Moto G87 : 200ఎంపీ కెమెరాతో మోటోరోలా కొత్త స్మార్ట్​ఫోన్- ధర ఎంతంటే..

Moto G87 launch date in India : మోటరోలా సంస్థ తన పాపులర్ 'జీ' సిరీస్‌లో సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ87ని గ్లోబల్ మార్కెట్​లో ఆవిష్కరించింది. ప్రధానంగా కెమెరా పర్ఫార్మెన్స్, మన్నిక లక్ష్యంగా ఈ ఫోన్‌ను రూపొందించారు. వివరాల్లోకి వెళితే..

Published on: May 1, 2026, 07:28:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Moto G87 price : బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందించే మోటోరోలా.. ఈసారి మోటో జీ87 అనే స్మార్ట్​ఫోన్​తో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది. అద్భుతమైన డిస్​ప్లే క్వాలిటీతో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్ మార్కెట్​లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం యూకేలో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారత్ సహా ఇతర దేశాల్లో లాంచ్ కానుంది! ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ధర, ఫీచర్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మోటోరోలా జీ87..
మోటోరోలా జీ87..

మోటో జీ87- 200 మెగాపిక్సెల్ కెమెరా, అదిరే క్లారిటీ..

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటోరోలా ఈ మోటో జీ87లో 200ఎంపీ మెయిన్ కెమెరాను అందించింది.

ఓఐఎస్ సపోర్ట్: ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా స్థిరంగా వస్తాయి.

జూమ్: ఇందులో 2x లాస్‌లెస్ జూమ్, 10x డిజిటల్ జూమ్ ఫీచర్లు ఉన్నాయి.

సెల్ఫీ: సెల్ఫీల కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరాను అమర్చారు. ఇది 2కే రిజల్యూషన్‌తో వీడియోలను రికార్డ్ చేయగలదు.

మోటో జీ87- కళ్లు చెదిరే డిస్​ప్లే, అత్యధిక బ్రైట్‌నెస్..

స్మార్ట్​ఫోన్ 6.78- ఇంచ్ 1.5కే ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్​ప్లేతో వస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అంటే మిట్టమధ్యాహ్నం ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ వల్ల గేమింగ్, స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐని వాడారు.

మోటో జీ87 మన్నిక విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఇది ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లతో వస్తుంది. అంటే దుమ్ము, ధూళి, నీటి ధారలను కూడా తట్టుకోగలదు. అంతేకాకుండా, ఇది మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810H) సర్టిఫికేషన్ పొందింది. పొరపాటున ఫోన్ కింద పడినా గట్టి దెబ్బలను తట్టుకునేలా దీని డిజైన్ ఉంది.

మోటో జీ87- సాఫ్ట్‌వేర్, పర్ఫార్మెన్స్..

ప్రాసెసర్: ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 (6ఎన్​ఎం) చిప్‌సెట్ వాడారు.

ఓఎస్: లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16తో వస్తున్న తొలి ఫోన్లలో ఇది ఒకటి.

ఏఐ ఫీచర్లు: గూగుల్ జెమినీ, సర్కిల్ టు సెర్చ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి.

బ్యాటరీ: 5200ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 30డబ్ల్యూ టర్బో పవర్ ఛార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది.

మోటో జీ87- ధర, లభ్యత..

యూకే మార్కెట్​లో మోటో జీ87 (8జీబీ + 256జీబీ) ధర 349.99 పౌండ్లు (సుమారు రూ. 45,000) గా నిర్ణయించారు. ఇది పాంటోన్ ఓవర్చర్, పాంటోన్ బ్లూ అటోల్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. భారత్‌లో దీని లాంచ్ తేదీ, ధరపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. మోటో జీ87 మెయిన్ కెమెరా సామర్థ్యం ఎంత?

మోటో జీ87లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు, ఇది ఓఐఎస్ టెక్నాలజీతో పనిచేస్తుంది.

2. ఈ ఫోన్ వాటర్ రెసిస్టెన్స్‌ కలిగి ఉందా?

అవును, ఇది ఐపీ66, ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లను కలిగి ఉంది. అంటే నీటిలో మునిగినా లేదా బలమైన నీటి జల్లులు పడినా ఫోన్ సురక్షితంగా ఉంటుంది.

3. మోటో జీ87 ఏ ఆండ్రాయిడ్ వెర్షన్‌పై పనిచేస్తుంది?

ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో యూఐతో పనిచేస్తుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More