...
...
Next Story

milky mist ipo : మిల్కీ మిస్ట్ ఐపీఓ ఇన్వెస్టర్లకు 18శాతం లిస్టింగ్ గెయిన్స్..

Milky Mist share price : భారత స్టాక్ మార్కెట్లో మిల్కీ మిస్ట్ ఫుడ్ డైరీ షేర్లు ఘనంగా అరంగేట్రం చేశాయి. ఐపీఓ ధర రూ. 140 కాగా, 18 శాతం ప్రీమియంతో లిస్టై ఇన్వెస్టర్లకు లాభాలు పంచాయి.

Published on: Aug 18, 2026, 10:38:23 IST
Advertisement

భారత స్టాక్ మార్కెట్లో మిల్కీ మిస్ట్ ఫుడ్ డైరీ షేర్లు మంగళవారం (ఆగస్టు 18, 2026) మంచి లాభాలతో అరంగేట్రం చేశాయి. మార్కెట్ అంచనాలను తలకిందులు చేస్తూ ఈ షేర్లు అదరగొట్టాయి. మిల్కీ మిస్ట్ షేరు ఐపీఓ ధర రూ. 140 కాగా.. నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్‌ఈ)లలో ఏకంగా 17.8 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ప్రారంభించింది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ లిస్టింగ్ వివరాలు.. (Company Website)
మిల్కీ మిస్ట్ ఐపీఓ లిస్టింగ్ వివరాలు.. (Company Website)

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో ఈ మిల్కీ మిస్ట్ షేరు రూ. 165 వద్ద ఓపెన్ అయింది. దీని ద్వారా ఐపీఓ పొందిన ఇన్వెస్టర్లకు తొలి రోజే సుమారు 18 శాతం లాభాలు దక్కినట్లయింది. మార్కెట్ వర్గాల అంచనాల కంటే ఈ లిస్టింగ్ అత్యధికంగా రావడం విశేషం. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ప్రకారం ఈ షేరు రూ. 159.7 వద్ద లిస్ట్ అవుతుందని భావించినప్పటికీ, అంతకు మించి లాభాలను అందించింది.

మిల్కీ మిస్ట్ ఐపీఓ విశేషాలు..

ఆగస్టు 11 నుంచి ఆగస్టు 13 వరకు జరిగిన ఈ మిల్కీ మిస్ట్ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియలో మదుపర్ల నుంచి అపూర్వ స్పందన లభించింది. మూడు రోజుల పాటు సాగిన ఈ పబ్లిక్ ఇష్యూ మొత్తం మీద 56.12 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

వివిధ విభాగాల్లో ఇన్వెస్టర్లు చూపిన ఆసక్తి ఈ విధంగా ఉంది:

రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 8.40 రెట్లు బుక్ అయింది.

ఎన్ఐఐ సెగ్మెంట్ 34.91 రెట్ల స్పందనను పొందింది.

ఇక క్యూఐబీ కేటగిరీలో అత్యధికంగా 155.83 రెట్లు దరఖాస్తులు రావడం విశేషం.

ఐపీఓ ద్వారా అంచనా వేసిన నికర ఆదాయం రూ. 1,121.41 కోట్లలో, వివిధ రుణాల తిరిగి చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు కోసం ఏకంగా రూ. 496.86 కోట్లను కేటాయించారు. అలాగే తమిళనాడులోని పెరుందురైలో ఉన్న తమ తయారీ కర్మాగారాన్ని మరింత విస్తరించి, ఆధునీకరించడానికి మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్​పెండీచర్) కింద మరో రూ. 469.24 కోట్లను వెచ్చించనున్నారు.

ఐపీఓ నిర్వహణ భాగస్వాములు..

జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్: ఈ పబ్లిక్ ఇష్యూకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది.

కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్: ఈ ఇష్యూకి రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.

కంపెనీ నేపథ్యం, ఉత్పత్తులు..

జులై 2014లో స్థాపించిన మిల్కీ మిస్ట్ డెయిరీ ఫుడ్.. ప్రీమియం, విలువైన డెయిరీ ఉత్పత్తులపై దృష్టి సారించిన ప్రముఖ భారతీయ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీగా గుర్తింపు పొందింది.

  • కంపెనీ అందిస్తున్న ప్రధాన ఉత్పత్తులు:
  • చీజ్, పన్నీర్, వెన్న, పెరుగు, నెయ్యి, యోగర్ట్
  • ఐస్ క్రీమ్‌లు, యూహెచ్‌టీ ఉత్పత్తులు
  • ఫ్రోజెన్ ఫుడ్స్, రెడీ-టు-ఈట్, రెడీ-టు-కుక్ పదార్థాలు
  • చాక్లెట్లు

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా స్టాక్​లో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks