ఎస్​యూవీ కొనాలా? ప్రస్తుతం ఉన్న 5 బెస్ట్​ ఆప్షన్స్​ ఇవి..

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో కాంపాక్ట్ ఎస్​యూవీల హవా నడుస్తోంది. కేవలం కంపెనీలు అందించిన స్పెసిఫికేషన్లు, ఇంజన్ ఆప్షన్లు, ఫీచర్ల ఆధారంగా బెస్ట్ అనిపించే ఐదు మోడళ్లపై ప్రత్యేక విశ్లేషణను ఇక్కడ చూసేయండి..

Published on: Feb 4, 2026, 06:19:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతదేశంలో కాంపాక్ట్ ఎస్​యూవీ మార్కెట్ ప్రస్తుతం ఎంతో రద్దీగా, తీవ్రమైన పోటీతో ఉంది. ఒకవేళ మీరు ఈ రోజు కొత్త కారు కొనాల్సి వస్తే.. కేవలం వాటి స్పెసిఫికేషన్లు, ఇంజన్ ఆప్షన్లు, బ్రాండ్ పొజిషనింగ్ ఆధారంగా టాప్​-5 కార్ల లిస్ట్​ని ఇక్కడ ఇస్తున్నాము. ఈ ఐదు మోడళ్లు డిజైన్, పవర్, మైలేజ్ వంటి విభిన్న అంశాల్లో తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్​లో ప్రస్తుతం ఉన్న ఈ టాప్​-5 బెస్ట్​ ఎస్​యూవీ ఆప్షన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

టాప్​ 5 బెస్ట్ ఎస్​యూవీ​ ఆప్షన్స్​ ఇవి..
టాప్​ 5 బెస్ట్ ఎస్​యూవీ​ ఆప్షన్స్​ ఇవి..

హ్యుందాయ్ వెన్యూ..

క్లీన్ డిజైన్, ప్రీమియం క్యాబిన్ అనుభూతిని కోరుకునే వారికి హ్యుందాయ్​ వెన్యూ ఇప్పటికీ ఫేవరెట్ ఆప్షన్.

ఇంజన్ అండ్​ పవర్: ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ (82 బీహెచ్​పీ), 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. టర్బో ఇంజన్ దాదాపు 118 బీహెచ్​పీ పవర్, 172 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, ఐఎంటీ నుంచి 7-స్పీడ్ డీసీటీ వరకు రకరకాల గేర్ బాక్స్ ఎంపికలు ఉన్నాయి.

ఇది అగ్రెసివ్ లుక్ కంటే కూడా టెక్నాలజీ, రిఫైన్‌మెంట్, సౌకర్యానికి ప్రాధాన్యత ఇచ్చే అర్బన్ ఎస్​యూవీగా కనిపిస్తుంది.

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ..

మీకు పవర్ లేదా ఇంజన్ శక్తి ముఖ్యం అనుకుంటే, మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ బలమైన పోటీదారు.

ఇంజన్ అండ్​ పవర్: దీని 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వివిధ ట్యూనింగ్స్‌లో లభిస్తుంది. టాప్ వెర్షన్ ఏకంగా 128 బీహెచ్​పీ వరకు పవర్ ఇస్తుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే 300 ఎన్​ఎం భారీ టార్క్‌ను అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్: మాన్యువల్, ఆటోమేటిక్.. రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో పాటు అత్యుత్తమ సేఫ్టీ స్పెసిఫికేషన్లను కోరుకునే వారిని ఈ ఎస్​యూవీ ఆకర్షిస్తుంది.

మారుతీ సుజుకీ బ్రెజ్జా..

తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజ్, సులభమైన మెయింటెనెన్స్ అనే మారుతీ సుజుకీ సూత్రానికి బ్రెజ్జా ఎస్​యూవీ మంచి ఉదాహరణ.

ఇంజన్ అండ్​ పవర్: ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది సుమారు 101 బీహెచ్​పీ పవర్‌ను ఇస్తుంది. రన్నింగ్ కాస్ట్ తగ్గించుకోవాలనుకునే వారి కోసం ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ట్రాన్స్‌మిషన్: 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా లేకపోయినా, అత్యంత నమ్మదగిన కాంపాక్ట్ ఎస్​యూవీ.

స్కోడా కైలాక్..

బిల్డ్ క్వాలిటీస సేఫ్టీకి స్కోడా పెట్టింది పేరు. కైలాక్ కూడా అదే బాటలో బలమైన ముద్ర వేస్తోంది.

ఇంజన్ అండ్​ పవర్: ఇందులో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ వాడారు. ఇది 114 బీహెచ్​పీ పవర్, 178 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్: 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో ఇది లభిస్తుంది.

భారీ ఫీచర్లు ఉండటం కంటే కూడా.. కారు క్వాలిటీ, డ్రైవింగ్ అనుభవం, పెద్ద బూట్ స్పేస్ కోరుకునే వారికి ఈ ఎస్​యూవీ సరైన ఎంపిక.

కియా సోనెట్..

అన్ని విభాగాల్లోనూ సమతుల్యతను పాటించే ఎస్​యూవీ.. ఈ కియా సోనెట్.

ఇంజన్ అండ్​ పవర్: దీని 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 118 బీహెచ్​పీ పవర్ ఇస్తుంది. మాన్యువల్, ఐఎంటీ లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్ బాక్సులతో ఇది వస్తుంది.

హై-లెవల్ ఫీచర్లు, ప్రీమియం క్యాబిన్, అందరికీ సరిపోయే ఇంజన్ ఆప్షన్లతో, ఈ లిస్ట్‌లో అత్యంత 'ఆల్​రౌండర్​' ఎస్​యూవీగా సోనెట్ నిలుస్తుంది.

అయితే గుర్తుంచుకోండి.. ఇది కేవలం పేపర్ మీద ఉన్న వివరాల ఆధారంగా చేసిన విశ్లేషణ మాత్రమే, నిజమైన రోడ్ టెస్టింగ్ ఫలితాలు రోజువారీ వాడకంలో కొంత మారవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More