విదేశాల్లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌కి క్రేజీ డిమాండ్! 38 నెలల్లో 2లక్షల ఎగుమతులు- ఎస్‌యూవీల్లో ఫాస్టెస్ట్..
కేవలం 38 నెలల్లో 2 లక్షల ఎగుమతుల మైలురాయిని దాటి మారుతీ సుజుకీ 'ఫ్రాంక్స్' అరుదైన ఘనత సాధించింది. భారతీయ తయారీ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ క్రాసోవర్ ఎస్‌యూవీ.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 దేశాల్లో అమ్మకానికి ఉంది. వివరాల్లోకి వెళితే..
భారతీయ కార్ల తయారీ రంగంలో మారుతీ సుజుకీ మరో కీలక మైలురాయిని అందుకుంది. తన పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీ 'ఫ్రాంక్స్' కేవలం 38 నెలల కాలంలోనే 2 లక్షల ఎగుమతులను పూర్తి చేసిందని కంపెనీ ప్రకటించింది.

ఫలితంగా భారత్ నుంచి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఎస్‌యూవీగా ఫ్రాంక్స్ నిలిచింది.
2023 జూన్‌లో ఎగుమతులు ప్రారంభించిన నాటి నుంచి ఫ్రాంక్స్ అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యమైన ఆదరణను పొందుతోంది. కంపెనీ అందించిన వివరాల ప్రకారం.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ మొదటి లక్ష యూనిట్ల ఎగుమతుల మైలురాయిని 25 నెలల్లోనే పూర్తి చేసింది. ఆశ్చర్యకరంగా, రెండో లక్ష ఎగుమతుల మైలురాయిని మాత్రం కేవలం 13 నెలల స్వల్ప వ్యవధిలోనే చేరుకుంది!
గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో తయారవుతున్న ఈ వాహనాలు జపాన్‌తో పాటు సుమారు 90 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
అంతర్జాతీయ వేదికపై అగ్రగామిగా..
ఈ మైలురాయి గురించి మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ.. "మేము ఎగుమతి చేసే ప్రతి వాహనంలోనూ మా సిబ్బంది కఠిన శ్రమ, గర్వం ఇమిడి ఉన్నాయి. ఈ వాహనాల ద్వారా భారతీయ తయారీ ప్రతిభ దాదాపు 120 దేశాలకు చేరుకుంటోంది. ఫ్రాంక్స్ మా ఎగుమతుల విజయానికి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది భారత్ నుంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ప్యాసింజర్ వాహనంగా కొనసాగుతోంది," అని పేర్కొన్నారు.
అంతేకాకుండా.. "మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" నినాదానికి అనుగుణంగా మారుతీ సుజుకీ భారత్ తయారీ రంగ సత్తాను ప్రపంచానికి చాటుతోందని టకేయుచి తెలిపారు. ఎగుమతులపై నిరంతరం దృష్టి పెట్టడం వల్లే కంపెనీ ప్యాసింజర్ వాహనాల ఎగుమతిలో దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశపు టాప్-3 ఎగుమతి వాహనాలన్నీ మారుతీ సుజుకీవే అని ఆయన వివరించారు.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్- శక్తివంతమైన ఇంజిన్, పనితీరు..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ రెండు రకాల శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది:
1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్: ఇది 88 బీహెచ్పీ పవర్‌ని, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
1.0 లీటర్ టర్బోచార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్: ఇది 98.6 బీహెచ్పీ పవర్‌ని, 147.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే, 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ, 6-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్- ఆకర్షణీయమైన ఫీచర్లు, భద్రత..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ అనేక అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇందులో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేసే 9-అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా, రియర్ ఏసీ వెంట్లు, క్రూయిజ్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భద్రత పరంగా చూస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), హిల్-హోల్డ్ అసిస్ట్ కలిగిన ఈఎస్పీ, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఎన్నో రక్షణ కవచాలు ఉన్నాయి.
విదేశీ ఎగుమతుల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ క్రాసోవర్ ఎస్‌యూవీ.. ఇండియాలో రూ.6.85 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


