మహీంద్రా XUV 7XO పెట్రోల్ ఆటోమేటిక్: ఫీచర్లు, ధర.. తక్కువ బడ్జెట్‌లో ఏ వేరియంట్ బెస్ట్ ఆప్షన్?
మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీ ఎక్స్‌యూవీ700ని 'ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ' పేరుతో సరికొత్తగా లాంచ్ చేసింది. పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్ కొనాలనుకునే వారి కోసం తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే 'వాల్యూ ఫర్ మనీ' వేరియంట్ ఏదో ఇక్కడ తెలుసుకోండి..
ప్రీమియం త్రీ-రో ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్న మహీంద్రా.. తాజాగా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని లాంచ్ చేసింది. ఇది బెస్ట్ సెల్లింగ్ మహీంద్రా ఎక్స్‌యూవీ700కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్. ఈ కొత్త మోడల్ మొత్తం ఆరు వేరియంట్లలో (ఏఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7, ఏఎక్స్7 టీ, ఏఎక్స్7 ఎల్) అందుబాటులో ఉంది. ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు మాత్రం పాత ఎక్స్‌యూవీ700లో ఉన్నవే కొనసాగుతాయి.

ఒకవేళ మీరు పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే! ఉన్న ఆప్షన్స్‌లో ఏ వేరియంట్ ఎంచుకుంటే మీ డబ్బుకు సరైన విలువ (వాల్యూ ఫర్ మనీ) లభిస్తుందో ఈ చిన్న విశ్లేషణ మీకోసం.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పెట్రోల్ ఆటోమేటిక్: ఏ వేరియంట్ బెస్ట్?
సాధారణంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లలో బేస్ మోడల్ 'ఏఎక్స్' (ధర రూ. 13.66 లక్షలు, ఎక్స్-షోరూమ్) బెస్ట్ అనిపిస్తుంది. కానీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విషయానికి వస్తే కథ మారుతుంది. ఎందుకంటే 'ఏఎక్స్' బేస్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ఆప్షన్ అందుబాటులో లేదు.
ఏఎక్స్3 వేరియంట్: ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ 'ఏఎక్స్3' వేరియంట్ నుంచి ప్రారంభమవుతుంది. దీని ధర రూ. 17.47 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. పెట్రోల్ ఆటోమేటిక్ కోరుకునే మెజారిటీ కస్టమర్లకు ఈ ఏఎక్స్3 వేరియంట్ 'వాల్యూ ఫర్ మనీ' ఆప్షన్‌గా నిలుస్తుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో బేస్ వేరియంట్ ఫీచర్లతో పాటు డైనమిక్ గైడ్ లైన్స్‌తో కూడిన రియర్ వ్యూ కెమెరా, ఆటో-ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ ఓఆర్వీఎంలు, రియర్ వైపర్, వాషర్, రియర్ డీమిస్టర్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు లభిస్తాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బేస్ వేరియంట్లోని ఫీచర్లు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏఎక్స్5 వేరియంట్: ఒకవేళ మీకు లగ్జరీ ఫీచర్లు కావాలనుకుంటే ఏఎక్స్5 వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్, 17-ఇంచ్ అలాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఇందులో అదనంగా ఉంటాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ- ఇంజిన్, పర్ఫార్మెన్స్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్‌లో అత్యంత శక్తివంతమైన 2.0-లీటర్ ఎంస్టాలియన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను వాడారు. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది.
పవర్: 197 బీహెచ్పీ
టార్క్: 380 ఎన్ఎం
మార్కెట్లో ఉన్న టాటా సఫారీ పెట్రోల్, హ్యుందాయ్ అల్కాజర్ పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ అత్యంత శక్తివంతమైన పనితీరును కనబరుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ట్రాఫిక్‌లో సులభంగా డ్రైవ్ చేయాలనుకున్నా లేదా హైవేపై దూసుకుపోవాలనుకున్నా ఈ పెట్రోల్ ఆటోమేటిక్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


