Shreya Ghoshal: అలాంటి రోజు వస్తే పాటలు పాడటం ఆపేస్తా.. అతనిలాగే నాకూ బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది: శ్రేయా ఘోషల్
Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సింగర్ అరిజీత్ సింగ్ లాగే తాను కూడా బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఇక కాన్సర్ట్ లలో కొందరు లిప్ సింకింగ్ చేయడంపై విమర్శలు గుప్పించింది.
బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌కు స్వస్తి చెప్పాలనే అరిజీత్ సింగ్ నిర్ణయంపై ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ స్పందించింది. బ్రేక్ తీసుకోవాలనే ఆలోచన తనకూ వస్తుంటుందని చెబుతూ, అరిజిత్ తీసుకున్నది చాలా సాహసోపేత నిర్ణయమని ఆమె ప్రశంసించింది.

అరిజిత్ రిటైర్మెంట్ గురించి శ్రేయా ఘోషల్
ఇటీవల ఏబీపీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్ మాట్లాడుతూ.. అరిజీత్ సంగీతం పట్ల ఎంత అంకితభావంతో ఉంటారో వివరించింది.
లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రాముఖ్యత గురించి ఆమె చెప్పింది. ఒక ఆర్టిస్టుగా స్టేజ్ మీద పాడటమే తన అసలు గుర్తింపు అని శ్రేయా తెలిపింది. స్టేజ్ మీద లిప్-సింక్ చేయడం తనకు అస్సలు నచ్చదని, ఒకవేళ అదే చేయాల్సి వస్తే పాడటం ఆపేస్తానని స్పష్టం చేసింది.
"నేను కూడా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటాను. అరిజీత్ చాలా ధైర్యంగా ఆ నిర్ణయం తీసుకున్నాడు. అతడు మనసు పెట్టి సంగీతం చేస్తాడు. ఫలితం గురించి ఆలోచించడు. అతడికి సంతోషం ఇచ్చే పనే చేస్తాడు" అని ఆమె కొనియాడింది. అరిజీత్ సంగీతం పట్ల చూపే నిజాయితీ వల్లే ప్రేక్షకులు అతడిని అంతగా ప్రేమిస్తారని శ్రేయా అభిప్రాయపడింది.
శ్రేయ తన కెరీర్‌ను సంజయ్ లీలా భన్సాలీ మూవీ 'దేవదాస్' తో ప్రారంభించి, తన మొదటి పాట ‘బైరీ పియా’కు నేషనల్ అవార్డు అందుకుంది. ప్రస్తుతం ఆమె యూకే, యూఎస్ఏ, భారత్ వంటి దేశాల్లో 'ది అన్‌స్టాపబుల్ వరల్డ్ టూర్' కోసం సిద్ధమవుతోంది.
అరిజీత్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటన
ఈ ఏడాది జనవరి 27న అరిజీత్ సింగ్ ప్లేబ్యాక్ సింగింగ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. "గత కొన్నేళ్లుగా నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్‌గా నేను కొత్త ప్రాజెక్టులు ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇది అద్భుతమైన ప్రయాణం" అని అతడు రాశాడు.
కొత్త తరం గాయకులు ముందుకు వచ్చి తనను ఇన్‌స్పైర్ చేయాలని అతడు కోరుకుంటున్నాడు. అయితే సంగీతం చేయడం మాత్రం ఆపనని, ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక బాలీవుడ్ సినిమాలకు పాడనని స్పష్టం చేశాడు.
ఇటీవలే అరిజీత్ బాలీవుడ్ నుండి బయటకు వచ్చాక తన మొదటి ఇండిపెండెంట్ సాంగ్ 'రైనా' (Raina) ను విడుదల చేశాడు. శేఖర్ రవ్జియానీ సంగీతం అందించిన ఈ పాటకు ప్రియా సరైయా లిరిక్స్ అందించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


