బెస్ట్​ సెల్లింగ్​ ఫార్చ్యునర్​, ఇన్నోవా క్రిస్టా ధరలను భారీగా పెంచేసిన టయోటా..

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియాలో తన వాహనాల ధరలను సవరించింది. దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీతో పాటు ఫ్యామిలీ ఎంపీవీ ఇన్నోవా క్రిస్టా ధరలను సంస్థ భారీగా పెంచేసింది. ఆ వివరాలు..

Published on: Jan 11, 2026, 15:30:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్​లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న టయోటా కార్ల ధరలు ఇప్పుడు మరింత ప్రియం కానున్నాయి. కొత్త ఏడాదిలో తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిపై టయోటా ధరల పెంపును ప్రకటించింది. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, గంభీరమైన లుక్‌తో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న 'ఫార్చ్యూనర్' ధర ఇప్పుడు ఏకంగా రూ. 74,000 వరకు పెరిగింది. అలాగే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఆల్-టైమ్ ఫేవరెట్ ‘ఇన్నోవా క్రిస్టా’ ధరను కూడా కంపెనీ పెంచేసింది.

బెస్ట్​ సెల్లింగ్​ ఫార్చ్యునర్ ధరలను భారీగా పెంచేసిన టయోటా..
బెస్ట్​ సెల్లింగ్​ ఫార్చ్యునర్ ధరలను భారీగా పెంచేసిన టయోటా..

టయోటా ఫార్చ్యూనర్: ఏ వేరియంట్‌పై ఎంత భారం?

వేరియంట్‌ను బట్టి ఫార్చ్యూనర్ ధర రూ. 51,000 నుంచి రూ. 74,000 వరకు పెరిగింది. ఇందులో కొన్ని కీలక మార్పులు కూడా జరిగాయి. గతంలో డీలర్ స్థాయిలో పరిమితంగా అందుబాటులో ఉన్న ‘లీడర్’ వేరియంట్‌ను కంపెనీ నిలిపివేసింది.

బేస్ వేరియంట్: అత్యంత తక్కువగా రూ. 51,000 పెరిగింది. దీనితో దీని ప్రారంభ ధర రూ. 33.65 లక్షల నుంచి రూ. 34.16 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది.

ఆటోమేటిక్ వేరియంట్: ప్రారంభ ధరపై రూ. 55,000 పెరగడంతో ఇప్పుడు ఇది రూ. 36.96 లక్షల వద్ద లభిస్తోంది.

టాప్-ఎండ్ మోడల్: ఫార్చ్యూనర్ జీఆర్ఎస్ వేరియంట్‌పై గరిష్టంగా రూ. 74,000 పెంచారు. ఫలితంగా దీని ధర రూ. 49.59 లక్షలకు చేరుకుంది.

లెజెండర్: ఈ ప్రీమియం మోడల్ ధర రూ. 71,000 వరకు పెరిగింది.

టయోటా ఫార్చ్యునర్​- కొత్త, పాత ధరలు
వేరియంట్2025 ధరలుప్రైజ్​ హైక్​2026 ధరలు
4X2 MT Petrol 33.65 లక్షలు 51,000 34.16 లక్షలు
4X2 MT 34.28 లక్షలు 52,000 34.8 లక్షలు
4X2 MT Leader 34.79 లక్షలు--
4X2 AT 36.41 లక్షలు 55,000 36.96 లక్షలు
4X2 AT Leader 36.92 లక్షలు--
4X4 MT 38.11 లక్షలు 57,000 38.68 లక్షలు
4X2 AT Legender 41.54 లక్షలు 63,000 42.17 లక్షలు
Neo Drive 4X4 AT 41.74 లక్షలు 63,000 42.37 లక్షలు
4X4 MT Legender 43.64 లక్షలు 66,000 44.3 లక్షలు
Neo Drive 4X4 AT Legender 46.75 లక్షలు 71,000 47.46 లక్షలు
GRS 48.85 లక్షలు 74,000 49.59 లక్షలు

ఇన్నోవా క్రిస్టా కూడా..

భారత్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎంపీవీల్లో ఒకటైన ఇన్నోవా క్రిస్టాపై కూడా టయోటా ధరల భారాన్ని మోపింది. వేరియంట్‌ను బట్టి రూ. 21,000 నుంచి రూ. 33,000 వరకు ధరలు పెరిగాయి.

లో-స్పెక్ జీఎక్స్​ వేరియంట్: దీనిపై అత్యధికంగా రూ. 33,000 పెంచారు.

మిడ్-స్పెక్ జీఎక్స్​+ మోడల్: దీని ధర సుమారు రూ. 21,000 పెరిగింది.

హై-స్పెక్ వీఎక్స్​, జెడ్​ఎక్స్​ వేరియంట్లు: వరుసగా రూ. 25,000, రూ. 26,000 మేర ధరలు పెరిగాయి.

తాజా సవరణ తర్వాత, ఇన్నోవా క్రిస్టా ధర రూ. 18.99 లక్షల నుంచి రూ. 25.53 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండనుంది. గతంలో ఇది రూ. 18.66 లక్షల వద్ద ప్రారంభమయ్యేది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లే ఈ ధరల సవరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్ల కోసం వెయిటింగ్ బాగానే పీరియడ్ ఉన్నప్పటికీ, ధరల పెంపు అమ్మకాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More