెయిటింగ్ పీరియడ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ వెయిటింగ్ పీరియడ్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్: 12 నెలలు-
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 'ఏఎక్స్' వేరియంట్ కోసం ప్రస్తుతం అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ఉంది. రూ. 12.79 లక్షల ప్రారంభ ధరతో ఉండటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు లభిస్తుండటంతో మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఏర్పడింది.
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్ పెట్రోల్ ఎంటీ: 12 నెలలు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్ డీజిల్ ఎంటీ: 12 నెలలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్3: 5 నెలలు
ఏఎక్స్ వేరియంట్ కంటే ఎక్కువ ఫీచర్లు కలిగిన ఏఎక్స్3 ట్రిమ్ కూడా 'వాల్యూ-ఫర్-మనీ' ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్3 పెట్రోల్ ఎంటీ అండ్ ఏటీ: 5 నెలలు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్3 డీజిల్ ఎంటీ అండ్ ఏటీ: 5 నెలలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్5: 5 నెలలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ లైనప్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన వేరియంట్ ఈ ఏఎక్స్5. దీనిలో అడాస్ ఫీచర్ లేనప్పటికీ, ఒక కుటుంబానికి రోజువారీ అవసరమైన అన్ని ఫీచర్లు ఉండటంతో మధ్యతరగతి కుటుంబాలు దీనికే మొగ్గు చూపుతున్నాయి.
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్5 పెట్రోల్ ఎంటీ అండ్ ఏటీ: 5 నెలలు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్ డీజిల్ ఎంటీ అండ్ ఏటీ: 5 నెలలు
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్: నెలల తరబడి
టాప్-స్పెక్ మోడల్ అయిన ఏఎక్స్7 వేరియంట్లపై వెయిటింగ్ పీరియడ్ ఇతర మోడళ్లతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. లాంచ్ సమయంలోనే కంపెనీ చెప్పినట్టుగా, ముందుగా టాప్ వేరియంట్ల డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7 పెట్రోల్ ఎంటీ అండ్ ఏటీ: 4 వారాలు (ఒక నెల)
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7 డీజిల్ ఎంటీ అండ్ ఏటీ: 6 వారాలు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7ఎల్ పెట్రోల్ ఏటీ: 4 నెలల వరకు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7ఎల్ డీజిల్ ఎంటీ అండ్ ఏంటీ: 6 నెలలు
ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఏఎక్స్7 ఏడబ్ల్యూడీ: 4 వారాల వరకు
మీరు గనుక మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ ఎస్యూవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీ నగరంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించి ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్‌ను మరోసారి సరిచూసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


