Instagram : కంటెంట్ క్రియేటర్లకు పండగే! మెటా కొత్త ఫీచర్‌తో డబ్బుల సంపాదన మరింత సులభం..
మెటా తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌ను ప్రకటించింది. ఇకపై రీల్స్‌లో నేరుగా క్లిక్ చేయగల షాపింగ్ లింక్స్‌ను పొందుపరచవచ్చు. దీనివల్ల ఫాలోయర్లు ఒకే ట్యాప్‌తో వస్తువులను కొనుగోలు చేయడమే కాకుండా, క్రియేటర్లు భారీగా కమిషన్ పొందే అవకాశం ఉంది!
సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’.. తన ప్లాట్‌ఫామ్‌లపై క్రియేటర్లు డబ్బు సంపాదించే ప్రక్రియను మరింత సులభతరం చేస్తోంది! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ఇకపై క్లిక్ చేయగల 'షాపింగ్ లింక్స్'ను అనుమతించనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. దీనివల్ల క్రియేటర్లు రికమండ్ చేసే ఉత్పత్తులను వారి ఫాలోయర్లు కేవలం ఒక్క క్లిక్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫలితంగా క్రియేటర్లకు డబ్బు సంపాదించే మార్గం మరింత సులభతరం అవుతుంది.

ప్రస్తుత మార్పు ఏంటి?
ఇప్పటివరకు క్రియేటర్లు తాము ప్రమోట్ చేసే వస్తువుల లింక్స్‌ను తమ ‘బయో’లో ఇవ్వడం లేదా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం వంటి పద్ధతులను అనుసరించేవారు. దీనివల్ల యూజర్లు వాటిని కొనుగోలు చేయడానికి వేరే వెబ్‌సైట్లకు వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది అసలు పట్టించుకోరు కూడా!
కానీ తాజా అప్‌డేట్‌తో, క్రియేటర్లు తమ రీల్స్, పోస్ట్‌లలో నేరుగా 'అఫిలియేట్ ప్రాడక్ట్స్' ట్యాగ్ చేయవచ్చు.
దీనివల్ల ఇకపై 'లింక్-ఇన్-బయో' సేవలు లేదా 'స్వైప్-అప్'ల అవసరం ఉండదు.
ఒకే రీల్‌లో గరిష్టంగా 30 ప్రాడక్ట్స్ వరకు లింక్స్ ఇచ్చే అవకాశం ఉంది.
OnePlus 15T : 7500ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ డ్యూయెల్ కెమెరాతో వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్- ధర..
క్రియేటర్లు ఎలా సంపాదిస్తారు?
ఈ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. క్రియేటర్లు తమ అఫిలియేట్ ప్రోగ్రామ్ అకౌంట్లను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌కు కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత తాము ప్రమోట్ చేసే వస్తువుల డైరెక్ట్ లింక్స్‌ను రీల్స్‌లో ట్యాగ్ చేయాలి. ఫాలోయర్లు ఆ లింక్స్‌పై క్లిక్ చేసి వస్తువును కొన్న ప్రతిసారీ, అఫిలియేట్ పార్టనర్స్ నుంచి క్రియేటర్లకు కొంత శాతం కమిషన్ అందుతుంది.
ఎవరెవరికి అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
అమెరికా : అమెజాన్ ద్వారా ఈ ఫీచర్ రోల్ అవుట్ అవుతోంది.
ఆసియా అండ్ ఇతర దేశాలు: షాపీ భాగస్వామ్యంతో సింగపూర్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, బ్రెజిల్, తైవాన్‌లలో ఇది అందుబాటులో ఉంది.
వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని దేశాలు, కొత్త అఫిలియేట్ భాగస్వాములను ఈ జాబితాలో చేర్చనున్నట్లు మెటా వెల్లడించింది.
భారతీయ క్రియేటర్లకు కూడా త్వరలోనే ఈ సదుపాయం లభించే అవకాశం ఉంది.
Real estate : ఐటీ లేఆఫ్స్ భయాలు- రియల్ ఎస్టేట్‌లో ‘పాజ్’ బటన్ మొదలైందా?
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఇన్‌స్టాగ్రామ్ నుంచి నేరుగా డబ్బు సంపాదించడం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్ తన ప్లాట్‌ఫామ్‌పై క్రియేటర్లను ప్రోత్సహించడానికి కొన్ని ప్రత్యక్ష మార్గాలను అందిస్తోంది:
సబ్‌స్క్రిప్షన్లు : మీ అత్యంత నమ్మకమైన ఫాలోయర్ల కోసం 'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్' (అంటే ఇతరులకు కనిపించని ప్రత్యేక పోస్ట్‌లు, స్టోరీలు) అందిస్తూ, వారి నుంచి నెలకు కొంత రుసుము వసూలు చేయవచ్చు.
గిఫ్ట్స్, బ్యాడ్జెస్ : మీరు లైవ్ వీడియోలు చేస్తున్నప్పుడు లేదా రీల్స్ చేస్తున్నప్పుడు ఫాలోయర్లు మీకు 'స్టార్స్' లేదా 'గిఫ్ట్స్' పంపవచ్చు. వీటిని మీరు నగదుగా మార్చుకోవచ్చు.
రీల్స్ బోనస్ : మీ రీల్స్ ఎక్కువ వ్యూస్ సాధించినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీకు బోనస్ డబ్బును ఇస్తుంది (ఇది ప్రస్తుతం ఇన్విటేషన్ ద్వారా మాత్రమే లభిస్తోంది).
2. తక్కువ ఫాలోయర్లు ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బు సంపాదించవచ్చా?
అవును, కచ్చితంగా సంపాదించవచ్చు! బ్రాండ్లు ఇప్పుడు లక్షలాది ఫాలోయర్లు ఉన్నవారికంటే, తక్కువ ఫాలోయర్లు ఉండి ఎక్కువ ఎంగేజ్‌మెంట్ (అంటే లైకులు, కామెంట్లు) ఉన్న 'నానో' లేదా 'మైక్రో' ఇన్ఫ్లుయెన్సర్ల వైపు మొగ్గు చూపుతున్నాయి.
అఫిలియేట్ మార్కెటింగ్: మీకు 1,000 ఫాలోయర్లు ఉన్నా సరే, మీరు వాడే వస్తువుల లింక్స్‌ను మీ స్టోరీ లేదా బయోలో షేర్ చేసి, ఎవరైనా కొన్నప్పుడు కమిషన్ పొందవచ్చు.
బ్రాండ్ కొలాబరేషన్స్: మీ కంటెంట్ నాణ్యంగా ఉంటే, చిన్న బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రమోషన్ కోసం మిమ్మల్ని సంప్రదిస్తాయి. దీని కోసం మీకు వేలల్లో ఫాలోయర్లు ఉండాల్సిన అవసరం లేదు, మీ ఆడియన్స్ మీ మాటను ఎంతవరకు నమ్ముతున్నారనేదే ముఖ్యం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


