శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Mutual fund SIP : మ్యూచువల్ ఫండ్ సిప్.. ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలి? ఇవి తెలుసుకోండి..
నిర్దిష్ట ఆర్థిక లక్ష్యం లేకపోయినా మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఎలాగో నిపుణులు వివరించారు. మిగులు ఆదాయం, కాలపరిమితి, స్టెప్-అప్ విధానం ఆధారంగా సరైన మొత్తాన్ని ఎంచుకునే ఆ 5 స్టెప్స్ గురించి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ముందుగా వచ్చే ప్రశ్న.. నెలకు ఎంత మొత్తం పెట్టాలి? అని. ఇల్లు కొనడం, రిటైర్మెంట్ వంటి నిర్దిష్ట లక్ష్యం ఉంటే, ఆ లక్ష్యానికి అవసరమైన నిధి, అంచనా రాబడి, పెట్టుబడి కాలపరిమితి ఆధారంగా సిప్ మొత్తాన్ని సులభంగా లెక్కించవచ్చు. కానీ ఎలాంటి నిర్దిష్ట లక్ష్యం లేకుండానే ఇన్వెస్టింగ్ మొదలుపెట్టాలనుకుంటే ఏం చేయాలి? అలాంటి వారికోసం నిపుణులు ఐదు ఆచరణాత్మక సూత్రాలు సూచించారు.

మ్యూచువల్ ఫండ్ సిప్- నెలవారీ మిగులు ఆదాయాన్ని లెక్కించండి..
చేతికి వచ్చే జీతం నుంచి ఇంటి ఖర్చులు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇతర ఆర్థిక బాధ్యతలను తీసివేయగా మిగిలే మొత్తమే నెలవారీ మిగులు. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ట్రాక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ వేదాంత్ గుప్తే లైవ్‌మింట్‌తో మాట్లాడుతూ, నెలకు రూ. 1 లక్ష సంపాదించే వ్యక్తి 50:30:20 బడ్జెట్ నియమం ప్రకారం కనీసం 20 శాతం అంటే రూ. 20,000 ఆదా చేయాలని సూచించారు.
వైజ్ ఫిన్‌సర్వ్ గ్రూప్ డైరెక్టర్, సీఓఓ చారు పహుజా మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ నియమం ఆదాయంలో 50 శాతం నిత్యావసరాలకు, 30 శాతం వ్యక్తిగత, జీవనశైలి ఖర్చులకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయిస్తుందని చెప్పారు. సిప్ ప్రారంభించే ముందే కనీసం ఆరు నెలల నిత్యావసర ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలని గుప్తే తెలిపారు.
మ్యూచువల్ ఫండ్ సిప్- ఎంత ఇన్వెస్ట్ చేయగలరో నిర్ణయించుకోండి..
నెలవారీ మిగులు మొత్తాన్ని పూర్తిగా సిప్‌లకే కట్టబెట్టకూడదు. మీ మిగులు రూ. 20,000 ఉంటే, రూ. 10,000 సిప్‌తో మొదలుపెట్టి మిగతా మొత్తాన్ని ఇతర అవసరాలకు ఉంచుకోవచ్చు.
మిగులులో సగం వరకు ఇన్వెస్ట్ చేయడం వల్ల అత్యవసర నిధి సమకూర్చుకోవడానికి, అనుకోని ఖర్చులను తట్టుకోవడానికి వీలుంటుందని గుప్తే చెప్పారు. మధ్యలో ఆపేసే పెద్ద సిప్ కంటే, నిరంతరం కొనసాగించగలిగే చిన్న సిప్ ఎప్పుడూ మేలని స్పష్టం చేశారు. ఖర్చులు ఎక్కువగా వచ్చే నెలల్లో చేతిలో కొంత నగదు ఉండటం సౌలభ్యాన్ని ఇస్తుందని పహుజా జోడించారు.
మ్యూచువల్ ఫండ్ సిప్- కాలపరిమితి, ఫండ్ ఎంపిక..
మీ పెట్టుబడి కాలపరిమితే ఎలాంటి మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకోవాలో నిర్ణయిస్తుంది. నిర్దిష్ట లక్ష్యం లేనివారు కాలపరిమితిని మార్గదర్శకంగా తీసుకోవాలని గుప్తే సూచించారు. స్వల్పకాలిక అవసరాలకు తగిన డెట్ ఫండ్లను చూడాలి. ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉంటే, మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకోగలిగే స్థితిలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. మధ్యకాలిక లక్ష్యాలు ఉన్నవారు తమ రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఈక్విటీ-డెట్ కలయిక లేదా తగిన హైబ్రిడ్ ఫండ్ వైపు చూడవచ్చని పహుజా వివరించారు.
గత ఏడాది అత్యధిక రాబడి ఇచ్చిందన్న కారణంతో ఏ ఫండ్‌ను గుడ్డిగా ఎంచుకోవద్దు! మూడేళ్లు, ఐదేళ్ల రాబడిని పరిశీలించాలి; బెంచ్‌మార్క్ టీఆర్ఐ, కేటగిరీలోని ఇతర ఫండ్ల కంటే నిలకడగా మెరుగైన పనితీరు చూపే వాటిని ఎంచుకోవాలని గుప్తే సూచించారు. విభిన్న మార్కెట్ పరిస్థితుల్లో నిలకడగా రాణించే రోలింగ్ రిటర్న్స్, తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో, మెరుగైన రిస్క్-అడ్జస్టెడ్ రాబడిని సూచించే అధిక షార్ప్ రేషియోను గమనించాలి.
మ్యూచువల్ ఫండ్ సిప్- అలోకేషన్, స్టెప్-అప్ సిప్ శక్తి..
మిగులు, కాలపరిమితి, రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ కేటాయింపు ఖరారు చేయాలి. దీర్ఘకాలిక దృష్టితో నెలకు రూ. 10,000 సిప్ చేస్తూ 70:30 ఈక్విటీ-డెట్ విభజన పాటించాలనుకుంటే, లార్జ్-క్యాప్ లేదా బ్రాడ్-మార్కెట్ ఇండెక్స్ ఫండ్‌కు రూ. 5,000, ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌కు రూ. 2,000, తగిన డెట్ ఫండ్‌కు రూ. 3,000 చొప్పున పంచుకోవచ్చని పహుజా సూచించారు. అయితే రూ. 2,000 లేదా రూ. 5,000తో మొదలుపెట్టేవారు అనేక పథకాల్లో విభజించాల్సిన అవసరం లేదు! తమ రిస్క్‌కు సరిపోయే ఒక చక్కటి డైవర్సిఫైడ్ ఫండ్ సరిపోతుంది.
సిప్ మొదలుపెట్టిన తర్వాత ఆదాయం పెరిగేకొద్దీ సిప్ మొత్తాన్ని కూడా పెంచాలి. ఏటా చేసే స్టెప్-అప్ దీర్ఘకాలంలో సంపదను గణనీయంగా పెంచుతుందని పహుజా వివరించారు. ఉదాహరణకు 10-10-10 విధానం తీసుకుంటే—పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ, ఏటా 10 శాతం రాబడి అనుకుని, ప్రతి ఏటా సిప్ మొత్తాన్ని 10 శాతం పెంచితే ఫలితం ఇలా ఉంటుంది. సాధారణ రూ. 10,000 సిప్ ద్వారా రూ. 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అంచనా నిధి రూ. 20.66 లక్షలుగా ఉంటుంది. అదే 10 శాతం వార్షిక స్టెప్-అప్‌తో రూ. 19.12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే అంచనా నిధి రూ. 30.96 లక్షలకు చేరుతుంది! అంటే దాదాపు రూ. 10.3 లక్షల అదనపు నిధి సమకూరుతుంది.
"ఇన్వెస్టింగ్ ప్రయాణం మొదలుపెట్టేవారు సరైన సిప్ మొత్తం కోసం వేచి చూడాల్సిన పనిలేదు! ఈ రోజు సౌకర్యవంతంగా పెట్టగలిగే మొత్తంతో ప్రారంభించండి," అని పహుజా స్పష్టం చేశారు. ఆదాయం పెరిగేకొద్దీ, లక్ష్యాలు స్పష్టమయ్యేకొద్దీ పెట్టుబడి మొత్తాన్ని, ఆస్తుల కేటాయింపును సమీక్షించుకుంటూ ముందుకు సాగవచ్చని ఆమె తెలిపారు.

E-Paper
