Bengal Assembly Dissolved : ముగిసిన మమతా బెనర్జీ పాలన - బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్
Bengal Assembly Dissolved : పశ్చిమ బెంగాల్ శాసనసభను గవర్నర్ ఆర్.ఎన్. రవి రద్దు చేశారు. ఎన్నికలు ముగియడంతో పాటు సభ పదవీకాలం పూర్తి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Bengal Assembly Dissolved : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గురువారం (మే 7) నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రస్తుత శాసనసభ పదవీకాలం ముగియడంతో గవర్నర్ ఆర్.ఎన్. రవి అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణ 174(2)(బి) ప్రకారం తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగిస్తూ గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన క్షణం నుంచి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి హోదాను కోల్పోయారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) 80 స్థానాలకే పరిమితం కాగా… భారతీయ జనతా పార్టీ (BJP) 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి మెజారిటీని దక్కించుకుంది. అయితే ఈ ఫలితాలను అంగీకరించని మమతా బెనర్జీ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని గతంలోనే భీష్మించారు.
"మేము ప్రజల తీర్పు వల్ల ఓడిపోలేదు.. కుట్రల వల్ల ఓడిపోయాము" అని ఆమె మండిపడ్డారు. తనను కావాలంటే డిస్మిస్ చేయాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినా సిద్ధమేనని… సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బుధవారం జరిగిన అంతర్గత సమావేశంలో ఆమె స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
గవర్నర్ తాజా ఉత్తర్వులతో……. మే 2021లో మూడోసారి మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పాటైన అసెంబ్లీ పదవీకాలం నేటితో (మే 7) ముగిసింది. మరోవైపు ఎన్నికల కమిషన్ బీజేపీ విజయాన్ని అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో….. రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా గవర్నర్ నేరుగా అసెంబ్లీని రద్దు చేస్తూ లోక్ భవన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజా పరిణామాలతో బెంగాల్‌లో టీఎంసీ పాలన శకం తాత్కాలికంగా ముగిసింది. ఘనవిజయం సాధించిన బీజేపీ త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

