KitKat : వెరైటీ దొంగలు.. 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లను లేపేశారు!
KitKat bars stolen : యూరోప్‌లో ఒక భారీ చాక్లెట్ హైస్ట్ జరిగింది! పోలాండ్‌కు రవాణా అవుతున్న దాదాపు 12 టన్నుల (4,13,793 బార్‌లు) కిట్‌క్యాట్ చాక్లెట్లు మాయమయ్యాయి! దీనిపై కంపెనీ స్పందించిన తీరు, నెటిజన్ల ఫన్నీ రియాక్షన్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి..
దొంగలు నగలను దోచుకున్నారనో, బ్యాంకు దొచుకున్నారనో, వాహనాలు దొంగలించారనో మీరు వినే ఉంటారు. కానీ దొంగలు ‘చాక్లెట్ల’ను దొంగలించడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? యూరోప్‌లో తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా 12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లును దొంగలు దోచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

నెస్లే కంపెనీ చమత్కారమైన స్పందన..
గత వారం ఇటలీలోని ఒక ప్రొడక్షన్ సైట్ నుంచి పోలాండ్‌కు బయలుదేరిన ఒక ట్రక్కు దారిలోనే అదృశ్యమైంది. అందులో సుమారు 4,13,793 క్రంచీ వేఫర్ చాక్లెట్లు ఉన్నాయి.
ఈ భారీ చోరీపై కిట్‌క్యాట్ తయారీ సంస్థ నెస్లే చాలా వ్యంగ్యంగా స్పందించింది:
మేము ఎప్పుడూ కిట్‌క్యాట్‌తో ఒక ‘బ్రేక్’ తీసుకోమని ప్రజలను ప్రోత్సహిస్తుంటాం. కానీ ఈ దొంగలు మా సందేశాన్ని మరీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.. అందుకే ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో కలిసి 'బ్రేక్' (పారిపోయారు) తీసుకున్నారు," అని పేర్కొంది.
"దొంగలకు మంచి టేస్ట్ ఉన్నందుకు మేము అభినందిస్తున్నాము, కానీ కార్గో దొంగతనాలు వ్యాపారాలకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఇలాంటి మోసపూరిత పద్ధతులపై అవగాహన పెంచడానికే మేము ఈ విషయాన్ని బహిర్గతం చేశాము," అని పేర్కొంది.
సోషల్ మీడియాలో పేలిన మీమ్స్..
ఈ వార్త తెలియగానే ఇంటర్నెట్‌లో ఫన్నీ కామెంట్లు, మీమ్స్ వెల్లువెత్తాయి:
ఒక నెటిజన్ ఫన్నీ ఫోటోను షేర్ చేస్తూ.. "ఎవరో ఒకరు ఎక్కడో చాలా లాలాలాలాలాంగ్గ్ బ్రేక్ తీసుకుంటున్నారు" అని రాశారు.
మరొకరు "4 లక్షల కిట్‌క్యాట్‌లు దొంగిలించిన వాడు జీవితాంతం తింటాడు" అంటూ ఒక జోక్ వేశారు.
"12 టన్నుల కిట్‌క్యాట్‌లతో ఏం చేస్తారు? బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతారా? లేక లోకం అంతమయ్యే రోజు కోసం బంకర్‌లో దాచుకుంటారా?" అంటూ ఒక యూజర్ ఆప్షన్స్ ఇచ్చారు.
"జర్మనీలో 15 టన్నుల గమ్మీ బేర్స్, ఇటలీలో 12 టన్నుల కిట్‌క్యాట్స్.. ఎవరో 'క్యాండీ వరల్డ్' నిర్మించబోతున్నారు" అంటూ నెటిజన్లు ఆటపట్టించారు.
ఈ విషయాన్ని నెస్లే ఫన్నీ వే లో తీసుకోవడంపై కూడా కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఎఫ్1 స్పెషల్ ఎడిషన్:
అథ్లెటిక్ నివేదిక ప్రకారం, దొంగిలించినవి సాధారణ కిట్‌క్యాట్ బార్‌లు కావు! గత ఏడాది కిట్‌క్యాట్ ఫార్ములా వన్‌తో అధికారిక భాగస్వామిగా చేరిన సందర్భంగా లాంచ్ చేసిన 'ఫార్ములా వన్ కలెక్షన్'. ఇవి చిన్న రేసింగ్ కార్ల ఆకారంలో ఉంటాయి. ఈ ఉత్పత్తులపై ప్రతి దానికీ ఒక ప్రత్యేకమైన 'బ్యాచ్ కోడ్' ఉంటుంది, కాబట్టి వీటిని ట్రేస్ చేయడం సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది. అలాగే వినియోగదారుల భద్రతకు లేదా సప్లైకి ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీ హామీ ఇచ్చింది.
అయితే, ఈస్టర్ సమీపిస్తున్న వేళ ఇంత భారీ మొత్తంలో కిట్‌క్యాట్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని చోట్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వొచ్చు అని కంపెనీ చెబుతోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


