ఎంపీ లెటర్‌హెడ్‌పై కమల్ హాసన్ పరాశక్తి మూవీ రివ్యూ-ఎన్నికలకు కూటమి పిలుపంటూ సంచలన పోస్ట్
సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్, రవి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ పరాశక్తి. ఈ మూవీ రివ్యూను కమల్ హాసన్ పంచుకున్నారు. ఎన్నికలతో లింక్ చేస్తూ తన రాజ్యసభ ఎంపీ లెటర్ హెడ్ పై రివ్యూ పోస్టు చేశారు.
నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' సినిమాపై తన రివ్యూను రాజ్యసభ ఎంపీ లెటర్ హెడ్ పై సోషల్ మీడియాలో పంచుకున్నారు కమల్. శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అధర్వ నటీనటులుగా నటించిన ఈ చిత్రం శనివారం (జనవరి 10) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని 'డీఎంకే చరిత్రపై విజయోత్సవ పుష్పగుచ్ఛం'గా అభివర్ణించారు కమల్ హాసన్.

కమల్ హాసన్ పరాశక్తి రివ్యూ
కమల్ హాసన్ తన అధికారిక ఎంపీ లెటర్‌హెడ్‌పై 'పరాశక్తి' సినిమా రివ్యూను పోస్ట్ చేశారు. "తమిళ జ్వాల వ్యాపించనీయండి!" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిని తమిళనాడు డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉద్దేశించి ఆయన రాశారు.
"పరాశక్తి సినిమా చూడటం ప్రారంభించే ముందు, మన కూటమి ఎదుర్కోబోయే ఎన్నికలకు ఈ చిత్రం ఇంత పెద్ద పిలుపునిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. అవును.. ఈ చిత్రం విజయం సాధించాలని నా కోరిక మాత్రమే కాదు, ఇది నా నిజమైన ఆశీర్వాదం కూడా" అని కమల్ పేర్కొన్నారు.
డీఎంకే చరిత్ర
తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) చరిత్రను ఈ చిత్రం స్పృశించడం గురించి మాట్లాడుతూ.. "ఈ చిత్రం డీఎంకే చరిత్రపై విజయోత్సవ పుష్పగుచ్ఛం. ప్రేమతో, కమల్ హాసన్" అని కమల్ పోస్టు చేశారు.
దర్శకురాలు సుధా, శివకార్తికేయన్‌లను కూడా కమల్ ప్రశంసించారు "నేను ముందుగా చెప్పాల్సింది. కానీ నా భావోద్వేగాలు ప్రబలమయ్యాయి. ఈ బయోపిక్-ఫిక్షన్ కథకు దాని దర్శకురాలు శ్రీమతి సుధా కొంగర, ఈ కథను ఎంచుకున్న, దాని కోసం కష్టపడి విజయం సాధించబోతున్న సోదరుడు శివకార్తికేయన్‌కు మొదటి ప్రశంసలు" అని కమల్ హాసన్ రాశారు.
కమల్ కు థ్యాంక్స్
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కమల్ హాసన్ సమీక్షకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాతలు డాన్ పిక్చర్స్.. "సినిమా ప్రయత్నానికి గట్టిగా మద్దతునిచ్చి, అద్భుతమైన శుభాకాంక్షలు తెలిపిన గౌరవనీయులైన కమల్ హాసన్‌కు ధన్యవాదాలు" అని రాశారు.
పరాశక్తి గురించి
పరాశక్తి పొంగల్ పండుగకు ముందు జనవరి 10న తెరపైకి వచ్చింది. ఈ చారిత్రాత్మక రాజకీయ యాక్షన్ డ్రామాకు సుధా కొంగర దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ అధినేత ఆకాష్ భాస్కరన్ నిర్మించారు. దేవ్ రత్నం, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, పాప్రి ఘోష్ కూడా నటించారు. రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్, ధనంజయ్ అతిథి పాత్రల్లో కనిపించారు. 1960ల నేపథ్యంలో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఇద్దరు సోదరుల కథనే పరాశక్తి మూవీ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


