భారత ఆటోమొబైల్ మార్కెట్లో డిమాండ్‌ని మరింత పెంచుకునేందుకు దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో మళ్లీ 50 శాతం వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కలను సాకారం చేసుకునేందుకు రాబోయే ఐదేళ్లలో ఏడు కొత్త ఎస్‌యూవీలతో సహా పలు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి బహుళ ఇంజిన్ విధానాలను అనుసరిస్తూనే, వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచుకోనుంది.
తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక మైలేజీ కోరుకునే మధ్యతరగతి కుటుంబాలకు మారుతీ సుజుకీ ఎప్పుడూ మొదటి ఎంపికగా నిలుస్తోంది. తాజా ప్రణాళికల్లో భాగంగా 2027 ఫిబ్రవరిలో జరగనున్న 'భారత్ గ్లోబల్ మొబిలిటీ ఎక్స్పో' వేదికగా రెండు కీలక కార్లను ఆవిష్కరించేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది. అందులో ఒకటి సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ (కోడ్ నేమ్: వైఎంసీ) కాగా, మరొకటి అప్డేట్ చేసిన ‘ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్’. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ రెండు కార్ల విశేషాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం.
నెక్సా షోరూమ్‌ల ద్వారా ప్రీమియం 'మారుతీ వైఎంసీ' ఎలక్ట్రిక్ ఎంపీవీ
కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రయాణించే స్పేషియస్ ఎంపీవీ కార్లకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో ఎలక్ట్రిక్ కారును అందించేందుకు మారుతీ సుజుకీ 'వైఎంసీ' పేరుతో కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనిని ప్రీమియం విభాగంలో నిలబెట్టి, కేవలం ‘నెక్సా’ డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే విక్రయించనుంది. మార్కెట్లోకి వచ్చాక ఈ కారు రూ. 18.04 లక్షల నుంచి రూ. 25 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తున్న 'కియా కారెన్స్ క్లావిస్ ఈవీ'కి గట్టి పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం రోడ్లపై పరీక్షలు జరుపుకుంటున్న మారుతీ వైఎంసీ స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘ఈ-విటారా’ కంటే భిన్నమైన బాడీ శైలితో, సాధారణ ఎంపీవీ, ఎస్యూవీ కలగలిసిన రూపంలో ఇది కనిపిస్తోంది. ముందు బంపర్ పైన సన్నని ఎయిర్ ఇన్‌టేక్, మారుతీ విక్టోరిస్ నుంచి ప్రేరణ పొందిన స్లాటెడ్ డీఆర్ఎల్స్తో కూడిన ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. పొడవైన రూఫ్‌లైన్, చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, లోపల గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా పెద్ద గ్లాస్ ఏరియా, వెనుక వైపు పూర్తి వెడల్పుతో కూడిన లైట్ అమరిక, బంపర్‌పై సన్నని రిఫ్లెక్టర్లు, నిలువుగా ఉండే టెయిల్‌గేట్ దీనికి ఆధునిక రూపాన్ని ఇస్తున్నాయి.
మూడు వరుసల సీట్లు.. ఈ-విటారా బ్యాటరీ ప్యాక్‌తో!
{{/usCountry}}ప్రస్తుతం రోడ్లపై పరీక్షలు జరుపుకుంటున్న మారుతీ వైఎంసీ స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. ఇటీవల వచ్చిన ‘ఈ-విటారా’ కంటే భిన్నమైన బాడీ శైలితో, సాధారణ ఎంపీవీ, ఎస్యూవీ కలగలిసిన రూపంలో ఇది కనిపిస్తోంది. ముందు బంపర్ పైన సన్నని ఎయిర్ ఇన్‌టేక్, మారుతీ విక్టోరిస్ నుంచి ప్రేరణ పొందిన స్లాటెడ్ డీఆర్ఎల్స్తో కూడిన ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటున్నాయి. పొడవైన రూఫ్‌లైన్, చతురస్రాకారపు వీల్ ఆర్చ్‌లు, లోపల గాలి వెలుతురు ధారాళంగా ఉండేలా పెద్ద గ్లాస్ ఏరియా, వెనుక వైపు పూర్తి వెడల్పుతో కూడిన లైట్ అమరిక, బంపర్‌పై సన్నని రిఫ్లెక్టర్లు, నిలువుగా ఉండే టెయిల్‌గేట్ దీనికి ఆధునిక రూపాన్ని ఇస్తున్నాయి.
మూడు వరుసల సీట్లు.. ఈ-విటారా బ్యాటరీ ప్యాక్‌తో!
{{/usCountry}}లోపల మూడు వరుసల సీటింగ్ సదుపాయంతో విశాలమైన క్యాబిన్ లభించనుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పూర్తిస్థాయి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు. హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందుతున్న వైఎంసీ, తన పవర్‌ట్రెయిన్‌ను ఈ-విటారాతో పంచుకోనుంది. ప్రస్తుతం ఈ-విటారా 49kWh (144bhp పవర్, 189Nm టార్క్), 61kWh (174bhp పవర్, 189Nm టార్క్) అనే రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తోంది. అయితే వైఎంసీ కారు పరిమాణం, బరువు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దీని పవర్ అవుట్‌పుట్, డ్రైవింగ్ రేంజ్ గణాంకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
35 కి.మీ మైలేజీతో అదరగొట్టనున్న '2027 మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్'
మారుతీ సుజుకీ లైనప్‌లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ క్రాసోవర్ 'ఫ్రాంక్స్' 2027లో సరికొత్త అవతారంలో రాబోతోంది. బయటి డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు కీలకమైన ఫీచర్లు, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇందులో జోడిస్తున్నారు. టెస్టింగ్ సమయంలో కనిపించిన చిత్రాలను బట్టి, ముందు భాగంలో మార్పులు చేసిన గ్రిల్ మధ్యలో అడాస్ రాడార్ సెన్సార్ కోసం ప్రత్యేకంగా బాక్స్ లాంటి అమరిక కనిపిస్తోంది. ముందు బంపర్, లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ డిజైన్‌ను కూడా మెరుగుపరిచారు. అయితే ప్రస్తుత మోడల్లో ఉన్న స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ను అలాగే కొనసాగిస్తున్నారు.
ఇటీవల అప్డేట్ చేసిన బాలెనో తరహాలోనే, కొత్త ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లోనూ 'లెవల్-2 అడాస్' భద్రతా ప్యాకేజీని అందించనున్నారు. ఇందులో లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ అండ్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడ్వాన్స్డ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, వెహికల్ స్వే వార్నింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. మెరుగైన బ్రేకింగ్ కోసం వెనుక చక్రాలకు కూడా డిస్క్ బ్రేకులు ఇస్తున్నారు.
ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం దీని ఇంజిన్! కొత్త ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.2-లీటర్ జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్ ఆధారంగా మారుతీ సుజుకీ స్వయంగా అభివృద్ధి చేసిన సరికొత్త 'స్ట్రాంగ్ హైబ్రిడ్' పవర్‌ట్రెయిన్‌ను ప్రవేశపెడుతున్నారు. టయోటా అనుసరించే సిరీస్-పారలల్ హైబ్రిడ్ వ్యవస్థ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న 'సిరీస్ హైబ్రిడ్' టెక్నాలజీని మారుతీ ఇందులో వాడుతోంది. దీనివల్ల కారు ధర అందుబాటులో ఉండటమే కాకుండా, లీటరు పెట్రోల్‌కు ఏకంగా 35 కిలోమీటర్లకు పైగా మైలేజీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
పెట్రోల్ ధరలు మండుతున్న ప్రస్తుత రోజుల్లో 35 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఎస్యూవీ వస్తే, భారతీయ కార్ల మార్కెట్లో మారుతీ సుజుకీ తిరుగులేని ఆధిపత్యం చెలాయించడం ఖాయంగా కనిపిస్తోంది.