ఐపీఎల్ అభిమానులకు, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 'యెల్లో ఆర్మీ'కి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి బిగ్ అప్డేట్! వచ్చే ఐపీఎల్ 2027 సీజన్లో ఆయన మైదానంలోకి దిగుతారా లేదా అనే అంశంపై సుదీర్ఘ ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 2026 లోగా తన భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

పిక్క కండరాల తీవ్ర గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యారు. కెప్టెన్సీ మార్పు, ధోనీ గైర్హాజరీ వల్ల సీఎస్కే గత సీజన్లో ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేక అభిమానులను నిరాశపరిచింది. అప్పటి నుంచి ధోనీ రిటైర్మెంట్పై రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఇటీవలే జరిగిన ఒక హెల్త్‌కేర్ ఈవెంట్లో పాల్గొన్న ధోనీ, తన శారీరక ఫిట్‌నెస్‌పై వ్యాఖ్యానించారు.
'డాక్టర్ల చేతుల్లోనే నా ఫిట్నెస్!'
ధోనీ తన మార్కు శైలిలో సరదా వ్యాఖ్యలతో అభిమానులను ఆకట్టుకున్నారు.
"ముందుగా నేను కొన్ని ఫిట్నెస్ పరీక్షలు ఎదుర్కోవాలి. డాక్టర్లు ఇచ్చే రిపోర్టు బట్టి, ఇంకో సీజన్ ఆడేంత బలం నాలో ఉందో లేదో డిసెంబర్ లోపు చూసుకుంటాను," అని ధోనీ నవ్వుతూ చెప్పారు.
"ఈ పాత వింటేజ్ వెహికిల్.. రోడ్డు మీద సరిగ్గా పరుగెత్తాలంటే డాక్టర్లే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. అందుకే ప్రెజర్ అంతా వారిపైనే పెట్టేశాను," అని తన శారీరక దృఢత్వంపై వైద్యులకు బాధ్యత అప్పగిస్తూ ధోనీ సరదాగా పేర్కొన్నారు.
ధోనీ రీఎంట్రీపై సీఎస్కే సీఈఓ ఆశలు!
ఎంఎస్ ధోనీ రాకపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ధీమాగా ఉంది. ధోనీ మరో సీజన్ ఆడతాడని ఆశిస్తున్నట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.
{{/usCountry}}ఎంఎస్ ధోనీ రాకపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ధీమాగా ఉంది. ధోనీ మరో సీజన్ ఆడతాడని ఆశిస్తున్నట్లు సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు.
{{/usCountry}}"ధోనీ నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉంది. చెన్నై వచ్చాక ఆయనే స్వయంగా దీనిపై సమాచారం ఇస్తారు. అయితే, ధోనీ మళ్లీ సీఎస్కే తరఫున యెల్లో జెర్సీ ధరించి బరిలోకి దిగుతాడనే నమ్మకం నాకు ఉంది," అని కాశీ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు.
సరికొత్త వ్యూహాలతో సీఎస్కే.. జహీర్ ఖాన్ ఎంట్రీ!
గత సీజన్లో ప్లేఆఫ్స్ మిస్ కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ సంచలన మార్పులు చేసింది. జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోగా, భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ సీఎస్కే నూతన హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ధోనీ వంటి దిగ్గజ ఆటగాడు తుది జట్టులో ఉంటే జహీర్ ఖాన్ నేతృత్వంలోని చెననై సూపర్ కింగ్స్ కోచింగ్ టీమ్‌కు కొండంత బలం చేకూరుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో, మైదానంలో 'తలా' ఇచ్చే ఫినిషింగ్ పంచ్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఐపీఎల్ 2027లో ధోనీ కనిపిస్తాడా? లేదా? అనే ప్రశ్నకు త్వరలోనే ముంగింపు పడనుంది.