Mamitha Baiju : 25ఏళ్లకే రూ. 30కోట్ల సంపద! రూ. 5కోట్ల ఇల్లు.. 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు సంచలనం
'ప్రేమలు', 'జననాయగన్' చిత్రాల విజయాలతో వరుస అవకాశాలు అందుకుంటున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు నెట్ వర్త్కి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. సమాచారం ప్రకారం.. ఆమె నెట్ వర్త రూ. 30కోట్ల వరకు ఉంటుంది!
తెలుగు, తమిళ్, మలయాళం.. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసినా ఒక పేరు మాత్రం బాగా వినిపిస్తోంది. అదే.. ‘మమితా బైజు’! దక్షిణాది చిత్రసీమలో తన క్యూట్ లుక్స్, నటనతో కుర్రకారు మనసు దోచుకుంటోంది ఈ 'ప్రేమలు' బ్యూటీ. ఈ నేపథ్యంలో మమితా బైజు నెట్ వర్త్కి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 25ఏళ్లకే ఆమె సంపద రూ. 30కోట్లు అట!

25 ఏళ్లకే రూ. 30 కోట్ల సామ్రాజ్యం!
కేవలం 25 ఏళ్ల వయస్సులోనే సౌత్ ఇండియాలోని క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన మమితా బైజు.. నటనతో పాటు తన ఆర్థిక సంపాదనతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2016లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'పావడ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మమితా, ఆ తర్వాత 'ఆపరేషన్ జావా', 'వరతన్', 'కర్ణా', 'రెబెల్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
'ప్రేమలు' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన తర్వాత ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. తమిళ నటుడు, పొలిటీషియన్ విజయ్ సరసన 'జననాయగన్' చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించారు.
మమతా బైజు ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కేవలం సినిమాలే కాకుండా ఫ్యాషన్, స్కిన్ కేర్, జ్యువెలరీ బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమె భారీగానే ఆర్జిస్తున్నారు.
లగ్జరీ కార్లు.. కొచ్చిలో రూ. 5 కోట్ల ఫ్లాట్!
సినిమాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మమితా సురక్షితమైన ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేస్తోంది. షూటింగ్‌లు, వృత్తిపరమైన పనుల కోసం కొచ్చిలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. అలాగే, బాల్యంలో తాను గడిపిన కొట్టాయం సమీపంలోని కిడాంగూరులోని పూర్వీకుల ఇంటిని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటోంది. ప్రయాణాల కోసం ఆమె వద్ద వోక్స్‌వాగన్ టైగన్, మారుతీ సుజుకీ జిమ్నీ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
మమితా నటించిన తాజా చిత్రం 'బెత్లెహెమ్ ఫ్యామిలీ యూనిట్' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
బిజీ షెడ్యూల్లో అనారోగ్యం..
వివిధ ఇండస్ట్రీల్లో సినిమాలతో బిజీబిజాగా ఉంటున్న మమితా బైజు ఇటీవలే ఆనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరం, వంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు.
ఓనమ్ వేడుకల సందర్భంగా ఆస్ట్రేలియాలోని క్లైడ్ మలయాళీ అసోసియేషన్ నిర్వహించే 'లెండ్యాక్సిస్ క్లైడ్ ఓనమ్ 2026' ఈవెంట్‌కు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వైద్యులు ఆమెను ప్రయాణాలు చేయవద్దని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీనితో ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకున్నట్లు మమిత ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించింది. "అనుకున్న సమయానికి నేను అక్కడకు రాలేకపోతున్నందుకు క్షమించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. కాస్త వీలున్నా వచ్చేదాన్ని, కానీ డాక్టర్లు కచ్చితంగా బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెప్పారు," అని చెప్పింది. మమితా గైర్హాజరు కావడంతో నిర్వాహకులు కూడా ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఓనమ్ ఈవెంట్‌ను వాయిదా వేశారు.
ఒకవైపు ఆమె నటించిన చిత్రాలు కోట్లు కొల్లగొడుతుంటే, మరోవైపు ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ బెడ్‌కే పరిమితం కావడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. మమితా బైజు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


