...
...
Next Story

Fronx facelift : 2026 బలెనో హిట్- నెక్ట్స్ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్! సరికొత్త డిజైన్, ఫీచర్లతో

ఇటీవలే లాంచ్ అయిన బలెనో ఫేస్‌లిఫ్ట్ సాధించిన విజయం తర్వాత.. మారుతీ సుజుకీ ఇప్పుడు తన ప్రముఖ క్రాసోవర్ 'ఫ్రాంక్స్' ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో రాబోతున్న ఈ కారు విశేషాలను ఇక్కడ చూసేయండి..

Published on: Sep 9, 2026, 12:21:00 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతీ సుజుకీ, పండుగల సీజన్‌ను పురస్కరించుకుని వరుస కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇటీవల రూ. 6,09,900 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి తెచ్చిన 'బలెనో ఫేస్‌లిఫ్ట్'కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది. జీఎస్టి రేట్ల తగ్గింపు ప్రభావం, రిజర్వ్ బ్యాంక్ స్థిరమైన రెపో రేట్లు, పండుగల వేళ కస్టమర్లలో పెరిగిన కొనుగోలు ఉత్సాహాన్ని మారుతీ గరిష్టంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. బలెనో ఇచ్చిన గ్రాండ్ సక్సెస్ ఊపుతో, ఇప్పుడు తన పాపులర్ క్రాసోవర్ ఎస్‌యూవీ ‘ఫ్రాంక్స్’ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా మార్కెట్‌లోకి దించేందుకు ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ రంగం సిద్ధం చేసింది!

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్..

ఫ్రాంక్స్ అనేది ప్రాథమికంగా బలెనో ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన క్రాసోవర్ మోడల్ కావడంతో.. ప్రీమియం హ్యాచ్​బ్యాక్​లో తెచ్చిన మార్పులన్నీ త్వరలోనే ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌లోనూ కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్- సరికొత్త డిజైన్, మరింత బోల్డ్ లుక్!

బలెనో ఫేస్‌లిఫ్ట్‌లో తెచ్చిన మార్పుల తరహాలోనే, కొత్త ఫ్రాంక్స్ బయటి డిజైన్‌లో కీలకమైన అప్‌గ్రేడ్లు ఉండబోతున్నాయి.

ముందు భాగం: కారుకు ముందు వైపు సరికొత్త రేడియేటర్ గ్రిల్‌ను అందించనున్నారు. ఇది వాహనానికి మరింత బోల్డ్, అగ్రెసివ్ లుక్‌ను ఇస్తుంది.

అల్లాయ్ వీల్స్: కొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్‌ను పరిచయం చేయనున్నారు.

కలర్ ఆప్షన్లు: కొన్ని సరికొత్త రంగుల్లో ఈ కారు లభించనుంది.

అయితే, కారు మొత్తం పరిమాణం, హెడ్‌ల్యాంప్ క్లస్టర్, వెనుక వైపు ఉండే టెయిల్‌లైట్ల డిజైన్ ప్రస్తుత మోడల్‌లాగే కొనసాగే అవకాశం ఉంది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్- సరికొత్త జెడ్-సిరీస్ ఇంజిన్!

ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్​లో అత్యంత ప్రధానమైన మార్పు ఇంజిన్ విభాగంలోనే జరగనుంది. ప్రస్తుతం ఉన్న 1.2-లీటర్ కే-సిరీస్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ స్థానంలో, మారుతీ సరికొత్త 1.2-లీటర్ జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను ప్రవేశపెట్టనుంది.

సీఎన్జీ వేరియంట్: సీఎన్జిీ ప్రేమికుల కోసం తీసుకొచ్చే వేరియంట్ 67 బీహెచ్‌పీ పవర్, 101 ఎన్‌ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

ఈ కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్ వల్ల మైలేజ్ కూడా మునుపటి కంటే గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఇప్పటికే కొత్త స్విఫ్ట్, డిజైర్, బలెనో మోడళ్లలో ఈ ఇంజిన్ అద్భుతమైన పనితీరును కనబరిచింది.

మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్- అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు..

ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్ లోపల ప్రయాణికుల సౌకర్యార్థం బలెనో తరహాలోనే ప్లాటినమ్ స్థాయి అప్‌గ్రేడ్లు చేయనున్నారు.

వెంటిలేటెడ్ సీట్లు: ముందు సీట్లకు వెంటిలేషన్ ఫీచర్‌ను జోడించనున్నారు. వేసవిలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇన్ఫోటైన్‌మెంట్: టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ల యూజర్ ఇంటర్‌ఫేస్​ను మరింత ఆధునికంగా మార్చనున్నారు.

సీట్ల నాణ్యత: సీట్ల మెటీరియల్, ఇంటీరియర్ ఫ్యాబ్రిక్ నాణ్యతను పెంచనున్నారు.

సేఫ్టీలో నెక్ట్స్ లెవెల్: అడాస్, టీపీఎంఎస్ లభించే ఛాన్స్!

ఇటీవల కాలంలో భారత వినియోగదారులు భద్రతకు పెద్దపీట వేస్తుండటంతో, మారుతీ సుజుకీ సైతం తన కొత్త కార్లలో సేఫ్టీ ప్రమాణాలను భారీగా పెంచుతోంది. భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్ రేటింగ్‌లో గరిష్ట రేటింగ్ సాధించడమే లక్ష్యంగా ఈ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌ను తీర్చిదిద్దుతోంది.

లెవెల్-2 అడాస్: భద్రతను మరింత పెంచేందుకు అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ సూట్‌ను అందించే ఆలోచనలో కంపెనీ ఉంది.

టీపీఎంఎస్: టైర్లలో గాలి ఒత్తిడిని తెలిపే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్​ను కూడా జోడించనున్నారు.

భారతీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మారుతీ సుజుకీ తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడానికి ఈ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్ కీలక పాత్ర పోషించనుంది.

త్వరలోనే ఈ మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఫేస్​లిఫ్ట్ అధికారిక లాంచ్ తేదీ, ధరల వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks