New SUVs in India : మహీంద్రా నుంచి ఎస్‌యూవీల జాతర! ఎలక్ట్రిక్, ఐసీఈ విభాగాల్లో రానున్న కొత్త మోడల్స్​ ఇవే..

Upcoming Mahindra cars : భారతీయ రోడ్లపై ఎస్‌యూవీలంటే మహీంద్రానే గుర్తొస్తుంది. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుకునేలా కంపెనీ తన అప్​కమింగ్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను సిద్ధం చేసింది. ఇందులో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లతో పాటు పాపులర్ మోడళ్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కూడా ఉన్నాయి.

Published on: Mar 20, 2026, 06:01:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గత కొన్నేళ్లుగా భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా అండ్ మహీంద్రా తనదైన ముద్ర వేస్తోంది. అటు పెట్రోల్, డీజిల్ (ఐసీఈ) వాహనాల్లోనూ, ఇటు ఎలక్ట్రిక్ (ఈవీ) విభాగంలోనూ దూసుకుపోతున్న ఈ స్వదేశీ దిగ్గజం, భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నెక్ట్స్​ జనరేషన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుంచి పవర్‌ఫుల్ ఆఫ్ రోడర్ల వరకు రానున్న కాలంలో మహీంద్రా నుంచి రాబోయే కొత్త కార్ల వివరాలు మీకోసం..

మహీంద్రా నుంచి కొత్త కార్లు- పూర్తి వివరాలు..
మహీంద్రా నుంచి కొత్త కార్లు- పూర్తి వివరాలు..

ఈవీ మార్కెట్లో సరికొత్త వేగం..

ఎలక్ట్రిక్ విభాగంలో మహీంద్రా ఇప్పటికే తన పట్టును నిరూపించుకుంది. ఇటీవలే విడుదలైన ఎక్స్​ఈవీ 9ఈ, బీఈ 6 స్పెషల్ ఎడిషన్లు, త్రీ-రో (మూడు వరుసల) ఎక్స్​ఈవీ 9Sఎస్​ మోడళ్లకు కస్టమర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం 10 నెలల్లోనే ఈ మోడళ్లు 41,000 యూనిట్ల అమ్మకాలను దాటడం విశేషం. ఇదే ఊపులో కంపెనీ ఇప్పుడు ‘బీఈ 6’ మోడల్‌లో మరింత శక్తివంతమైన, రగ్గ్​డ్​గా ఉండే) కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది.

దీనికి 'Rall-E' అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఇది కూడా ఇన్​గ్లో ప్లాట్‌ఫామ్‌పైనే తయారవుతుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇది ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద చక్రాలు, అదనపు బాడీ క్లాడింగ్‌తో ఆఫ్-రోడ్ ప్రియులను ఆకట్టుకోనుంది.

స్కార్పియో, థార్​లలో కీలక మార్పులు..

డీజిల్, పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. మహీంద్రా తన ఐకానిక్ మోడళ్లయిన స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్ లకు మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ (అప్‌డేట్స్) ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న టెస్టింగ్స్ ప్రకారం.. వీటి ఎక్స్‌టీరియర్‌లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే క్వాలిటీ మెటీరియల్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) వంటి ఆధునిక ఫీచర్లు తోడయ్యే అవకాశం ఉంది. అయితే ఇంజిన్లలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.

మరోవైపు, 3-డోర్ మహీంద్రా థార్ కూడా కొత్త హంగులతో రాబోతోంది. థార్ రాక్స్నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఎలిమెంట్స్, మెరుగైన క్యాబిన్ సౌకర్యాలు, మరిన్ని డిజిటల్ ఫీచర్లతో ఈ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ అప్‌గ్రేడ్ కానుంది.

భవిష్యత్తు ప్రణాళికలు: 2027 వరకు..

మహీంద్రా 'విజన్ ఎస్' కాన్సెప్ట్ ఆధారంగా ఒక కొత్త సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యూవీని కూడా పరీక్షిస్తోంది. ఇది 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. NU_IQ ఆర్కిటెక్చర్ పై తయారయ్యే ఈ కారు, ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ కంటే పైన, తక్కువ బడ్జెట్ ఎస్‌యూవీగా నిలవనుంది.

త్వరలోనే థార్ ఆధారిత ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్, ఫ్రాంక్స్ సైజులో ఉండే 'విజన్ ఎక్స్' కాన్సెప్ట్ క్రాస్ఓవర్ కూడా రానున్నాయి. ఇక 4.6 మీటర్ల పొడవుతో ఉండే 'BE.07' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చే ఏడాదిలోనే మార్కెట్​లోకి అడుగుపెట్టనుంది.

మొత్తానికి మహీంద్రా అటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్లు, ఇటు పవర్‌ఫుల్ ఇంజిన్ వాహనాలతో తన ఎస్‌యూవీ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. మహీంద్రా స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఎప్పుడు విడుదలవుతాయి?

మహీంద్రా తన పాపులర్ మోడళ్లయిన స్కార్పియో ఎన్​, స్కార్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను 2026లో మార్కెట్​లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. వీటిలో ప్రధానంగా ఇంటీరియర్ అప్‌డేట్స్, అడాస్​ వంటి కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.

2. మహీంద్రా నుంచి రాబోయే ‘Rall-E’ మోడల్ ప్రత్యేకత ఏంటి?

మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కారు ఆధారంగా వస్తున్న ‘Rall-E’ ఒక ఆఫ్-రోడ్ వెర్షన్. ఇది సాధారణ ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, పటిష్టమైన బాడీ క్లాడింగ్, పెద్ద ఆఫ్-రోడ్ టైర్లను కలిగి ఉంటుంది. సాహసయాత్రలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.

3. మహీంద్రా BE.07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్, లాంచ్ వివరాలు ఏంటి

మహీంద్రా BE.07 సుమారు 4.6 మీటర్ల పొడవుతో ఉండే ఒక ప్రీమియం బోర్న్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 60-80 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది, ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More