ఫార్చ్యునర్‌కి గట్టి పోటీ ఈ ఎంజీ 'మెజెస్టర్’- అదిరే ఫీచర్లతో! లాంచ్ డేట్ ఇదే..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'మెజెస్టర్'ను ఫిబ్రవరి 12న ఆవిష్కరించనుంది. అదిరిపోయే లుక్స్, లగ్జరీ ఇంటీరియర్, పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారు గ్లోస్టర్ స్థానాన్ని భర్తీ చేయనుంది.
భారత ఆటోమొబైల్ మార్కెట్లోని భారీ ఎస్‌యూవీల సెగ్మెంట్లో ప్రకంపనలు సృష్టించేందుకు ఎంజీ మోటార్ సిద్ధమైంది! తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఎంజీ మెజెస్టర్’ను ఫిబ్రవరి 12, 2026న భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్లోస్టర్ స్థానంలో రానున్న ఈ కొత్త కారు.. మరింత బోల్డ్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను పలకరించనుంది.

ఆటో ఎక్స్‌పో 2025లో తొలిసారి మెరిసిన ఈ కారు, ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘మాక్సస్ డీ90’ ఆధారంగా మెజెస్టర్‌ను రూపొందించారు. దీని భారీ గ్లోస్-బ్లాక్ గ్రిల్, స్ల్పిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, మజిల్ బాడీ లైన్స్ ఈ ఎస్‌యూవీకి ఒక గంభీరమైన రూపాన్ని ఇస్తాయి. 20-ఇంచ్ డైమండ్-కట్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక భాగంలో డ్యూయల్ ఎగ్జాస్ట్ ఫినిషర్స్ దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను జోడిస్తాయి.
ఎంజీ మెజెస్టర్- ఫీచర్ల ఖజానా..
ఎంజీ మెజెస్టర్ లోపలి భాగం ఒక విలాసవంతమైన విడిదిని తలపిస్తుంది. పూర్తిగా నలుపు రంగులో ఉండే క్యాబిన్ ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది.
12.3-ఇంచ్ భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంతే పరిమాణంలో ఉండే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉన్నాయి.
వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వంటి సౌకర్యవంతమైన ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని సులభతరం చేస్తాయి.
ఎంజీ మెజెస్టర్- భద్రతకు పెద్దపీట..
ప్రయాణికుల రక్షణ కోసం ఎంజీ మోటార్ ఇందులో అత్యాధునిక భద్రతా ప్రమాణాలను చేర్చింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్, హిల్-డిసెంట్ అసిస్ట్ వంటి ఫీచర్లతో పాటు టాప్ వేరియంట్లలో ‘లెవల్ 2 అడాస్’ టెక్నాలజీ లభిస్తుంది. ఇది లేన్ డిపార్చర్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్ల ద్వారా డ్రైవర్‌కు ఎల్లవేళలా రక్షణగా ఉంటుంది.
ఎంజీ మెజెస్టర్- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
ఎంజీ మెజెస్టర్ పరిమాణంలో చాలా పెద్దది. దీని పొడవు 5,046 ఎంఎం, వీల్ బేస్ 2,950 ఎంఎంగా ఉండటం వల్ల లోపల స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించనున్నారు.
సింగిల్-టర్బో మోడల్ 158.7 బీహెచ్పీ పవర్, 373.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్విన్-టర్బో డీజిల్ వేరియంట్ 212.5 బీహెచ్పీ పవర్, 478.5 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. కస్టమర్లు తమ అవసరానికి తగినట్లుగా రియర్-వీల్ డ్రైవ్ లేదా ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న హైబ్రిడ్ వెర్షన్ భారత్‌లోకి వస్తుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇండియాలో లాంచ్ తర్వాత ఈ ఎంజీ మెజెస్టర్ బెస్ట్ సెల్లింగ్ టయాటో ఫార్చ్యునర్‌కి గట్టి పోటీ ఇస్తుందని అంచనాలు ఉన్నాయి.
మొత్తానికి, లగ్జరీ, పవర్ కలగలిసిన ఎస్‌యూవీ కోరుకునే వారికి ఎంజీ మెజెస్టర్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


