Electric car : మారుతీ సుజుకీ నుంచి 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కారు- 500 కి.మీ రేంజ్‌తో..
Maruti Suzuki 7 seater Electric MPV : మారుతీ సుజుకీ నుంచి కొత్త 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ రాబోతోంది. దీని రేంజ్ 500 కి.మీ వరకు ఉంటుంది. ఇందులో అనేక హై-టెక్ ఫీచర్లు, సేఫ్టీ ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఈ-విటారా’ తర్వాత భారతీయ కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఒక భారీ ఎలక్ట్రిక్ ఎంపీవీని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం 'వైఎంసీ' అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తున్న ఈ 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు ఇటీవలే భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించింది. ఒకే ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా రేంజ్, లెవెల్-2 అడాస్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో రాబోతున్న ఈ కారు 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీని పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..
మారుతీ సుజుకీ 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ- ఈ విటారా పోలికలతో డిజైన్ !
ఎస్‌యూవీల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో, మారుతీ సుజుకీ పెద్ద కుటుంబాల కోసం విశాలమైన క్యాబిన్ స్పేస్ ఉండేలా ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీని డిజైన్ చేస్తోంది.
లీకైన స్పై షాట్స్ ప్రకారం.. ఈ కారు పొడవైన బాడీ, మూడు వరుసల సీటింగ్, ప్రయాణికులకు సరిపోను మెరుగైన లెగ్‌రూమ్, బూట్ స్పేస్‌ను కలిగి ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.
టెస్టింగ్ సమయంలో ఈ కారు పూర్తిగా కవర్ చేసినప్పటికీ, కొన్ని కీలకమైన డిజైన్ ఎలిమెంట్స్ బయటపడ్డాయి.
ఫ్రంట్ లుక్: ఈ కారు ఫ్రంట్ బంపర్, లోయర్ గ్రిల్ డిజైన్ త్వరలో రాబోయే 'ఈ-విటారా'ను పోలి ఉన్నాయి.
సైడ్ అండ్ రేర్ ప్రొఫైల్: స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్, ఏరోడైనమిక్ వీల్స్‌తో సైడ్ ప్రొఫైల్ సింపుల్‌గా, క్లాసిక్‌గా ఉంది. వెనుక వైపు పెద్ద టైల్‌గేట్, రేర్ వైపర్‌ను అందించారు. స్పోర్టీ లుక్ కంటే ప్రాక్టికాలిటీకే ఈ కారులో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.
మారుతీ సుజుకీ 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ- లగ్జరీ ఇంటీరియర్ ఫీచర్లు..
ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ ఎంపీవీలో వినియోగదారులను ఆకట్టుకునేలా ఆధునిక ఫీచర్లను జోడించనున్నారు. అవి..
- పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- పనోరమిక్ సన్‌రూఫ్
- వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
- వెనక్కి వాల్చుకునే వీలున్న సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
మారుతీ సుజుకీ 7 సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీ- లెవల్ 2 అడాస్‌తో!
భద్రత పరంగా మారుతీ సుజుకీ ఈ 7 సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఇందులో లెవల్ 2 అడాస్ ఫీచర్‌ను అందించబోతున్నారు.
అడాస్ లో ఉండే ముఖ్యమైన ఫీచర్లు:
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్
ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్
లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ మానిటరింగ్
ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్
వీటితో పాటు 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), హిల్ హోల్డ్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్లు వంటి స్టాండర్డ్ ఫీచర్లు రానున్నాయి.
ఈ మారుతీ సుజుకీ 7 సీటర్ ఈవీ లాంచ్ డేట్ సహా ఇతర వివరాలపై సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రానున్న నెలల్లో వీటిపై ఒక క్లారిటీ వస్తుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


