Milky Mist IPO : మిల్కీ మిస్ట్​ ఐపీఓకి 16శాతం లిస్టింగ్ గెయిన్స్! అప్లై చేయాలా? వద్దా?

Milky Mist IPO gmp : మిల్కీ మిస్ట్ ఐపీఓ బిడ్డింగ్‌కు నేడే ఆఖరు రోజు. రూ. 133-140 ప్రైస్ బ్యాండ్‌తో వస్తున్న ఈ ఐపీఓకి మంచి స్పందన లభిస్తుండగా.. గ్రే మార్కెట్‌లో 16 శాతం ప్రీమియం కొనసాగుతోంది. మరి ఈ ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? నిపుణులు ఏమంటున్నారంటే..

Published on: Aug 13, 2026, 11:20:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇన్వెస్టర్లకు అప్డేట్! మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ ఐపీఓ ముగింపు దశకు చేరుకుంది. ఆగస్టు 11న ప్రారంభమైన ఈ పబ్లిక్ ఇష్యూ సబ్​స్క్రిప్షన్ నేటితో (ఆగస్టు 13, 2026) ముగియనుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు దరఖాస్తు చేసుకోవడానికి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్ ఛాన్స్..
మిల్కీ మిస్ట్ ఐపీఓ అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్ ఛాన్స్..

ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ యాజమాన్యం ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 133 నుండి రూ. 140గా నిర్ణయించింది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ ద్వారా కంపెనీ మార్కెట్ నుంచి రూ. 1,553 కోట్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బుక్-బిల్డ్ ఇష్యూలో తాజా షేర్లతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్) కూడా ఉంది. ఈ కంపెనీ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) లలో లిస్ట్ కానున్నాయి.

మిల్కీ మిస్ట్ ఐపీఓ- గ్రే మార్కెట్ ప్రీమియం..

గ్రే మార్కెట్‌లో ఈ మిల్కీ మిస్ట్ షేర్ల ట్రేడింగ్ చాలా బలంగా సాగుతోంది. ఇన్వెస్ట్‌గైన్ నివేదిక ప్రకారం.. నేడు మిల్కీ మిస్ట్ ఐపీఓ జీఎంపీ రూ. 22 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే అప్పర్ ప్రైస్ బ్యాండ్ రూ. 140తో పోలిస్తే ఇది సుమారు 16 శాతం ప్రీమియంతో మార్కెట్​లో లిస్ట్ అవుతుందని సూచిస్తోంది.

అయితే, కేవలం జీఎంపీ చూసి ఐపీఓలకు సబ్​స్క్రైబ్ చేసుకోకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు.

మిల్కీ మిస్ట్ ఐపీఓ- సబ్‌స్క్రిప్షన్ వివరాలు..

మూడో రోజు ఉదయం 10:45 గంటల సమయానికి ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం 3.21 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇందులో రిటైల్ విభాగం 3.26 రెట్లు, ఎన్‌ఐఐ విభాగం 6.47 రెట్లు భర్తీ కాగా, క్యూఐబీ పోర్షన్ 0.66 రెట్లు అప్లై అయింది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ- నిపుణుల రివ్యూలు..

ఈ ఐపీఓ పట్ల ఆర్థిక నిపుణులు సానుకూల ధోరణి కనబరుస్తున్నారు.

ఆనంద్ రాథీ బ్రోకరేజ్ సంస్థ ఈ ఇష్యూకి 'అప్లై' ట్యాగ్ ఇస్తూ.. “మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ బలమైన రెవెన్యూ వృద్ధిని కలిగి ఉంది. ప్యాకేజెడ్ పన్నీర్, గ్రీక్ యోగర్ట్ వంటి కీలక విభాగాలలో కంపెనీ మార్కెట్ లీడర్‌గా ఉంది. అయితే వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నందున దీర్ఘకాలిక పెట్టుబడిదారులు దీనికి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు,” అని పేర్కొంది.

ఈక్వీవిజన్ కూడా సానుకూల స్పందనను ఇస్తూ.. “మిల్కీ మిస్ట్ కంపెనీ ఆర్థిక పనితీరు అద్భుతంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2026లో రెవెన్యూ 33.58 శాతం పెరగగా, లాభం ఏకంగా 175.66 శాతం ఎగబాకింది. ప్యాకేజెడ్ పన్నీర్‌లో 19 శాతం, గ్రీక్ యోగర్ట్‌లో 35-40 శాతం మార్కెట్ వాటాను కంపెనీ దక్కించుకుంది,” అని వివరించింది. ఎస్ఎంఐఎఫ్ సెక్యూరిటీస్, సుశీల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఈ ఐపీఓకి 'సబ్‌స్క్రైబ్' రేటింగ్ ఇచ్చాయి.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More