మార్కెట్​లోకి ఎంజీ మెజెస్టర్- ఇంకొన్ని రోజుల్లో ఎస్​యూవీ లాంచ్​..

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎంజీ మెజెస్టర్ రెడీ అవుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఈ ఎస్​యూవీ లాంచ్​ కానుంది. దీనికి సంబంధించి సంస్థ తాజాగా ఒక టీజర్​ని విడుదల చేసి,  ఈ ఎస్​యూవీపై హైప్​ని పెంచేసింది. ఆ వివరాలు..

Published on: Feb 03, 2026 12:35 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్​యూవీ ‘మెజెస్టర్’ని భారత మార్కెట్​లో విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. 2025 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రదర్శించిన ఈ భారీ ఎస్​యూవీని ఫిబ్రవరి 12, 2026న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. కంపెనీ తన ప్రస్తుత మోడల్ గ్లోస్టర్ స్థానంలో లేదా దానికి ఎగువన ఈ ప్రీమియం మోడల్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఇక తాజాగా మరో టీజర్​ని సంస్థ రిలీజ్​ చేసింది. ఫలితంగా ఈ ఎస్​యూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..
ఎంజీ మెజెస్టర్​ ఎస్​యూవీ..

ఎంజీ మెజెస్టర్​- డిజైన్, లుక్: అదిరిపోయే స్టైల్

లేటెస్ట్​ టీజర్​లో మెజెస్టర్​ ఎస్​యూవీ రియర్​ ప్రొఫైల్​ని సంస్థ రివీల్​ చేసింది. ఫ్రెంట్​ ప్రొఫైల్​ని గతంలోనే చూపించింది. ఇక మెజెస్టర్ ఎస్​యూవీని ఎంజీ మోటార్ తన శ్రేణిలోనే అతి పొడవైన, వెడల్పైన, ఎత్తైన వాహనంగా అభివర్ణిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా 'డీ+' సెగ్మెంట్‌ను కంపెనీ సృష్టించింది.

ముందు భాగం: భారీ మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్, ఫాల్కన్ తరహా ఎల్​ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌తో ఈ ఎస్​యూవీ ఎంతో శక్తివంతంగా కనిపిస్తుంది.

సైడ్ ప్రొఫైల్: 19-ఇంచ్​​ భారీ అలాయ్ వీల్స్, విశాలమైన వీల్ ఆర్చ్‌లు వాహనానికి ఒక మస్క్యులర్​ లుక్‌ను ఇచ్చాయి.

వెనుక భాగం: వెనుక వైపున కారు మొత్తం వెడల్పుగా వ్యాపించి ఉండే ఫుల్-విడ్త్ ఎల్​ఈడీ లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిపై మెజెస్టర్ అని స్పష్టంగా రాసి ఉండటంతో పాటు సిల్వర్ ఫినిషింగ్‌తో ఉన్న భారీ బంపర్ దీనికి ప్రీమియం ఫీల్‌ను జోడిస్తుంది.

ఎంజీ మెజెస్టర్​- ఇంటీరియర్, ఫీచర్లు: లగ్జరీకి కేరాఫ్ అడ్రస్..

మెజెస్టర్ క్యాబిన్ లోపల అత్యాధునిక టెక్నాలజీతో కూడిన లగ్జరీ ఫీచర్లు ఉండబోతున్నాయి. ప్రధానంగా డ్యూయల్ 12.3-ఇంచ్ డిస్‌ప్లేలు (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ క్లస్టర్ కోసం) డ్రైవర్‌కు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.

ఎస్​యూవీలోని మరికొన్ని ఫీచర్లు..

వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్

360-డిగ్రీల కెమెరా వ్యూ

ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ)

ఎలక్ట్రిక్ టైల్‌గేట్

లెవల్ 2 అడాస్​ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)

ఎంజీ మెజెస్టర్​- ఇంజిన్ సామర్థ్యం, పనితీరు

ఎంజీ గ్లోస్టర్‌లో వాడుతున్న అదే నమ్మకమైన 2.0-లీటర్ డీజిల్ ట్విన్-టర్బో ఇంజిన్‌నే మెజెస్టర్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 212.5 బీహెచ్​పీ పవర్​ని, 478.5 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రియర్ వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్​లో టయోటా ఫార్చ్యూనర్‌ వంటి దిగ్గజ కార్లకు ఈ మెజెస్టర్ ఎస్​యూవీ గట్టి పోటీనిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ప్రారంభ ధర సుమారు రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని అంచనా.