Shreya Ghoshal: లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న సింగర్ శ్రేయా ఘోషల్- తల్లిదండ్రులతో కలిసి- ధర, విస్తీర్ణం, అదనపు వసతులు ఇవే!
Singer Shreya Ghoshal Buys Luxury Apartment: ప్రముఖ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన వర్లీలో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. తన తల్లిదండ్రులతో కలిసి కొన్నట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడిస్తున్నాయి. మరి దాని ధర, విస్తీర్ణం, అదనపు వసతులు ఏంటో తెలుసుకుందాం.
తన మధురమైన గొంతుతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఇప్పుడు ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఒకటిగా పేరుగాంచిన 'వర్లీ' (Worli)లో శ్రేయా ఘోషల్ ఒక ఖరీదైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. తన తల్లి షమిష్ట ఘోషల్, తండ్రి బిస్వజిత్ ఘోషల్‌లతో కలిసి సంయుక్తంగా ఈ ఆస్తిని శ్రేయా రిజిస్టర్ చేయించుకున్నారు.
ఫ్లాట్ విశేషాలు ఇవే..
'స్క్వేర్ యార్డ్స్' (Square Yards) సమీక్షించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం, ఈ అపార్ట్‌మెంట్ వర్లీలోని 'గోద్రెజ్ ట్రైలజీ' (Godrej Trilogy) ప్రాజెక్ట్‌లో ఉంది.
విస్తీర్ణం: ఈ ఫ్లాట్ కార్పెట్ ఏరియా 2,430.06 చదరపు అడుగులు కాగా, మొత్తం విస్తీర్ణం 2,750.28 చదరపు అడుగులుగా ఉంది.
ధర: దీని విలువ సుమారు రూ. 29.70 కోట్లు.
అదనపు వసతులు: ఈ ఫ్లాట్‌తో పాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా లభించాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు: ఈ డీల్ 2026, ఏప్రిల్ 1న రిజిస్టర్ అయింది. దీని కోసం శ్రేయా ఘోషల్ సుమారు రూ. 1.78 కోట్ల స్టాంప్ డ్యూటీని, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలను చెల్లించారు.
ఖరీదైన అడ్రస్‌గా వర్లీ!
దక్షిణ ముంబై, లోయర్ పరేల్ వంటి ప్రాంతాల తర్వాత ఇప్పుడు సంపన్నుల చూపు వర్లీపై పడింది. ఇక్కడి కొన్ని లగ్జరీ ప్రాజెక్టులలో చదరపు అడుగు ధర రూ. 1 లక్షకు పైగానే పలుకుతోంది. బాంద్రా-వర్లీ సీ లింక్, వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే వంటి కనెక్టివిటీ ఉండటం వల్ల కార్పొరేట్ దిగ్గజాలు, సెలబ్రిటీలు ఇక్కడ ఇళ్లు కొనడానికి మొగ్గు చూపుతున్నారు.
న్యూయార్క్‌లోని లోయర్ మాన్‌హట్టన్ ప్రాంతంలో ఉన్న ధరలతో వర్లీ రియల్ ఎస్టేట్ రేట్లు పోటీ పడుతుండటం గమనార్హం. గతేడాది ఇక్కడే రెండు డ్యూప్లెక్స్ ఇళ్లు రూ. 700 కోట్లకు పైగా ధర పలకడం సంచలనం సృష్టించింది. గత మూడేళ్లలో ఇక్కడ రూ. 100 కోట్లకు పైగా విలువైన లావాదేవీలు 20కి పైగా జరిగాయి.
శ్రేయా ఘోషల్ ప్రస్థానం
ఎలక్ట్రికల్ ఇంజనీర్ బిస్వజిత్ ఘోషల్, సాహిత్యవేత్త షమిష్ట దంపతులకు జన్మించిన శ్రేయా ఘోషల్ 'సా రె గ మ ప' రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. 2002లో 'దేవదాస్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 'బైరీ పియా' వంటి పాటలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
శ్రేయా ఘోషల్ తెలుగు సాంగ్స్
అప్పటి నుంచి ఇప్పటి వరకు తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సినీ సంగీతంలో తిరుగులేని గాయనిగా కొనసాగుతున్నారు. శ్రేయా ఘోషల్ తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. చలి చలిగా (మిస్టర్ పర్‌ఫెక్ట్), సమ్మోహనుడా (రూల్స్ రంజన్) వంటి ఎన్నో హిట్స్ పాడారు శ్రేయా ఘోషల్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


