సబ్​స్క్రిప్షన్ చివరి రోజు పెరిగిన MV Electrosystems IPO జీఎంపీ- అప్లై చేయాలా? వద్దా?

MV Electrosystems IPO gmp : ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ నేటితో (ఆగస్టు 3) ముగియనుంది. మూడో రోజు నాటికి రీటైల్, ఎన్‌ఐఐ కేటగిరీల్లో సబ్‌స్క్రిప్షన్ ఊపందుకుంది. గ్రే మార్కెట్‌లోనూ ప్రీమియం పెరగ్గా, బ్రోకరేజ్ సంస్థల రేటింగ్‌లు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

Published on: Aug 3, 2026, 11:23:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారత ప్రాథమిక మార్కెట్​లో జులై 30న ప్రారంభమైన ‘ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్’ పబ్లిక్ ఇష్యూ నేటితో (ఆగస్టు 3, 2026) ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈక్విటీ షేరు రూ.400 నుంచి రూ.425 ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ బుక్-బిల్డింగ్ ఇష్యూలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లకు ఈరోజే చివరి అవకాశం.

ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ ఐపీఓ అప్డేట్స్.. (Photo: Courtesy company website)
ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ ఐపీఓ అప్డేట్స్.. (Photo: Courtesy company website)

రూ.290 కోట్ల నిధులను సేకరించడమే లక్ష్యంగా కంపెనీ నూతన షేర్లను జారీ చేస్తోంది. మరోవైపు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు విశేష స్పందన లభిస్తుండటం, సెకండరీ మార్కెట్‌లో సానుకూల ధోరణి కనిపిస్తుండటంతో గ్రే మార్కెట్‌లోనూ ఈ షేర్ల డిమాండ్ పెరిగింది.

ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- జీఎంపీ..

ఇన్వెస్టర్‌గెయిన్ సమాచారం ప్రకారం.. గ్రే మార్కెట్‌లో ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ షేర్లు నేడు రూ.120 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. గురువారం బిడ్డింగ్ ప్రారంభం కాకముందు ఉన్న జీఎంపీతో పోలిస్తే ఇది రూ.20 పెరగడం గమనార్హం. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న భారీ ఆదరణే ఈ పెంపునకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- సబ్​స్క్రిప్షన్ స్టేటస్..

సబ్‌స్క్రిప్షన్ మూడో రోజైన సోమవారం ఉదయం 10:18 గంటల సమయానికి ఓవరాల్‌గా ఈ ఇష్యూ 15.42 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

రీటైల్ విభాగం: 43.19 రెట్లు

నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్​ఐఐ): 25.89 రెట్లు

క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బైయర్స్ (క్యూఐబీ): 0.92 రెట్లు

బ్రోకరేజ్ సంస్థల రివ్యూలు..

ఈ ఐపీఓపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు వేర్వేరు రేటింగ్‌లు ఇచ్చాయి.

ఐపీఓను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని ‘జీఈపీఎల్ క్యాపిటల్’ సిఫార్సు చేసింది. “చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్​డబ్ల్యూ), ఇండియన్ రైల్వేస్ ఆమోదం పొందిన ఐజీబీటీ ఆధారిత 3-ఫేజ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను కంపెనీ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. రైల్వే టెండర్లలో పాల్గొనే అర్హత సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో (ఎఫ్​వై26) నష్టం నమోదైనప్పటికీ, ఆర్డర్ బుక్ బలంగా ఉండటంతో లిస్టింగ్ లాభాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు,” అని సంస్థ తెలిపింది.

‘వెంచురా సెక్యూరిటీస్’ కూడా ఈ ఐపీఓకు 'అప్లై' రేటింగ్ ఇచ్చింది. “పవర్ ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో బలమైన ఆర్ అండ్ డీ, ఇండియన్ రైల్వేస్‌తో సుదీర్ఘ అనుబంధం కంపెనీకి ప్రధాన బలాలు. రైల్వేల నుంచి 2026 జూన్ 30 నాటికి జిఎస్‌టీ మినహాయించి రూ.989.32 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయి,” అని వివరించింది.

ఈ ఐపీఓకు 'ఎస్బీఐ క్యాపిటల్ సెక్యూరిటీస్' సబ్‌స్క్రైబ్ రేటింగ్ ఇవ్వగా.. 'స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్' మాత్రం దూరంగా ఉండాలని సూచించింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, అరేటే సెక్యూరిటీస్ సంస్థలు ఎలాంటి రేటింగ్ ఇవ్వలేదు.

ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్ ఐపీఓ- కీలక తేదీలు..

  • షేర్ల కేటాయింపు : ఆగస్టు 4, 2026
  • రజిస్ట్రార్: కేఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్
  • లిస్టింగ్ తేదీ (అంచనా): ఆగస్టు 6, 2026 (బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ ఎక్స్​ఛేంజీల్లో)
  • లీడ్ మేనేజర్: సన్‌డే క్యాపిటల్ అడ్వైజర్స్

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More