తెలంగాణ : 30 రోజుల్లో 500కుపైగా గ్రామీణ పాఠశాలలకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌

గ్రామాల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, డిజిటల్ తరగతి గదులను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు టి-ఫైబర్ రాష్ట్రంలోని 26000లకుపైగా ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించనుంది.

Published on: Jan 29, 2026, 09:35:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలోని గ్రామీణ, మారుమూల ప్రాంతాలలోని 500కి పైగా ప్రభుత్వ పాఠశాలలు 30 రోజుల్లోనే హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యాయి. 2,010 ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి పాఠశాల విద్యా శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న తరువాత తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టి-ఫైబర్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది.

టి-ఫైబర్
టి-ఫైబర్

మొదటి దశ కింద ప్రధాన టెలికాం ఆపరేటర్లు లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కవర్ చేయని గ్రామాల్లోని పాఠశాలలను కనెక్ట్ చేయడానికి టీ-ఫైబర్ వర్క్ ఆర్డర్‌ను పొందిందని అధికారులు చెప్పారు. మొదటి నెలలో బాగంగా 500కి పైగా స్కూళ్లను కవర్ చేశారు. తర్వాది దశలో 1,410 పాఠశాలలను దశలవారీగా ఇంటర్నెట్ ద్వారా అనుసంధానిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 26,000కుపై ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని విస్తరించేందుకు ప్రణాళిక ఉంది.

ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్టివిటీకి సాయం చేయడానికి దాతలను ఆహ్వానించడానికి టీ-ఫైబర్ సీఎస్ఆర్ ఫండ్స్‌ ఆధారిత ప్రాజెక్ట్ నమూనాను కూడా సిద్ధం చేస్తోంది. ఈ నమూనా కింద ఒక పాఠశాలను రోజుకు దాదాపు రూ.66 ఖర్చుతో అనుసంధానించవచ్చు.

బ్రాడ్‌బ్యాండ్ సేవలు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థులు ఇప్పుడు డిజిటల్ పాఠాలను నేర్చుకుంటున్నారు. దీనిద్వారా విద్యార్థులకు చాలా విషయాలపై అవగాహన వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్నెట్ సదుపాయంతో డిజిటల్ తరగతి గదులు, లెర్నింగ్ మేనెజ్‌మెంట్ సిస్టమ్, ఆన్‌లైన్ అసెస్‌మెంట్స్, ఇంటరాక్టివ్ కంటెంట్‌ను ఉపయోగిస్తున్నాయి. కొన్ని పాఠశాలలు పాఠ్యాంశాలకు సంబంధించిన కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, డిజిటల్ అక్షరాస్యతను మెరుగుపరచడానికి పలు ఏఐ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాయి. ఉపాధ్యాయులు ఆన్‌లైన్ వీడియోలు, డిజిటల్ వనరులను అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు.

గ్రామాల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, డిజిటల్ తరగతి గదులను అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. టి ఫైబర్ రాష్ట్రంలోని 26000లకుపైగా ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తోంది.

టి-ఫైబర్ దాదాపు 1,500 రైతు వేదికలకు కనెక్టివిటీని విస్తరించింది. దీని వలన రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆన్‌లైన్‌లో సంభాషించడానికి, పంట సమస్యలపై సలహాలు పొందడానికి, శాస్త్రీయ ఇన్‌పుట్‌లను పొందేందుకు వీలు కల్పిస్తుంది. డిజిటల్ మౌలిక సదుపాయాల ద్వారా విద్య, వ్యవసాయ సేవలను మెరుగుపరచడాన్ని ట-ఫైబర్ లక్ష్యంగా పెట్టుకుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More