...
...
Next Story

NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే రీఫండ్

NEET UG 2026 refund : నీట్ యూజీ 2026 రీఫండ్ మొత్తాన్ని అభ్యర్థుల బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా జమ చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. వెబ్‌సైట్‌లో వివరాలు తప్పుగా నమోదు చేసిన వారికి పరీక్ష తర్వాత మరో అవకాశం కల్పిస్తామని స్పష్టం చేసింది.

Published on: Jun 16, 2026, 05:33:50 IST
Advertisement

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం.. మే 3న రాసిన 'నీట్ యూజీ 2026' అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. పేపర్​ లీక్​తో పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో అభ్యర్థులకు రావాల్సిన రీఫండ్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అధికారిక పోర్టల్‌లో అభ్యర్థులు అప్‌డేట్ చేసిన వివరాల ఆధారంగానే ఈ నగదు జమ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా రీఫండ్ డబ్బులు చేరాలంటే.. పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ వివరాలు సరైనవేనా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది.

నీట్​ యూజీ 2026 అప్డేట్స్..
నీట్​ యూజీ 2026 అప్డేట్స్..

ఈ విషయమై సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో ఎన్‌టీఏ ఒక కీలక ప్రకటన చేసింది.

"అభ్యర్థులందరికీ రావాల్సిన నీట్​ యూజీ 2026 రీఫండ్ అమౌంట్ నేరుగా వారు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాంక్ ఖాతా వివరాలకే బదిలీ అవుతుంది. బ్యాంక్ వివరాలను అప్‌డేట్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి లేదా పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి పరీక్ష ముగిసిన తర్వాత వివరాలను సరిచేసుకోవడానికి ఎన్టీఏ మరో అవకాశం కల్పిస్తుంది" అని నిర్వాహకులు పేర్కొన్నారు.

మరోవైపు, జూన్ 14, 2026న నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (మళ్లీ నిర్వహించే పరీక్ష) కు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేసింది. అయితే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే ముందే అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను వెబ్‌సైట్‌లో ఒకసారి వెరిఫై చేసుకోవాలని పరీక్షల నియంత్రణ మండలి స్పష్టంగా ఆదేశించింది.

మీ బ్యాంక్ వివరాలను వెరిఫై చేసుకోవడం ఎలా?

అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని సరిచూసుకోవడానికి ఈ క్రింది పద్ధతిని అనుసరించవచ్చు:

మొదట నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.

స్క్రీన్‌పై కనిపించే 'Bank Account Verification' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

అక్కడ మీ బ్యాంక్ ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఖాతాదారుని పేరు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయాలి.

వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని నిర్ధారించుకున్నాక కన్‌ఫర్మ్ చేసి, సేవ్ చేయాలి.

4 లక్షల మంది అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్.. సాంకేతిక ఇబ్బందులపై స్పష్టత!

ఎన్టీఏ చేసిన మరొక పోస్ట్ ప్రకారం.. రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదలైన కొద్ది రోజుల్లోనే (జూన్ 21) దాదాపు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో కొంతమంది విద్యార్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయాన్ని కూడా ఎన్టీఏ అంగీకరించింది. ఈ గ్లిచెస్​ని వీలైనంత త్వరగా పరిష్కరించి, అభ్యర్థులందరికీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు వెల్లడించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks