మన శంకర వరప్రసాద్ గారు ట్విటర్ రివ్యూ-బాస్ ఈజ్ బ్యాక్-ఫుల్ ఎంట‌ర్‌టైన్మెంట్‌-పక్కా పండగ సినిమా-అదిరిన చిరు, వెంకీ కాంబో!

బాస్ ఈజ్ బ్యాక్, పక్కా పండగ సినిమా, ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. ఇవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీకి నెటిజన్ల రియాక్షన్లు. సంక్రాంతి విన్నర్ ఈ సినిమా అని, వింటేజీ చిరంజీవి అదరగొట్టారని పోస్టులు పెడుతున్నారు. 

Jan 12, 2026, 05:33:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతికి రావడం హిట్ కొట్టడం అలవాటుగా మార్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకవైపు.. సంక్రాంతి సెంటిమెంట్ గా ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు. వీళ్ల కాంబినేషన్ అనగానే ఎన్నో అంచనాలు. ఈ సంక్రాంతి 2026కి అనిల్ రావిపూడి-చిరంజీవి కలిసి స్క్రీన్స్ పై మాయ చేశారని, అసలైన పండగ సినిమా అందించారని నెటిజన్లు రియాక్టవుతున్నారు. ఎక్స్ (ట్విటర్)లో అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా పోస్టర్ లో చిరంజీవి (x/anil ravipudi)
మన శంకర వరప్రసాద్ గారు సినిమా పోస్టర్ లో చిరంజీవి (x/anil ravipudi)

మన శంకర వరప్రసాద్ గారు ట్విటర్ రివ్యూ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ టైమ్ చేసిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ రోజు (జనవరి 12) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. అంతకంటే ముందు ప్రీమియర్ల కూడా వేశారు. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విటర్ లో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్, పండగ సినిమా, అదిరిన వెంకీ, చిరు కాంబో అని పోస్టులు పెడుతున్నారు. పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ

భార్యతో విడిపోయిన భర్త తన పిల్లలకు ఎలా దగ్గరయ్యాడు? నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా హీరో మిషన్ ఏంటీ? అనే మూల కథతో సాగుతుంది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. ఇందులో శంకర వరప్రసాద్ (చిరంజీవి) నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా) సెక్యూరిటీ మొత్తం చూసుకుంటాడు. భార్య శశిరేఖ (నయనతార) నుంచి వరప్రసాద్ విడిపోయి సెపరేట్ గా ఉంటాడు.

పిల్లలతో కలిసి

భార్య నుంచి వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకున్న కేంద్ర మంత్రి శర్మ ఒక నిర్ణయం తీసుకుంటాడు. పిల్లలతో వరప్రసాద్ కలిసి ఉండేలా ఏర్పాట్లు చేస్తాడు. పీఈటీగా ఆ స్కూల్ కు వెళ్తాడు వరప్రసాద్. మరోవైపు కర్ణాటక మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడ (వెంకటేశ్) కథలోకి వస్తాడు. అసలు వరప్రసాద్, శశిరేఖ ఎందుకు విడిపోయారు? వెంకీ గౌడకు సంబంధం ఏంటీ? వరప్రసాద్ పిల్లలతో తిరిగి కలిశాడా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ట్విటర్ రివ్యూ

‘‘షో కంప్లీటెడ్. నా రేటింగ్ 3.5/5. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్. వెరీ గుడ్ సెకండాఫ్. చిరు టైమింగ్ అదుర్స్. వెంకీ సీన్స్ బాగున్నాయి. నయనతార యాక్టింగ్ ఫైర్. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. చివరగా కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావిపూడికి సెల్యూట్’’ అని ఓ యూజర్ ట్విటర్ లో రాసుకొచ్చాడు.

పొంగల్ ఎంటర్ టైనర్

‘‘మస్ట్ వాచ్. 8.3/10. ఫన్, ఎమోషన్స్, హై ఎనర్జీ యాక్షన్, సంక్రాంతి పండగ మాస్ మూమెంట్స్ తో నిండిన ఇది పక్కా పొంగల్ ఎంటర్ టైనర్. పైసా వసూల్ ఎంటర్ టైనర్’’ అని ఓ నెటిజన్ పోస్టు చేశాడు.

బాస్ ఈజ్ బ్యాక్

‘‘డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. నయనతారను ఇంకాస్త బెటర్ గా చూపించాల్సింది. కానీ బాస్ ఈజ్ బ్యాక్. చిరంజీవికి మరోసారి సంక్రాంతి విన్నర్. అనిల్ రావిపూడి ఎప్పుడూ నిరాశపర్చడు. 3/5’’ అని ఓ ఎక్స్ యూజర్ రివ్యూ పోస్టు చేశాడు.

వెంకీ మామ క్యామియో

‘‘నువ్వు మాములోడివి కాదు అనిల్ రావిపూడి. బాస్ కుమ్మి అవతలేశాడు. అనిల్ రావిపూడి వండిన సంక్రాంతి మీల్ ను ఫ్యామిలీకి వేడివేడిగా వండించేశాడు చిరంజీవి. వెంకీ మామ క్యామియో టాపింగ్’’ అని ఒకరు ట్విటర్ లో రాసుకొచ్చారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More