సినిమా అంటే రంగుల ప్రపంచం, స్టాక్ మార్కెట్ అంటే అంకెల ప్రపంచం! ఈ రెండింటికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది! ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు.. ఏ అండ లేకుండా వచ్చి, తెలుగు సినిమా మార్కెట్ విలువను వందల కోట్లకు పెంచి, చరిత్రలో తనకంటూ ఒక పేజీ రాసుకుని, దశాబ్దాల పాటు 'నెంబర్ వన్' స్థానంలో నిలబడటం వెనుక ఒక పక్కా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి జీవితం నేర్పించే స్టాక్ మార్కెట్ పాఠాలు..

1. బ్లూచిప్ స్టాక్ లాంటి ‘క్రెడిబిలిటీ’-
స్టాక్ మార్కెట్‌లో బ్లూచిప్ కంపెనీలు (లార్జ్ క్యాప్) ఎలాగైతే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడతాయో, చిరంజీవి కూడా దశాబ్దాలుగా తన క్రెడిబిలిటీని అలానే కాపాడుకున్నారు. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా, 'చిరంజీవి సినిమా అంటే మినిమం గ్యారెంటీ' అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు.
స్టాక్ మార్కెట్‌లో మీరు ఎంచుకునే కంపెనీ కూడా చిరంజీవి కెరీర్ లాగే ఉండాలి. కాలం మారినా, పరిస్థితులు మారినా స్థిరమైన పనితీరు కనబరిచే కంపెనీల్లో పెట్టుబడి పెడితే ప్రశాంతంగా ఉంటారు.
2. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్-
మన శంకర వరప్రసాద్ గారు ఒకే రాత్రిలో మెగాస్టార్ అవ్వలేదు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ, తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ దశాబ్దాల పాటు శ్రమించారు. ఆయన కెరీర్ గ్రాఫ్ చూస్తే అది ఒక 'మల్టీబ్యాగర్' స్టాక్ ప్రయాణంలా కనిపిస్తుంది.
స్టాక్ మార్కెట్‌లో రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలనుకోవడం మూర్ఖత్వం. చిరంజీవి ప్లానింగ్ లాగే.. మంచి స్టాక్స్‌ని పట్టుకుని కనీసం 10-20 ఏళ్లు ఓపికగా ఉంటేనే అద్భుత సంపదను సృష్టించుకుంటారు.
3. డైవర్సిఫికేషన్: రిస్క్ మేనేజ్‌మెంట్-
చిరంజీవి కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేయలేదు. ఆయన మెగాస్టార్‌గా ఎదిగేందుకు 'రుద్రవీణ', 'ఆపద్బాంధవుడు' వంటి క్లాసిక్ సినిమాలు కూడా ఒక కారణం. వాటితో ఆయన తన మార్కెట్‌ను డైవర్సిఫై చేసుకున్నారు.
అప్పుడప్పుడు ఒక జోనర్ ఫెయిల్ అయినా, మరో జానర్ ఆయన్ని కాపాడేది. ఇందుకు చక్కటి ఉదాహరణ తాజాగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమానే!
{{/usCountry}}అప్పుడప్పుడు ఒక జోనర్ ఫెయిల్ అయినా, మరో జానర్ ఆయన్ని కాపాడేది. ఇందుకు చక్కటి ఉదాహరణ తాజాగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమానే!
{{/usCountry}}మీరు కూడా మీ డబ్బు మొత్తాన్ని ఒకే సెక్టార్‌లో పెట్టకండి. మీ పోర్ట్‌ఫోలియోను విభిన్న రంగాలుగా విభజించండి. ఒకటి నష్టపోయినా, మరొకటి మీ లాభాలను కాపాడుతుంది.
4. కమ్‌బ్యాక్ స్ట్రాటజీ-
చిరంజీవి రాజకీయ ప్రస్థానం తర్వాత ఒక చిన్న విరామం వచ్చింది. కానీ 'ఖైదీ నంబర్ 150'తో ఆయన చేసిన కమ్‌బ్యాక్ ఫ్యాన్స్‌కి బహుమతి లాంటిది.
అదే విధంగా స్టాక్ మార్కెట్ సైతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బుల్ రన్ తర్వాత బేర్ మార్కెట్ వస్తుంది. బేర్ తర్వాత బుల్స్ పుంజుకుంటారు. ఈ సైకిల్ కొనసాగుతూనే ఉంటుంది.
అందుకే స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు భయపడి పారిపోకండి. అది మళ్లీ పుంజుకుంటుంది. సరైన సమయం కోసం వేచి చూడండి. చిరంజీవి కమ్‌బ్యాక్ లాగే మీ పోర్ట్‌ఫోలియో కూడా భారీ లాభాలతో తిరిగి వస్తుంది.
5. అప్‌డేటింగ్ అండ్ రీ-ఇన్వెస్ట్‌మెంట్-
నాటి నుంచి నేటి వరకు చిరంజీవి తన డ్యాన్స్, ఫైట్స్, లుక్స్‌ను అప్‌డేట్ చేస్తూనే ఉన్నారు. 70ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా ఉంటున్నారు. అసలు ఆయన వయస్సు 70 అంటే ఎవరూ నమ్మలేరు కూడా!
ఒకరంగా చెప్పాలంటే చిరంజీవి తన మీద తాను ఇన్వెస్ట్ చేసుకున్నట్టు.
కంపెనీలు తమ లాభాలను మళ్లీ బిజినెస్‌లో పెట్టి ఎలాగైతే ఎదుగుతాయో.. మీరు కూడా మీ జ్ఞానాన్ని నిరంతరం అప్‌డేట్ చేసుకోవాలి. నేర్చుకోవడమే అసలైన సంపాదన.
స్టాక్ మార్కెట్ అయినా, సినీ జీవితం అయినా.. ఇక్కడ 'షార్ట్ కట్స్' ఉండవు. పట్టుదల, ఓపిక, సరైన విశ్లేషణ ఉంటే చిరంజీవి లాగే మీరు కూడా మీ ఆర్థిక జీవితంలో 'మెగాస్టార్' అవుతారు.
రిస్క్ ఉంది కదా అని ఆగకండి.. ఆ రిస్క్ వెనుక ఉన్న రివార్డ్‌ను అందుకోవడానికి సిద్ధమవ్వండి!